Suryaa.co.in

Andhra Pradesh

రాయలసీమ రైతాంగాన్ని కాపాడే జూరాలను ఎందుకు వదిలేశాడు?

– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
కృష్ణా నదీ జలాల వివాదంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు తొలి నుంచీ సామరస్యపూర్వక ధోరణితోనే సాగాయని, రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన జిల్లాలకు నీటి పంపిణీలో తొలిప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, సాగు తాగునీటి కేటాయింపుల్లో ఎలాంటి వివాదాలు లేకుండా ఇరురాష్ట్రాలు వ్యవహరించడం జరిగిందని, ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో 511 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు అన్నఒప్పందానికి కట్టుబడే నీటివినియోగం చేయడంజరిగిందని, ఆప్రకారంగానే చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగాఉన్నసమయంలో కేంద్ర జలవనరుల శాఖకార్యదర్శి వద్ద 2015లో ఇరురాష్ట్రాలు ఉమ్మడి ఒప్పం దం చేసుకున్నాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
కేంద్ర జల వనరుల శాఖ ఇరు రాష్ట్రాల ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకొని, రెండురాష్ట్రాల అధికారులతో మాట్లాడి, మే27-2016లో ఒకడ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారు చేయడం జరిగింది. కేఆర్ ఎంబీ, జీఆర్ ఎంబీ లను కూడా సదరుడ్రాఫ్ట్ పరిధిలోచేర్చారు. ఆ డ్రాఫ్ట్ రూపకల్పనకు ఆనాడు ఇరురాష్ట్రాల జలవనరుల శాఖాధికారులు తగిన సమాచారంకూడా ఇచ్చారు.ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై జగన్మోహన్ రెడ్డికి, ఆయనప్రభుత్వానికి అవగాహన ఉందా అని తాను ప్రశ్నిస్తున్నాను. డ్రాఫ్ట్ నోటిఫికేష న్లో జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ లిఫ్ట్ఇరిగేషన్లుసహా, మరికొన్ని ఇతరప్రాజెక్టుల వివరాలను స్పష్టంగా పేర్కొన్నారు.
నారాయణపూర్ నుంచి వచ్చే ప్రతిచుక్కనీటిని సద్వినియోగం చేసుకునేలా ఏర్పాటుచేసిన, కృష్ణా నదీజలాలలకు గేట్ వే అయిన జూరాలప్రాజెక్ట్ ను ఎందుకు బోర్డు నియంత్రణలోకి తీసుకురాలేదో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమాధానంచెప్పాలి. శ్రీశైలం, నాగార్జన సాగర్ ను బోర్డుకి అప్పచెప్పిన ముఖ్యమంత్రికి జూరాలఎందుకు కనిపించలేదు? పక్కరాష్ట్రం రాబోయేరోజల్లో 150 టీఎంసీలు వాడుకునేలా జూరాలప్రాజెక్ట్ కు దిగువన నిర్మాణాలు జరుగుతుం టే, రాయలసీమ రైతాంగం గొంతుకోసేవిధంగా, ఈ ముఖ్యమంత్రి వ్యవహరించాడు. జూరాలప్రాజెక్ట్ దిగువన పొరుగురాష్ట్రం నిర్మిస్తు న్న ప్రాజెక్ట్ లను ఈ ముఖ్యమంత్రి ఎలా అనుమతిస్తాడు?
రాష్ట్ర జలవనరులశాఖాధికారులు ప్రాజెక్టుల నిర్మాణానికి, పొరుగురాష్ట్రం అదనంగా నీటిని తరలించడానికి ఎలా వంతపాడతారని తాను ప్రశ్నిస్తున్నాను. జగన్ రెడ్డి, ఏపీ జలవనరులశాఖాధికారులు తక్షణమే రాష్ట్ర రైతాంగానికి సమాధానంచెప్పాలి. వారికివారికీ స్నేహాలు, బిర్యానీ మీటింగ్ లు, శాలువాలుకప్పుకునే వ్యవహారా లు, భూఒప్పందాలుంటే ఉండొచ్చుకానీ, రాష్ట్రరైతాంగం హక్కు లను తాకట్టుపెట్టే అధికారం, ఈముఖ్యమంత్రికి ఎవరిచ్చారు? భవిష్యత్ తో తెలుగుగంగనుంచి లక్షలఎకరాలకు సాగునీరు, లక్షలాదిమందికి తాగునీరు ఎలా వెళుతుందో, ఎక్కడినుంచి వెళుతుందో ముఖ్యమంత్రి చెప్పాలి.
మచ్చుమర్రి, తెలుగుగంగ, పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ అన్నీ , ఈ ముఖ్యమంత్రి బోర్డుకి అప్పగిం చాడు. రాయలసీమ పట్టిసీమ అయిన మచ్చుమర్రి లేకుంటే, ఆప్రాంతానికి నీరెలా ఇస్తాడు. ఇన్ని అప్పచెప్పిన జగన్ రెడ్డి, జూరాలను ఎలా వదిలేశాడు? జూరాల కెనాల్, కల్వకుర్తినెట్టెంపాడు, బీమాసాగర్ లను ఎందుకు వదిలేశాడో, ఆ అధికారం ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చాడో ఆయనే సమాధానం చెప్పాలి. ఎన్నికల్లో ఈ ముఖ్యమంత్రిగెలుపుకోసం పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి సహకరించాడని జూరాలప్రాజెక్ట్ ను , కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)పరిధిలోకి తేకుండా వదిలేస్తాడా ?
నిన్న కేఆర్ ఎంబీ తీర్మానంచేస్తే, అందుకు ఏపీ అధికారులు తలలూపుతారా? జూరాలను తాకట్టుపెట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? అయిదేళ్లు అధికారంలోఉండి గాలికిపోయే ప్రభుత్వా నికి అంతటి అధికారంఎవరిచ్చారు? రాష్ట్రరైతాంగం హక్కులను, వందలఏళ్ల చరిత్రను, నీటివినియోగంపై తరతరాలనుంచిఉన్న అధికారాన్ని తాకట్టుపెట్టే అధికారం ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చా రు? జూరాలనుంచి దిగువకు నీరురాకపోతే, రాయలసీమకు నీరు ఎక్కడినుంచి వస్తుంది. కృష్ణాడెల్టాకు అవసరమైన సాగునీరు ఈ ప్రభుత్వం ఎక్కడినుంచి తెస్తుంది? ముఖ్యమంత్రి అసమర్థుడు కాబట్టే, అధికారులు ఈ విధంగా బాధ్యతలేకుండా వ్యవహరిస్తు న్నారు. జగన్ రెడ్డి తండ్రేమో గతంలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు మిగులుజలాలపై హక్కులు అడగబోమని కాగితాలు రాసిచ్చాడు.
రాజశేఖర్ రెడ్డి నిర్వాకంతో 448 టీఎంసీల కృష్ణా జలాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది. తండ్రి ఆనాడు అలా చేస్తే, నేడు కొడుకు ఇలాచేస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి వద్దనుకున్న 448 టీఎంసీల్లో కర్ణాటక, మహారాష్ట్ర 250టీఎంసీలు దొబ్బుకెళ్లాయి. మిగిలిన నీటిని మహారాష్ట్ర కాజేసింది. రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం ముసుగు లో దోపిడీచేయడానికి 448 టీఎంసీ లను, పొరుగురాష్ట్రాలకు ధారాధత్తంచేశాడు. దానిపై సుప్రీంకోర్టులో ఎస్ఎల్ పీ (స్పెషల్ లీవ్ పిటిషన్) ఇప్పటికీ పెండింగ్ లోఉంది. ఆ వ్యవహారం ఒక కొలిక్కిరాకముందే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టిప్రాజె క్ట్ లో గేట్లఅమరికకు సిద్దమైంది. అదనంగా 18గేట్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఇవన్నీ మాట్లాడితే మాపై కేసులపెడతారు?
జగన్మోహన్ రెడ్డి నిర్వాకంవల్ల పొరుగురాష్ట్రం 29నెలలనుంచీ విద్యుత్ ఉత్పత్తి సాగిస్తోంది. కృష్ణా, గోదావరి నదులపై నిర్మాణంలో ఉన్న 32ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోచేర్చిన జగన్ ప్రభుత్వం అంతిమంగా గుండుకొట్టించుకుంది. తుంగభద్రబోర్డుద్వారా నేటికీ మనవాటాగా రావాల్సిన నీరు రావడంలేదు. కర్ణాటక రాష్ట్రంఎప్పటి కప్పుడు కొత్తకొత్త లిఫ్టులుకడుతోంది. దానివల్ల అనంతపురం, కర్నూలుజిల్లాలకు తీవ్రంగా అన్యాయంజరుగుతోంది. ఇంత జరుగుతున్నా, 28ఎంపీలుచేతిలోఉన్నా, ఈముఖ్యమంత్రి ప్రధానితో ఎందుకుమాట్లాడలేకపోతున్నాడు? ఏపీకి జరుగుతు న్న అన్యాయంపై ముఖ్యమంత్రి నోరుతెరవడా? రాయలసీమకు భవిష్యత్ తాగు,సాగునీరు దొరకని దుస్థితి తలెత్తబోతోంది. గేట్ వేఆఫ్ కృష్ణా అయిన జూరాలనుంచి 150టీఎంసీలు పొరుగరాష్ట్రానికి వెళిపోతే, రాయలసీమకు తాగుసాగునీరు ఎలా అందుతుందో ముఖ్యమంత్రి తక్షణమే ప్రజలకు చెప్పాలి.
జూరాల వ్యవహారం అలాఉంటే, నాగార్జున సాగర్ కుడికాలువక హెడ్ రెగ్ల్యులేటర్ పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలనుకూడా కేఆర్ ఎంబీకి అప్పచెప్పేశాడు. మరోపక్క నాగార్జునసాగర్ ఎడమకాలు వ కింద మూడుజోన్లున్నాయి. వాటిలో తొలిజోన్ నల్గొండ, రెండో జోన్ నల్గొండ, ఖమ్మం, మూడోజోన్ కృష్ణా,ఖమ్మం జిల్లాలు. ఆ మూడుజోన్లకింద 17, 18 ఆఫ్ టేక్స్ ఉంటే, అవన్నీ బోర్డు నియంత్ర ణ పరిధిలోకి ఎందుకు తేలేదు? ఆఫ్ టేక్స్ బోర్డు నియంత్రణ పరిధిలో లేకపోతే, కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేట, మైల వరం, తిరువూరు నియోజకవర్గాలకు తాగు, సాగునీరుఎలా అందుతుంది? నాగార్జునసాగర్ ఎడమకాలువ ఆఫ్ టేక్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డిప్రభుత్వం గాలికి వదిలేయడంవల్ల దాదాపు 32 టీఎంసీల నీరు దక్కకుండాపోతోంది. ఈ విధంగా ఏపీకి సాగునీటి ప్రాజెక్టులపరంగాఇంత అన్యాయంజరుగుతుంటే, ఈముఖ్యమంత్రి శుభ్రంగా తడిగుడ్డేసుకొని ఇంట్లో పడుకున్నాడు.
చంద్రబాబునాయడి హాయాంలో కేంద్రజలవనరులశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ స్పష్టంగాఉంటే దాన్ని పట్టించుకోకుండా ఎందుకిలా లాలూచీపడ్డాడు? రాయల సీమను ఎడారిగా మార్చి, ఆ ప్రాంతానికి తాగుసాగునీరులేకుండా చేసే అధికారం ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు? గోదావరి నీటిని పట్టిసీమద్వారా ప్రకాశంబ్యారేజ్ కు, అటునుంచి నెల్లూరు ప్రకాశం జిల్లాలకు, అదేనీటిని పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలించారు. 300 అడుగులో మచ్చుమర్రిలో లిఫ్ట్ పెట్టి, ఆ నీటిని చిత్తూరుజిల్లాలోని కుప్పానికి తరలించాము. దాదాపు రూ.65వేల కోట్లుఖర్చుపెట్టిన టీడీపీప్రభుత్వం సమగ్రజలవిధానంతో అటు ఉత్త రాంధ్రకు, ఇటురాయలసీమకు సాగుతాగునీరు అందించింది.
ఈ దద్దమ్మ, చేతగాని, అసమర్థప్రభుత్వం రెండున్నరేళ్లలో ఏంచేసింది ? ఏమైనా మాట్లాడితే మంత్రులు బూతులుతిడతారు? దానికంటే ఎవరివైనా బూట్లు నాకండి. అధికారులు గుడ్డిగావ్యవహరిస్తుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రిఏంచేస్తున్నారు? పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి పదిరోజులు ఉండి ఢిల్లీలో కలవాల్సినవాళ్లను కలిసి, తనరాష్ట్రానికి న్యాయంచేసుకుంటుంటే, ఈముఖ్యమంత్రి ఏంచేస్తు న్నాడు. ఇక్కడుండి మాట్లాడిన మాపై దాడిచేయిస్తాడు. తనపార్టీ వారితో మాకార్ల అద్దాలు పగలగొట్టిస్తాడు. గతంలో రూపొందించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను పట్టించుకోకుండాజూరాలను కేఆర్ ఎంబీ పరిధిలోకి తేకుండా ఏపీ నీటిని పొరుగురాష్ట్రానికి అప్పగించాడు. ఈవ్యవహారంపై ముఖ్యమంత్రి తక్షణమే మీడియాముందుకొచ్చి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE