– ఆరోగ్య మంత్రి ..ఆత్మీయ పలకరింపు తో.. ప్రజల్లో ఆత్మవిశ్వాసం
– ఫీవర్ సర్వే లో ఆరోగ్య మంత్రి మాట మంత్రి
– స్వయంగా ఇంటిఇంటికి వెళ్లి ముచ్చటించిన మంత్రి
వైద్యులే కాదు..వైద్య అధికారులు అంత కన్నా కాదు..నేరుగా వైద్య ఆరోగ్య మంత్రి నే జ్వర సర్వే కు వచ్చారు.. ఆత్మీయంగా ముచ్చటించారు… కరోనా తో ఆందోళన లో ఉన్న ప్రజలకు ఆత్మవిశ్వాసం నింపారు.. వైద్యో నారాయణో హరి అనే పదానికి నిదర్శనం అని చూపారు.. తెలంగాణ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్నాము అని ప్రత్యక్షంగా చూపారు.
ఇంటింటి సర్వే లో.. మంత్రి మాట మంతి
మంత్రి : అమ్మ బాగున్నావా…! ఎలా ఉన్నావ్ .. ఆరోగ్యం బాగుందా.. టీకాలు వేసుకున్నారా?
గృహిణి : బాగుంది సర్.. డాక్టర్ లు ,ఆశ సిస్టర్ లు వస్తున్నారు సర్.. వ్యాక్సిన్ కూడా వేసుకున్న సర్..
మంత్రి : ఎం పోశవ్వ ఎన్ని టీకాలు వేసుకున్నావ్..
పోశవ్వ : ఒక్కటే ఏసుకున్న సర్..
మంత్రి : ఇంకా రెండు ఏసుకోవాలి ఎందుకు ఏసుకోలే..
పోశవ్వ : భయం అయితంది సర్..
మంత్రి : ఎందుకు భయం నేను ఉన్న ఏసుకో.. అని పోశవ్వ కు దగ్గర ఉండి టీకా ఏయించిన మంత్రి..
పోశవ్వ : నువ్ ఉన్నావ్ అని దైర్యం వచ్చింది .. ఏసుకున్న సర్..అని నవ్వుతూ చెప్పింది..
మంత్రి : అంజమ్మ మాస్క్ పెట్టుక్కోలే… ఇగో మాస్క్ పెట్టుకో..
అంజమ్మ : హరిశ్ అన్న వస్తుండు అంటే ఆగం ఆగం బయటకు వచ్చిన సర్ ..నువ్ ఉన్నాక మాకు అన్ని మంచిగానే ఉంటాయి సర్..
మంత్రి : ఎం దేవవ్వ ఎటు పోతున్నావ్.. టీకా వేసుకున్నావా…ఎన్ని టీకాలు వేసుకున్నవ్..
దేవవ్వ : వేసుకున్న సర్ ..
మంత్రి : రెండు వేసుకోవాలి..60 ఏళ్ళు నిండితే మూడోది కూడా వేసుకోవాలి అంటూ చెప్పారు..
మంత్రి : ఎం మల్లమ్మ బాగున్నావ.. మోరీల మురికి ఉందా..
మల్లమ్మ : బాగున్నా సర్..మురికి లేదు..దోమలు లేవు..
మంత్రి : టీకా వేసుకున్నావా… పిన్షన్ వస్తన్నద..
మల్లమ్మ : ఏసుకున్న సర్.. పింఛన్ వత్తంది సర్..
ఇలా ఇంటింటికి తిరుగుతూ.. జ్వరం ఉందా.. టీకా వేసుకున్నారా.. మాస్క్ ధరించాలి.. జాగ్రత్తగా ఉండాలి అంటూ ఆత్మీయంగా ముచ్చటించారు. అలా మంత్రి హరీశ్ రావు స్వయంగా వెళ్లి సర్వే చేయడం పట్ల ప్రజల్లో ప్రభుత్వం పై నమ్మకం కలిగింది. ఆత్మవిశ్వాసం నిండింది.