కమీషన్ల కోసం కక్కూర్తిపడే సీఎం ఉన్నంత కాలం ప్రజలకు కరెంటు కష్టాలు తప్పవు

– టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి
కమీషన్ల కోసం కక్కూర్తిపడే సీఎం ఉన్నంత కాలం ప్రజలకు కరెంటు కష్టాలు తప్పవని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పేర్కొన్నారు. బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు మీ కోసం… గత నాలుగైదు రోజులుగా కరెంటు కోతలు విపరీతంగా పెరిగాయి. విద్యుత్ చార్జీలు కూడా పెరగడంతో వినియోగదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా జగన్ చేతకానితనంతోనో, అనుభవ రాహిత్యంతోనో, ముందు చూపు లేకనో అని అని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఆయనకుచేతకాక విద్యుత్ కోతలున్నాయని అందరూ అనుకుంటున్నారు. ఇది కేవలం అతని చేతివాటం. పీపీఏలు రద్దు చేసి కృతిమ కొరత సృష్టించి ఆడుతున్న నాటకం.
చంద్రబాబునాయుడు విద్యుత్ విషయంలో చాలా ప్రణాళికాబద్ధంగా చేసి వెళ్లారు. జగన్ అధికారంలోకి రాగానే దీనిపై కన్ను పడింది. పీపీఏలను సమీక్షించాలని కమిటీ వేశారు. ఆ కమిటీ వేయడం తప్పని హైకోర్టు జీవో ను కొట్టేయడం జరిగింది. పీపీఏలను రద్దు చేసి ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే విదేశాల నుంచి పెట్టుబడులు రావని కేంద్రం నిక్కచ్చిగా చెప్పి మందలించడం కూడా జరిగింది. జగన్ రెడ్డి తప్పుడు విధానాల వల్ల, పీపీఏల రద్దు విధానాలతో కొత్త పాలసీని తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు.
ఈయన దృష్టంతా గత ప్రభుత్వంలో ఉన్న పీపీఏలతో నేడు విద్యుత్ ను కొనకుండా చేయాలనేదే ఉద్దేశం. కృతిమ కొరత సృష్టించాలన్నదే అతని పాలసీ. గతంలో కొంటుండిన రేటును రద్దు చేసి ఇప్పుడు 21 రూపాయలకు కొనేట్టుగా అతని ప్లాన్. వైసీపీనుండి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి.. గ్రీన్ కో కంపెనీ నుండి విద్యుత్ ను కొనే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. 21 రూపాయలతో కొంటున్నందుకు జగన్ కు కమీషన్ ముడుతోంది. ఇలా అనేక రంగాల్లో కృతిమ కొరతను సృష్టించి పీపీఏలను రద్దు చేసి వారు చెప్పినంత రేటుకు కొనడం జగన్ చేసే పని. ఇది జగన్ లాజిక్. కేంద్రం, హైకోర్టునుంచి అతనికి అడ్డంకులు ఎదురైనప్పుడుల్లా ఇలా వ్యవహరిస్తుంటాడు.
ఏదైనా ఆటోమేటిక్ గా వారితో కొనడమనేది స్టాప్ చేస్తాడు. స్టాప్ చేసినప్పుడు వారు ఉత్పత్తి స్టాప్ చేస్తారు. దాంతో కృతిమ కొరత ఏర్పడుతుంది. పీపీఏల నిబంధనల ప్రకారం కంపెనీలు ఉత్పత్తిని తగ్గించేస్తాయి. స్థిర చార్జీల కింద వారికి కొంత అమౌంటు పే చేయాల్సివస్తుంది. ఎటు తిరిగి ప్రజలపై భారం పడుతోంది. తన ఆదాయం కోసం, తన కమీషన్ల కోసం వారికి స్థిర చార్జీలు పేమెంట్ చేస్తూ రాష్ట్ర ఖజానాకు గండికొడుతున్నారు. మద్యంలో ఆయన బ్రాండ్లే పెట్టి అందులోను ఆదాయం పొందుతున్నాడు. ఇసుకను సెంట్రలైజ్ చేసి ఆ కాంట్రాక్టును ఒకరికే ఇచ్చి ఆదాయం పొందుతాడు. అమ్మఒడిలో 15 వేలు ఉంటే 14 వేలు వారి అకౌంట్లలో వేసి వెయ్యి రూపాయలు సానిటరీ చేసే వాళ్లకు జీతాల కోసమని కట్ చేసుకొని అవినీతికి పాల్పడుతున్నాడు. కరోనా సమయంలో 250 కోట్లు స్క్యామ్ చేశాడు. ఇలా ప్రతి దాంట్లో కూడా తన ఆదాయం తన ఇంటికి వచ్చేలా చూసుకుంటుంటాడు.
సాయంత్రమయ్యేసరికి లెక్కాచారాలు తీసుకోవాలి. ఇటీవల మటన్, చేపలు అమ్మడం ప్రారంభించాడు. హెవీ వర్క్ లోడ్ కావడంతో రాష్ట్రం గురించి పెట్టించుకోవడంలేదు. ఈయన కొత్త పాలసీని తెచ్చే ప్రయత్నం చేశారు. కమీషన్ ఏ రకంగా వస్తుంది?, కృతిమ కొరత ఏ విధంగా సృష్టంచాలా? పీపీఏలు ఏవిధంగా రద్దు చేయాలా అనేదే జగన్ ఆలోచిస్తుంటాడు. అతని తప్పడు విధానాలపైట్ల హైకోర్టు నుంచి అడ్డంకులు వచ్చాయి. రాష్ట్ర ఉత్పత్తి తగ్గించారు. ప్రజలపై భారం పడుతోంది. ట్రూఅప్ చార్జీల పేరుతో అదనపు భారం పడుతోంది.
ప్రభుత్వ సొమ్ముతో అధిక ధరలకు విద్యుత్ కొనడం ఉత్పత్తిదారులకు కొంత ఇవ్వడము, మిగతాది అతను కమీషన్ తీసుకోవడం జరుగుతోంది. ఇది రాజన్న రాజ్యమో, కోతల రాజ్యమో ప్రజలు గ్రహించారు. అవసరానికి రాజశేఖర్ రెడ్డి పేరు ఉపయోగించుకుంటాడే తప్ప ఆచరణలో మంచి పథకాలకు తూట్లు పొడుస్తుంటాడు. 6 వేల కోట్లు కూడా బకాయిలను చెల్లించి చంద్రబాబునాయుడు విద్యుత్ సరఫరాకు మార్గం సుగమం చేశారు. కమీషన్ల కోసం కక్కూర్తి పడే సీఎం ఉన్నన్నాళ్లు పరిస్థితి బాగుపడదని ఎమ్మెల్సీ బీటెక్ రవి ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో తెలిపారు.

Leave a Reply