ప్రతి యొక్క హిందువు తప్పకుండ తెలుసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. అవి హిందువులు తమ జీవితకాలంలో మరొకరికి పంచవలసిన అంశాలు. అవి ఏమిటంటే…
1. లింగాలు : 3
పుం, స్త్రీ, నపుంసక.
2. వాచకాలు : 3.
మహద్వా, మహతీ, అమహత్తు.
3. పురుషలు : 3.
ప్రథమ, మధ్యమ, ఉత్తమ.
4. దిక్కులు : 4.
తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం.
5. మూలలు : 4.
ఆగ్నేయం, నైఋతి, వాయువ్యం, ఈశాన్యం.
6. వేదాలు : 4.
ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం.
7. ఉపవేదాలు : 4.
ధనుర్వేదం, ఆయుర్వేదం, గంధర్వ వేదం, శిల్ప
8. పురుషార్ధాలు : 4.
ధర్మ, అర్థ, కామ, మోక్షాలు.
9. చతురాశ్రమాలు : 4.
బ్రహ్మ చర్యం, గార్హస్య, వానప్రస్థం, సన్యాసం.
10. పంచభూతాలు : 5.
గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని.
11. పంచేంద్రియాలు : 5.
కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం.
12. భాషా భాగాలు : 5.
నామవాచకం, సర్వనామం, విశేషణం,
క్రియ, అవ్యయం.
13. ప్రధాన కళలు : 5.
కవిత్వం, చిత్రలేఖనం, నాట్యం, సంగీతం, శిల్పం.
14. పంచకావ్యాలు : 5.
ఆముక్తమాల్యద, వసుచరిత్ర, మనుచరిత్ర, పారిజాతాపహరణం, శృంగార నైషధం.
15. పంచగంగలు : 5.
గంగ, కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర.
16. దేవతావృక్షాలు : 5.
మందారం, పారిజాతం, కల్పవృక్షం,సంతానం, హరిచందనం.
17. పంచోపచారాలు : 5.
స్నానం, పూజ, నైవేద్యం, ప్రదక్షిణం, నమస్కారం.
18. పంచాగ్నులు : 5.
బడబాగ్ని, జఠరాగ్ని, కష్టాగ్ని, వజ్రాగ్ని, సూర్యాగ్ని.
19. పంచామృతాలు : 5.
ఆవుపాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె.
20. పంచలోహాలు : 5.
బంగారం, వెండి, రాగి, సీసం, తగరం.
21. పంచారామాలు : 5.
అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రా(ద)క్షారామం.
22. ధర్మరాజు అడిగిన ఊళ్ళు :
1. అవిస్థల/కుశస్థల (కన్యాకుబ్జ/Kannauj)
2. వారణావతం(ఇక్కడే లక్కఇల్లు కట్టించాడు దుర్యోధనుడు. మీరట్ నుండి 19కి.మీ. అనీ, కాదూ, ఋషీకేష్ దగ్గర శివపురి అనీ చరిత్రకారుల ప్రస్తావన)
3. వృకస్థల(గుర్గావ్ దగ్గర, హర్యానా)
4. మాకండి(గంగా నది ఒడ్డున ఓ పల్లెటూరు
(మరొక ఊరు కౌరవులకు ఏదనిపిస్తే ఆ ఊరు)
23. వేదాంగాలు(స్మ్రతులు) : 6.
శిక్ష , వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం.
24. షడ్రుచులు : 6.
తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు.
25. అరిషడ్వర్గాలు(షడ్గుణాలు) : 6.
కామం (అంటే కోరిక అని మాత్రమే అర్థం. అంటే మన మనసులో కావాలి అని కలిగే ప్రతిదీ కూడ కోరికే),
క్రోధం (అనగా కోపం లేదా ఆగ్రహం. మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు),
లోభం (అంటే తాను సంపాదించుకున్నది, పొందింది తనకే సొంతమని భావించడం. అందులో నుంచి పూచిక పుల్ల కూడా ఇతరులకు చెందకూడదని దాన, ధర్మాలు చేయకపోవడం),
మోహం(లేని దానిని అనుభవించాలన్న కోరిక),
మదం(అంటే కొవ్వు, పొగరు. మదం 8 రకాలు అంటే అష్టమదములు
అవి –
1. అన్నమదం,
2. అర్థమదం,
3. స్త్రీ మదం
4. విద్యామదం,
5. కులమదం,
6. రూపమదం,
7. ఉద్యోగమదం,
8. యౌవన మదం
మాత్సర్యం(తనకున్న సంపదలు ఇతరులకు ఉండకూడదని, తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి ఉండటం)
26. ఋతువులు : 6.
వసంత, గ్రీష్మ, వర్ష, శరద్ఋతువు, హేమంత, శిశిర.
27. షట్చక్రాలు : 6.
మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక,
అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలు.
28. షట్చక్రవర్తులు : 6.
హరిశ్చంద్రుడు, నలుడు, సగరుడు, పురుకుత్సుడు, పురూరవుడు,
కార్తవీర్యార్జునుడు.
29. సప్త ఋషులు : 7.
కశ్యపుడు, గౌతముడు, అత్రి, విశ్వామిత్రుడు,
భరద్వాజ, జమదగ్ని, వశిష్ఠుడు.
30. సప్తగిరులు : 7.
శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి,
వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి.
31. కులపర్వతాలు : 7.
మహేంద్ర, మలయ, సహ్య, శుక్తిమంతం, గంధమాధనం,
వింధ్య, పారియాత్ర.
32. సప్త సముద్రాలు : 7.
ఇక్షు, జల, క్షీర, లవణ, దధి, సూర, సర్పి.
33. సప్త వ్యసనాలు : 7.
జూదం, మద్యం, దొంగతనం, వేట,
వ్యభిచారం, దుబార ఖర్చు, కఠినంగా మాట్లాడటం.
34. సప్త నదులు : 7.
గంగ, యమునా, సరస్వతి, గోదావరి,
సింధు, నర్మద, కావేరి.
35. ఊర్ధ్వలోకాలు : 7.
భూ, భువర్ణో, సువర్ణో, తపో, జనో, మహా, సత్య.
36. అధోః లోకాలు : 7.
అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహ