-బిజెపి ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు
సిఎం జగన్మోహన్ రెడ్డికి రజాక్, వైసిపి నేత శిల్పా చక్రపాణి రెడ్డి అక్రమాలపై లేఖ రాశాను.శ్రీశైలంలో శివలింగం తవ్వే ఫొటోలలో రజాక్ ఉన్నాడు.కాంట్రాక్టు కూడా రజాక్ దే అయినా… రికార్డులు వేరే వారి పేరుతో తీసుకున్నారు.అధికారులు, ఇఒ లు రజాక్ కనుసన్నల్లో పని చేస్తున్నారు.టిడిపి, వైసిపి నేతలే రజాక్ ను వెనుక ఉండి నడిపిస్తున్నారు.ఓట్ల రాజకీయాల కోసం పార్టీ లు ఇలాంటివి ప్రోత్సహిస్తున్నాయి.అన్నీ రజాక్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయి… ఆయన అనుమతితోనే అన్నీ జరుగుతాయి.
మా బిజెపి నేత శ్రీకాంత్ రెడ్డి ఈ అన్యాయాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టారు.చక్రపాణి రెడ్డి ఏకంగా మా నాయకుడిపై దాడికి ప్రేరేపించారు.ప్రాణ భయంతో శ్రీకాంత్ రెడ్డి పోలీస్టేషన్ లో తలదాచుకున్నారు.అయినా శ్రీకాంత్ రెడ్డి పై14 ఫాల్స్ కేసులు పెట్టి బెయిల్ రాకుండా చేశారు.దాడి చేసిన వారు, చేయించిన వారిపై కేసులు లేవు.జగన్ చెప్పుచేతల్లో పని చేసిన డిజిపిని పంపించేశారు.ఇప్పుడు పోస్టింగ్ కూడా లేకుండా ఖాళీగా కూర్చోబెట్టారు.గతంలో యల్వీ సుబ్రహ్మణ్యంను ఇలాగే సాగనంపారు.
అధికారులు తెలుసుకోండి… అవసరం తీరితే.. మీ పరిస్థితి అయినా ఇంతే.ప్రభుత్వ వైఖరి ఇనిస్టిబిలిటీ గా ఉంటే అధికారులు ఎలా పని చేస్తారు.చక్రపాణి రెడ్డి గతంలో, ఇప్పుడు ప్రభుత్వం అండతో అరాచకాలకు పాల్పడుతున్నారు.శ్రీకాంత్ రెడ్డి వైద్యులు, సంఘంలో పేరున్న వ్యక్తి.రజాక్ రౌడీయిజంతో .. అక్రమాలకు పాల్పడుతున్నారు.ఇప్పుడు ఏదో రజాక్ ను అరెస్టు చేసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారు. శ్రీకాంత్ రెడ్డి పై పెట్టిన అక్రమ కేసులు తొలగించాలి.ఈ అంశాలను వివరిస్తూ సిఎం కు లేఖ రాశాను.ఆయన సానుకూలంగా స్పందించి వైసిపి నేతల అరాచకాలను కట్టడి చేయాలి.