వైసీపీకి కాటసాని, కప్పట్రాళ్ల షాక్

– బాబు సమక్షంలో టీడీపీ కండువా

హైదరాబాద్ : వైసీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖర్ రెడ్డి, కర్నూలు జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు కప్పట్రాళ్ల బొజ్జమ్మ, రామచంద్రనాయుడు దంపతులు, అనుచరులు టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో తాడిపత్రి నుండి జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోటీ చేసిన వీఆర్ రామిరెడ్డితో పాటు కుమారులు వీఆర్.వెంకటేశ్వరరెడ్డి(వైసీపీ రాష్ట్ర కార్యదర్శి), విగ్నేశ్వరరెడ్డి మంగళవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. వీరికి చంద్రబాబు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

Leave a Reply