Home » డీజీపీ తాటాకు చప్పుళ్లకు తెలుగుదేశం పార్టీ భయపడేది లేదు

డీజీపీ తాటాకు చప్పుళ్లకు తెలుగుదేశం పార్టీ భయపడేది లేదు

– రాష్ట్ర యువత భవితకోసం పోరాడుతున్న టీడీపీకీ నోటిసులిస్తారా?
– డీజీపీ పంపిన నోటీసులు చిత్తుకాగితాలతో సమానం
– డీజీపీ న్యాయస్థానంలో నిలబడి ఐపీసీసెక్షన్లు చదివినప్పుడే, రాష్ట్రపోలీస్ శాఖ పరువుపోయింది
– మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న టిడిపిని డిజిపి నోటీసులు ఆడ్డుకోలేవు
– తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
డ్రగ్స్ వ్యవహారంలో అధికారపార్టీనేతల ప్రమేయాన్ని ఎత్తిచూపామన్న అక్కసుతోనే చంద్రబాబుసహా టిడిపి నేతలకు డిజిపి నోటీసులు పంపారు. డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఎన్ఐఎ జరిపిన సోదాల్లో విజయవాడల ఆషీ ట్రేడింగ్ కంపెనీలో కొన్ని డాక్యుమెంట్లనుకూడా సీజ్ చేసింది. తమ అనుమతి లేకుండా తనిఖీలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని ఎన్ఐఎ కి కూడా డిజిపి నోటీసులు ఇస్తారా? రాష్ట్ర యువత భవిష్యత్ ను కాపాడాల్సిన డీజీపీ తాడేపల్లి ప్యాలెస్ కు సరెండర్ అయి మాకు నోటీసులు పంపాడు. మాతో పాటు వాస్తవాలను ప్రజలముందుంచుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాసంస్థలకు నోటిసులిచ్చాడు.
గుజరాత్ లోని ముంద్రాపోర్టులో పట్టుబడిన హెరాయిన్, దానితో ఏపీకి ఉన్నలింకులపై బీబీసీ, రిపబ్లిక్ టీవీసహా, అనేక జాతీయ మీడియాసంస్థలు కూడా కథనాలు ప్రసారంచేశాయి. బిబిసి, ఇతర నేషనల్ మీడియాకు నోటీసులిచ్చే దమ్ము, ధైర్యం ఈ డీజీపీకి ఉన్నాయా? డ్రగ్స్ విషయంలో ఎపికి సంబంధం లేదని డిజిపి చెబుతున్నారు. ఎన్ఐఏ తాము నిర్వహించిన సోదాల తాలూకూ ఇచ్చిన పత్రికాప్రకటనలను డీజీపీ చదివినట్లు లేరు. మాదకద్రవ్యాల వ్యవహారంలో పోలీస్ శాఖ నిర్లిప్తతను ప్రశ్నించిన ప్రతిపక్షనేతలు,మీడియాసంస్థలకు నోటీసులిచ్చాడు.ఏపీ పోలీస్ శాఖ పరువు ప్రతిష్టలు, గౌరవమర్యాదలు మంటగలిశాయని డీజీపీ తమకిచ్చిన నోటీసుల్లో చెప్పాడు. తమకు క్షమాపణలు చెప్పాలని డీజీపీ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. డీజీపీ ఎప్పుడైతే చేతులుకట్టుకొని న్యాయస్థానంలో నిలబడి ఐపీసీ సెక్షన్లు అప్పజెప్పాడో ఆరోజే ఏపీ పోలీస్ పరువుపోయింది. ఆ విషయం డీజీపీ మరచినా రాష్ట్ర ప్రజలెవరూ మర్చిపోలేదు. డీజీపీకి, ఏపీ పోలీస్ శాఖకు దమ్ము,ధైర్యం, పౌరుషముంటే డ్రగ్స్ వ్యవహారంలో మునిగితేలుతున్న వైసీపీనేతలను విచారించాలి.
అధికార పార్టీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, సామినేని ఉదయభాను వ్యవహారాలను నిగ్గుతేల్చాలి. ఆషీకంపెనీకి, స్మగ్లర్ అలీషాకు ఉన్న లింకేమిటో బహిర్గతపరచాలి. డ్రగ్స్ దందాతో ప్రమేయమున్న రాష్ట్రముఖ్యమంత్రి, ఆయనసోదరులు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి సహా ఏ ఒక్కరినీ టీడీపీ వదిలిపెట్టదని డీజీపీ తెలుసుకుంటే మంచిది. మాదకద్రవ్యాల గుట్టుమట్లు, వైసీపీనేతల ప్రమేయంపై తమవద్ద ఉన్న సమాచారాన్ని నేరుగా కేంద్రదర్యాప్తు సంస్థలకే అందిస్తాం. రాష్ట్ర యువతను బలితీసుకుంటూ అక్రమార్జనకు పాల్పడుతున్న అధికారపార్టీ ఆటకట్టించేవరకు ఏ విధమైన బెదిరింపులకు తెలుగుదేశం పార్టీ బెదిరేది లేదు. డ్రగ్స్ దందాతో ప్రమేయమున్న రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి సహా ఏ ఒక్కరినీ టీడీపీ వదిలిపెట్టే ప్రసక్తిలేదు.
గుజరాత్ లోని ముంద్రాపోర్టులో కొన్నివేలకోట్లవిలువైన హెరాయిన్ పట్టుబడటం, దానికి సంబంధించిన మూలాలు ఏపీతో ముడిపడి ఉండటంపై నిత్యం ప్రసారమాధ్యమాల్లో వస్తున్న వార్తలను చూస్తూనేఉన్నాం. అషీ ట్రేడింగ్ కంపెనీపేరుతో మాచ వరపుసుధాకర్, అతనిభార్యవైశాలి లు విజయవాడ నడిబొడ్డున నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల వ్యాపారానికి సంబంధించిన అంశాలపై పత్రికలు కోడై కూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలనుంచి పెద్దఎత్తున ఏపీకి హెరాయిన్ దిగుమతి అవుతున్న తరుణంలో ఏపీప్రజలు తీవ్రమైన భయాందోళనల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రజలు, వారిబిడ్డల భవిష్యత్ దృష్ట్యా తీవ్రంగా ఆందోళన వ్యక్తంచేస్తు న్న నేపథ్యంలో బాధ్యతగల ప్రతిపక్షపార్టీగా తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని నిత్యం నిలదీస్తూనే ఉంటుంది.
ఏపీకేంద్రంగా ఇంత పెద్దఎత్తున మాదకద్రవ్యాలవ్యవహారం జరుగుతుంటే దానిపై తొలి నుంచీ నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నఏపీ పోలీస్ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంచేయడమే గాక బెదిరింపు ధోరణితో ఏపీ పోలీస్ శాఖ మాకు నోటీసులు పంపింది. టీడీపీఅధినేత చంద్రబాబునాయుడు గారుసహా పలువరు నేతలకు డీజీపీ స్వయంగా నిన్న నోటీసులు పంపారు. టీడీపీనేతలతో పాటు, ఈనాడు మీడియాసంస్థలు, ఆంధ్ర జ్యోతి సంస్థతోపాటు, సదరుసంస్థల యాజమాన్యాలు, సిబ్బందికి కూడా డీజీపీ నోటీసులు పంపారు. ఈ సందర్భంగా డీజీపీని కొన్ని సూటి ప్రశ్నలు అడుతున్నాం. ఏపీకేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందాలో ప్రమేయమున్న తాడేపల్లిపెద్దలను కాపాడటం కోసం, మాదకద్రవ్యాల వ్యవహారాన్ని కప్పిపుచ్చడం కోసమే డీజీపీ మాకునోటీసులు పంపారా? డీజీపీ పంపిన నోటీసుల్లో ఏంరాశారో కూడా ప్రజలకు తెలియాలి.
మాదకద్రవ్యాల గురించి మాట్లాడినందుకు టీడీపీనేతలు డిజిపికి క్షమాపణలుచెప్పాలా? క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా చర్యలుతీసుకుంటామని కూడా డీజీపీ తానిచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. డీజీపీ నోటీసులకు భయపడి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. రాష్ట్ర, రాష్ట్రయువత భవిష్యత్ కోసం టీడీపీ ఉద్యమాన్నికొనసాగించి తీరుతుంది. డీజీపీ పంపిన నోటీసులు మాకు చిత్తు కాగితాలతో సమానం. మత్తుపదార్థాల ఎగుమతి, దిగుమతి, క్రయ విక్రయాలు, రవాణా, అక్రమార్జన వంటివ్యవహారాల ఎంతటి వారున్నా టీడీపీ వదిలిపెట్టదు. రాష్ట్రముఖ్యమంత్రైనా, ఆయన సోదరులు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డిఅయినా, అధికారపార్టీ ఎమ్మెల్యేలైన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, సామినేని ఉదయ భాను అయినా, స్మగ్లర్ అలీషా అయినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.
డీజీపీ తన సమయాన్ని వృథాచేసుకోకుండా తాను వేసుకున్న ఖాకీచొక్కాపై ఏమాత్రం గౌరవమున్నా, రాష్ట్ర యువత భవిష్యత్ పై ఏమాత్రం శ్రద్ధఉన్నా తనవిధినిర్వహణపై ఆయనకు చిత్తశుద్ధిఉంటే డ్రగ్స్ అక్రమ రవాణాపై తక్షణమే విచారణజరిపి, తరువాత మాట్లాడాలి. ఎప్పుడైతే సవాంగ్ లాంటి వారు ఐపీఎస్ ను ( ఇండియన్ పోలీస్ సర్వీస్ ) జగన్ పర్సనల్ సర్వీస్ లా (జేపీఎస్) మార్చేశారో ఆరోజే రాష్ట్ర పోలీస్ ప్రతిష్ట మసకబారింది. ఈ విషయాన్ని డీజీపీ మర్చిపోయాడేమో గానీ ప్రజలెవరూ మర్చిపోలేదు. తాడేపల్లి ప్యాలెస్ఆదేశాలప్రకారం ఆడమన్నట్లు ఆడినప్పుడే ఏపీ పోలీస్ గౌరవం, ప్రతిష్ట మసకబారి మంటగలిశాయి.
మాదకద్రవ్యాల కేసువిచారణ చేపట్టిన వెంటనే ఎన్ఐఏ 6-10-21న ఇచ్చిన పత్రికాప్రకటనను డీజీపీ చదవలేదా? అషీ ట్రేడింగ్ కంపెనీ, దాని యజమాని మాచవరపు సుధాకర్, ఆయన భార్య వైశాలి పేర్లను ముద్దాయిలుగా పరిగణిస్తూ ఎన్ఐఏ ప్రకటనలో ఎందుకుందో డీజీపీ చెప్పాలి?విజయవాడ నగరంలోని ఒక సంస్థపేరుని ఎన్ఐఏ స్పష్టంగాచెబితే ఏపీకి ఎలాంటి సంబంధంలేదని డీజీపీ ఎలా చెబుతాడు? ఎన్ఐఏ ప్రకటనను మరుగునపెట్టి ఏ ఉద్దేశంతో డీజీపీ, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఏపీకి, డ్రగ్స్ కు సంబంధం లేదని చెప్పారు?
ఈనెల 9వతేదీన ఎన్ఐఏ ఇచ్చిన రెండో పత్రికా ప్రకటనలోకూడా గుజరాత్ లోని ముంద్రాపోర్టులో పట్టుబడిన హెరాయిన్ కు సంబంధించి విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీలోసోదాలు జరిపామని చెప్పారు. సోదాల్లో కొన్ని విలువైన డాక్యుమెంట్లు సీజ్ చేశామని కూడాచెప్పారు. ఎన్ఐఏ ఇచ్చిన రెండు పత్రికా ప్రకటనలు డీజీపీ చదవలేదా? వాటిని చూసి కూడా చూడనట్లుగా ప్రజలను పక్కదారి పట్టించడానికి కొన్నిపడికట్టు పదాలు వెదికి వాటిని మాకు ఇచ్చిన నోటీసుల్లో చేర్చారు. ఎన్ఐఏ ఇచ్చిన రెండు పత్రికాప్రకటనలు తనవద్దఉన్నాయి. వాటిని దగ్గరపెట్టుకొనే మాట్లాడుతున్నాను. తాను అడిగే ప్రశ్నల కు డీజీపీ ఏం సమాధానంచెబుతారు? తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడుతుంది. డీఆర్ఐ వారు తెలంగాణపోలీసులు రాష్ట్రసరిహద్దుల్లో అప్రమత్తంగా ఉం డాలని హెచ్చరించిన వార్తలు జాతీయమీడియాలో వచ్చాయి. ప్రపంచప్రఖ్యాతి గాంచిన బీబీసీ సహా, రిపబ్లిక్ న్యూస్ ఛానల్ సహా, అనేక జాతీయ మీడియా ఛానళ్లలోవచ్చిన కథనాలపై డీజీపీ ఏంచెబుతారు?
తాడేపల్లి ప్యాలెస్ లోని పెద్దలను కాపాడేందుకు డిజిపి తాపత్రయ పడుతుంటే, అందుకు బులుగు మీడియా వత్తాసుపలుకుతోంది. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వారు రెండ్రోజులక్రితం విడుదలచేసిన పత్రికాప్రకటనతో తాడేపల్లి ప్యాలెస్ లో, వారికి వంతపాడుతున్న బులుగు మీడియాలో వణుకు మొదలైంది. దర్యాప్తులో భాగంగా విజయవాడలో తాము సోదాలు జరిపామని, కొన్నిడాక్యుమెంట్లను సీజ్ చేశామని ఎన్ఐఏ చెబితే దానిగురించి బులుగుమీడియా ఎందుకు చెప్పలేదు? దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోనే పెద్దఎత్తున ఎందుకు గంజాయి సాగు జరుగుతోంది? రాష్ట్ర సరిహద్దులనుంచి గంజాయి అక్రమరవాణా జరుగుతున్నది నిజంకాదా? మత్తుపదార్థాలు, అక్రమమద్యం, గంజాయి వంటివి రవాణా అవుతుంటే ఏపీ పోలీస్, ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఎస్ఈబీ ఏంచేస్తున్నాయి? రాష్ట్రంలో ఎస్ ఈబీ సేల్స్ ఎంకరేజ్ మెంట్ బ్యూరోగా మారిందని ఎప్పుడో చెప్పాం.
డిజిపి ఇచ్చిన నోటీసులపై న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటాం. ఎన్ఐఏ ప్రకటనలపై పోలీస్ శాఖ ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి గూండాలు బహిరంగంగా పత్రికా విలేకరులను ఇసుకలారీలతో తొక్కిస్తానని బెదిరించిన రోజున ఏపీ పోలీస్ ఏం చేస్తోంది? ఒక ఆకురౌడీ, మాజీ ముఖ్యమంత్రి ఇంటిపైకి దాడికివచ్చినప్పుడు ఏపీ పోలీస్ ఏంచేసిం ది? డీఐజీ త్రివిక్రమవర్మ నిర్వాకమేంటో, గంజాయివ్యవహారంలో అతనిప్రమేయమేంటో డీజీపీకి తెలియదా? అలాంటి డీఐజీ ప్రతి పక్షనేతఇంటిపైకి దాడిచేయడానికివచ్చిన ఆకురౌడీని సమర్థిస్తా డా? డీజీపీ నోటీసులకు క్షమాపణచెబుతామని కలలో కూడా భావించొద్దు. మావద్ద ఉన్న సమాచారాన్ని ఎన్ఐఎకి అందించి దోషులకు శిక్షపడేవరకు పోరాటం కొనసాగిస్తాం.
రాష్ట్ర ముఖ్యమంత్రి తమ ధనదాహం కోసం అత్యంత నీచమైన డ్రగ్స్ వ్యాపారంతో రాష్ట్రయువతను నాశనంచేసి తనఖజానా నింపుకోవడా నికి ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్రంలో యువతను నిర్వీర్యం చేసే అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల ఉచ్చు నుంచి కాపాడేందుకే తెలుగుదేశం పార్టీ ఈ అడ్డగోలు డ్రగ్ వ్యవహారంపై టీడీపీ పెద్దఎత్తున ఉద్యమానికి పూనుకుంది. ఈ విషయంలో అసలు దోషులెవరో తేల్చి శిక్షపడేవరకు తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరాటం కొనసాగిస్తుంది. డ్రగ్స్ గురించి కథనాలు రాసిన, ప్రసారంచేసిన మీడియావారికి నోటీసులిచ్చిన పోలీసులు…భవిష్యత్ లో ఆవార్తలు చదివారని, చూశారని ప్రజలకు నోటీసు లిచ్చినా ఆశ్చర్యంలేదు.

Leave a Reply