ప్రఖ్యాత పత్రిక “ఖలీజ్ టైమ్స్(KT)”లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంటర్వ్యూ
సరికొత్త వాణిజ్యాన్ని ప్రోత్సాహించే దుబాయ్ కి ఆంధ్రప్రదేశ్ నుంచి మించిన పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదు.దుబాయ్ లో హైయెస్ట్ సర్క్యులేషన్ గల న్యూస్ పేపర్ లలో “ఖలీజా టైమ్స్”కు రెండో స్థానం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేకతలు, సహజవనరులు, పెట్టుబడుల అవకాశాలను ఇంటర్వ్యూ ద్వారా
వెల్లడించిన మంత్రి మేకపాటి.దశాబ్దాల చరిత్ర కలిగిన పత్రికగా..ఆలోచనలు, ఆవిష్కరణలు,ఆచరణలో పెట్టే సత్తా ఉన్న రాష్ట్ర పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని కలిసిన కేటీ పత్రికా యాజమాన్యం.వర్క్ ఫ్రం హోం టౌన్ కేంద్రాలు, నైపుణ్య కళాశాలల ఏర్పాటుతో ఏపీ యువత భవిష్యత్ కు మరో ముందడుగు.రాష్ట్రంలోని ప్రతి సాధారణ పౌరునికి ప్రభుత్వ సేవలన్నీ సమానంగా ఇళ్ళ ముంగిటకు చేర్చడంలో మా ప్రభుత్వం విజయం సాధించింది.ప్రజాసంక్షేమం, అవినీతిరహిత పాలన, సరికొత్త టెక్నాలజీ, కాలుష్యం లేని హరిత పరిశ్రమలు, సుస్థిర అభివృద్ధి మా ప్రభుత్వ ధ్యేయం.