ఏంటి ఈ దుశ్చర్య? ఈ దేశంలో తింటూ, బ్రతుకుతూ ఈ దేశ ప్రధాని మీద నిరసన పేరుతో అడ్డగించారంటే, భద్రతాపరంగా ఏదైనా జరగరానిది జరిగితే? ఇటువంటి వాటికి దిగారంటే వీళ్ళ ఉద్దేశ్యం ఏమిటి? ఎందుకు ఇలా తయారయ్యారు? ఇలాంటి చర్యలతో ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఏం సాధిస్తారు? ఇటువంటి దుర్మార్గమైన కార్యకలపాలకు ఒడిగడుతున్న వీళ్ళు దేశ ద్రోహులు కాకుండా ఇంకేమవుతారు.
అక్కడ “బైకుల మీద వెళ్తూ పాకిస్థాన్ జిందాబాద్” అనే నినాదాలు చేసున్నారంటే వీళ్ళు దేశానికి ఎంత ప్రమాదమో అర్ధం చేసుకోవాలి. ఇటువంటి ద్రోహులను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించ కూడదు. ఈ దుర్మార్గం వెనుక ఎవరెవరున్నారు? వీళ్ళకు పాకిస్థాన్‌తో గానీ, చైనాతో గానీ ఏమైనా సంబంధాలున్నాయా? ఈ దుర్మార్గం వెనుక విదేశీ హస్తం, ఇస్లాం మతోన్మాదుల, ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా అనే విషయాల మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి. ఈ కార్యక్రమానికి ఎవరైతే పాల్పడ్డారో వారికి ఏఏ దేశాల నుండి ప్రోత్సాహం ఉంది? ఇవి నిస్సందేహంగా కుట్రలు, కుతంత్రమే అని గనుక నిజమే అని నిర్ధారణ అయితే ఈ ద్రోహులకు సరయిన శిక్ష దేశ బహిష్కరణే. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళు చెద పురుగులలాంటి వారు. వీటిని నాశనం చేయకపోతే ఈ చెద అన్ని వైపులకు ప్రాకుతుంది.
మన మోదీ భారతదేశపు అత్యున్నత స్థానంలో ఉన్న ప్రధాన మంత్రి. అటువంటి ప్రధానికే భద్రత కరువయ్యిందంటే ఈ దేశంలో విదేశాల ఎంగిలి మెతుకులు తింటూ దేశానికే ప్రమాదంగా తయారయిన అంతర్గత దేశ ద్రోహుల కదలికలు ఎక్కువైనాయనిపిస్తుంది. దీనికి కారణం మితిమీరిన స్వేచ్ఛ ఉండటం కూడా ప్రమాదమే. స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితులను పెట్టుకోవాలి. ఎప్పుడో వ్రాసుకున్న, బూజుపట్టిన రాజ్యాంగాన్ని భద్రత, సమగ్రత, శ్రేయస్సులను దృష్టిలో పెట్టుకుని కొన్ని అత్యవసరమైన సవరణలతో తిరిగి వ్రాసుకుంటే మంచిదనిపిస్తున్నది.
నేడు దేశంలో జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలకు చెక్ పెట్టాలంటే ఈ చర్యలు తీసుకోక తప్పదు. ఇక నుంచి దేశంలో అత్యున్నత పదవులలో ఉన్న వారు పర్యటించే సమయాలలో వారి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల మీదే పూర్తిగా ఆధారపడకుండా కేంద్రంలో ఉన్న భద్రతాధికారుల చేత కూడా భద్రతా చర్యలను పర్యవేక్షించే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కేంద్ర భద్రతాధికారుల సూచనలను కూడా పరిగణనలోనికి తీసుకోవాలి.
– శర్మ సీహెచ్‌వీఎస్