Suryaa.co.in

Andhra Pradesh

8 నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జ్ లతో చంద్రబాబు సమీక్ష

పార్టీ వ్యవహారాలపై నేతలతో చంద్రబాబు రివ్యూ

అమ‌రావ‌తి: టిడిపి అధినేత చంద్ర‌బాబు పార్టీ వ్య‌వ‌హారాల‌పై య‌ధావిధిగా ప‌ని మొద‌లు పెట్టారు. కోవిడ్ కార‌ణంగా క్వారంటైన్ లో ఉన్న చంద్ర‌బాబు అన్లైన్ ద్వారా పార్టీ కార్య‌క్ర‌మాల‌పై నేతలతో రివ్యూ చేశారు. రాష్ట్రంలోని 8 నియోజ‌క‌వ‌ర్గాల టిడిపి ఇంచార్జ్ ల‌తో చంద్ర‌బాబు స‌మీక్ష జ‌రిపారు. ప‌లు జిల్లాల‌లోని ఇంచార్జ్ లు, కోఆర్డినేట‌ర్లతో విడివిడిగా మాట్లాడిన చంద్ర‌బాబు…..ఆయా నియోజ‌వ‌ర్గాల్లోని సంస్థాగ‌త అంశాల‌తో పాటు పార్టీ పోరాటాల‌పై లోతుగా స‌మీక్ష‌నిర్వ‌హించారు. ప‌నితీరు మెరుగు ప‌రుచుకోవాల‌ని ప‌లువురు నేత‌లకు చంద్ర‌బాబు గ‌ట్టిగా సూచించారు. ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై పోరాటంలో ఎక్క‌డా రాజీ ప‌డొద్ద‌న్ని నేత‌ల‌కు సూచించారు. చీపురుప‌ల్లి, భీమిలి, రంప‌చోడ‌వ‌రం, న‌ర‌సాపురం, గుంటూరు వెస్ట్, కోవూరు,బ‌ద్వేల్, మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గాలపై ఇంచార్జ్ ల‌తో చంద్ర‌బాబు మాట్లాడారు. ఇక సాయంత్రం ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా అందుతున్న సేవ‌ల‌పైనా వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్ష చేసిన చంద్ర‌బాబు……వారికి ప‌లు సూచ‌న‌లు ఇచ్చారు. కోవిడ్ తీవ్ర‌త నేప‌థ్యంలో…..రోగుల‌కు ఆన్లైన్ లో సేవ‌లు అందించే ప్ర‌క్రియ‌ను మ‌రింత విస్తృత ప‌ర‌చాల‌ని సూచించారు. రేపు మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ ఇంచార్జ్ ల‌తో చంద్ర‌బాబు నేరుగా మాట్లాడ‌నున్నారు.

LEAVE A RESPONSE