సవ్యసాచి టీడీ జనార్దన్

– పార్టీకి వీర విధేయుడు
– జీవితమంతా పార్టీకే అంకితం చేసిన నేత
– మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ జన్మదిన వేడుకలో సీనియర్ నేతలు
– ఘనంగా టీడీపీ నేత టీ.డీ జనార్ధన్ రావు జన్మదిన వేడుకలు

టీడీపీ మాజీ ఎమ్మెల్సీ టీ.డీ జనార్ధన్ రావు జన్మదిన వేడుకలు మంగళవారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కన్వీనర్ అట్లూరి నారాయణరావు ఆధ్వర్యంలో భారీ కేక్ ను కట్ చేసి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ…టీ.టీ జనార్ధన్ సామాన్య కుటుంబంలో పుట్టి తన స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగారు. టీ.డీ జనార్దన్ ప్రభుత్వ పదవిలో ఉన్నా, పార్టీ పదవిలో ఉన్నా పార్టీ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించటంలో ముందుంటారు. ఎమ్మెల్సీగా మండలిలో వైసీపీ అరాచకాలు, అన్యాయాల్ని ఎప్పటికప్పుడు ఎండగట్టారు. రాజకీయ పరిణామాల్ని ముందుగానే అంచనా వేసి అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచించటంలో జనార్ధన్ దిట్ట.

ఆయన సారధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించటం అభినంధనీయమని కొనియాడారు. తన సొంత నిధులతో తన సొంత గ్రామంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. ఇలాంటి నాయకుడు తెలుగుదేశం పార్టీకి ఉండటం గర్వకారణమని టీడీపీ నేతలు అన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య , సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , బోండా ఉమామహేశ్వరరావు , నక్కా ఆనందబాబు , మండలి మాజీ చైర్మన్ ఎం.ఏ షరీఫ్ , జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి , దారపనేని నరేంద్ర , పిల్లి మాణిక్యరావు , కోడూరు అఖిల్ , దామోదర్ , సురేష్ , వల్లూరి కిరణ్ , పాతర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply