Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డి ఓ మహానటుడు

– తన తప్పులు కప్పిపుచ్చుకుని ఎదుటి వారిని విమర్శిస్తున్న జగన్
– 10ఏళ్లుగా కేసులు విచారణకు రాకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్న జగన్
– జగన్మోహన్‌రెడ్డికి ఏమైనా చట్టంలో మినహాయింపులు ఉన్నాయా?
– అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోర్టుకు వెళ్లకుండా డ్రామాలాడుతున్న సీఎం
– జగన్‌పై ఉన్న కేసులు విచారణ పూర్తయితే జైలుకెళ్లడం ఖాయం
– జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా కేసులు విచారణకు సహకరించాలి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్

మంగళగిరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఓ మహానటుడు అని..తాను ప్రజల మనిషిని అని అమాయక ప్రజలను నమ్మించేందుకు డ్రామాలాడుతున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ ప్రధానకార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య జగన్మోహన్‌రెడ్డి కపట నాటకాలను ఎండగట్టారు.

ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ…జగన్మోహన్‌రెడ్డి మహా నటులను మించి తన ముఖంలో హావభావాలు పలికిస్తారు. జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద నేర చరిత్ర ఉంది. కానీ తన ముఖంలో ఎక్కడా తాను ఓ నేరస్తుడినని, తనపై 11 చార్జిషీట్లు ఉన్నాయని, 5 ఈడీ చార్జిషీట్లు ఉన్నాయని, ఈ కేసుల్లో తాను కండిషనల్ బెయిల్ పై ఉన్నానని, ఈ కేసులు విచారణ పూర్తయితే తాను జైలుకెళ్లడం ఖాయమని తెలిసి కూడా ఇవేవీ తన ముఖంలో కనిపించకుండా కప్పిపుచ్చడంలో జగన్మోహన్ రెడ్డిని మించిన నటుడు ఈ రాష్ట్రంలో మరొకరు లేరు.

జగన్మోహన్ రెడ్డి కేసులు ముందుకు కదలకుండా ఆగిపోవడంపై సుప్రీంకోర్టు విస్తుపోయింది. ఇన్నేళ్లు ఎలా పెండింగ్ లో పెట్టారని సీబీఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సీబీఐ వాళ్లు చేసేదేమీ లేక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఈ కేసుల నుండి మినహాయింపులు తీసుకుంటున్నారని సుప్రీంకోర్టుకు వివరణ ఇవ్వాల్సివచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేని వ్యక్తి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు మరచిపోకూడదు అనేది నా ఉద్దేశం.

కారణాలు చూపుతూ కోర్టుకు జగన్ గైర్హాజరు:

జగన్మోహన్ రెడ్డి సాధారణమైన వ్యక్తి కాదు అసాధారణమైన వ్యక్తి. సీబీఐ జగన్మోహన్ రెడ్డిపై చార్జిషీట్లు వేసి 12సంవత్సరాలు అయినా నేటికీ కోర్టులకు వెళ్లకుండా ఏదో ఒక కారణం చూపుతూ విచారణకు వెళ్లడం లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి అసాధారణమైన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి తీరు గురువిందగింజ చందంగా ఉంది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాకముందు తనకంటూ ఏమీ లేని వ్యక్తికి నేడు ఇన్ని అక్రమాస్తులు ఎక్కడి నుండి వచ్చాయో రాష్ట్ర ప్రజలు గమనించాలి. భారతదేశంలో గతంలో, నేడు లేనటువంటి ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి తప్ప మరొకరు లేరని ఆర్థికశాస్త్ర నిపుణులు ఘోషిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమీ ఎరుగని వ్యక్తిలా సాధారణంగా బయట తిరుగుతున్నారు.

చట్టంలో ఎవరికీ లేని మినహాయింపులు జగన్ ఒక్కడికే ఉన్నాయా?:-

ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డికి ఏమైనా చట్టాల్లో మినహాయింపులు ఉన్నాయా? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు ఎక్కడున్నారు? జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు కదా…జగన్మోహన్ రెడ్డి కోర్టులో విచారణకు ఎందుకు వెళ్లడం లేదో రాష్ట్ర ప్రజలు గమనించాలి. కోర్టులో విచారణకు వెళ్లకుండా 12ఏళ్లుగా కాలం గడపడం వ్యవస్థలను మేనేజ్ చేయడం కాదా? వ్యవస్థలను ఓ వైపు మేనేజ్ చేస్తూనే జగన్మోహన్ రెడ్డి ఎదుటివారిని వ్యవస్థలు మేనేజ్ చేసే వ్యక్తులని విమర్శిస్తున్నాడు. ఎదుటి వారిని దొంగలు, ఆర్థిక నేరగాళ్లు, సంఘ విద్రోహశక్తులు అని విమర్శించే జగన్ ఈ లక్షణాలన్నీ తనవేనని మరచిపోతున్నాడు.

జగన్మోహన్ రెడ్డిపై 11 చార్జిషీట్ల వివరాలు ఇలా ఉన్నాయి….:

మొదటి ఛార్జిషీట్:(31.03.2012)
రూ.29.50 కోట్లు జగన్ కంపెనీల్లో పెట్టుబడులుగా వచ్చాయి.
అవినీతి: మహబూబ్ నగర్ జడ్చర్లలో 250 ఎకరాలు హటిరో, ఆరబిందో కంపెనీలకు ఎకరం రూ.7 లక్షలకు కేటాయించడం. ప్రతిగా రూ.29.50 కోట్లు క్విడ్ ప్రో కో కింద తీసుకోవడం.

రెండవ ఛార్జిషీటు:23.04.2012.
జగన్ కంపెనీల్లోకి రూ.66.30 కోట్లు పెట్టుబడిగా వెళ్లాయి.
అవినీతి: పోలేపల్లి సెజ్‌లో భూములను అరబిందో, హెటిరో సంస్థలకు కేయింపు, కొంత మంది పెట్టుబడిదారులను జగన్ రూ.34.65 కోట్లమేర మోసం చేయడం.

మూడవ ఛార్జిషీట్:(07.05.2012).
జగతి పబ్లికేషన్స్ లో రూ.9.99 కోట్లు అక్రమ పెట్టుబడులు.
అవినీతి: విశాఖపట్నంలో అక్రమంగా రాంకీకి భూముల కేయింపులు, గ్రీన్ బెల్ట్ వ్యవహారంలో రాంకీ ఫార్మాసిటీ ప్రాజెక్టుకు రూ.133.74 కోట్ల మేర లబ్దిచేకూర్చడం, ప్రతిగా జగన్ కంపెనీల్లోకి రూ.10 కోట్ల పెట్టుబడులు రావడం.

నాలుగవ ఛార్జిషీట్:(13.08.2012).
అవినీతి: వాన్‌పిక్‌కు మంత్రివర్గం 4 వేల ఎకరాల కేయింపుకు అనుమతి ఇవ్వగా 28 వేల ఎకరాలు కేయింపు – దీనికి ప్రతిఫలంగా రూ.854 కోట్లు నిమ్మగడ్డ ప్రసాద్‌ జగన్‌కు చెందిన సంస్థలలో పెట్టుబడి పెట్టారు.

ఐదవ ఛార్జిషీట్(08.04.2013)
జగన్ కంపెనీల్లోకి రూ.205 కోట్ల పెట్టుబడులు
అవినీతి: కడప జిల్లా మైలవరం, నవాబ్‌పేట, తలమంచిలో 1005 ఎకరాల సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా దాల్మియా సిమెంట్స్ కు బదలాయింపు – అందుకు ప్రతిగా రూ.10 షేరు రూ.1440కి దాల్మియాకు విక్రయం. రూ.95 కోట్లు పెట్టుబడిగా జగన్ కంపెనీల్లోకి రావడం..

ఆరవ ఛార్జిషీట్:(10.09.2013)
అవినీతి: రంగారెడ్డి జిల్లాలో కాగ్నా నది నుంచి ఇండియా సిమెంట్స్ కు అక్రమంగా 10 లక్షల గ్యాలన్‌ల నీటిని నిబంధనలు ఉల్లంఘించి కేయించడం.

ఏడవ ఛార్జిషీట్:(10.09.2013)
అవినీతి: కడప జిల్లా కమలాపురం ఎర్రగుంట్ల మండలాల్లో 2037 ఎకరాల సున్నపురాయి అక్రమంగా భారతీ సిమెంట్స్ కు కేటాయింపు

ఎనిమిదవ ఛార్జిషీట్:(10.09.2013).
జగన్ కంపెనీల్లో రూ.68 కోట్ల అక్రమ పెట్టుబడులు
అవినీతి: అనంతపురం జిల్లా యాడికి, తాడిపత్రి మండలాల్లో 231 ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమంగా పెన్నా గ్రూప్‌కు కేయింపు, బంజారాహిల్స్ లోని పయనీర్‌ హోటల్స్‌ నిర్మాణానికి నిబంధనలు ఉల్లంఘన, కర్నూలులో 821 ఎకరాల మైనింగ్ లీజులకు అనుమతుల పునరుద్దరణ.

తొమ్మిదవ ఛార్జిషీట్:(17.09.2013).
అవినీతి: శంషాబాద్‌లో 250 ఎకరాలు అక్రమంగా ఇందూటెక్‌ జోన్‌కు కేయింపు ( జగన్ కంపెనీలకు రూ.15 కోట్లు లంచం).

పదో ఛార్జిషీట్:(17.09.2013).
అవినీతి: అనంతపురం జిల్లాలో 8844 ఎకరాల భూమి లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌కు అక్రమంగా కేయింపు – ఆ భూమిని బ్యాంకులకు తాకట్టు పెట్టి రూ.790 కోట్లు పొందిన ఇందూ సంస్థ. (రూ.50 కోట్లు జగన్ కంపెనీల్లో అక్రమ పెట్టుబడులు)

పదకొండవ ఛార్జిషీట్:(17.09.2013).
అవినీతి: ఇందూ గ్రూప్‌కు హౌసింగ్‌ స్కీంలు కేయించి జగన్‌ కంపెనీలోకి పెట్టుబడులు (జగన్ కంపెనీల్లో రూ.70 కోట్ల పెట్టుబడులు)
ఇవి కాకుండా ఈడీ మరో 5 చార్జిషీట్లు వేసింది.

వ్యవస్థలను మేనేజ్ చేయకుండా 12ఏళ్లుగా బయట ఉన్నావా జగన్?:-

2012 నుండి నేటికీ బెయిల్ పై ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
ఏ వ్యక్తీ ఇన్నేళ్లు బెయిల్ పై ఉన్న వ్యక్తి ఈ దేశంలో లేడు.
జగన్ పై ఉన్న కేసుల విచారణ పూర్తి అయితే ఇప్పటికే జగన్ కేసులో ఉండేవాడు…ఏ కేసూ కొట్టేయడానికి అవకాశం లేదు..అంతటి అవినీతి ఈ కేసుల్లో ఇమిడి ఉంది.
ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేని మినహాయింపు జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే ఎందుకు? జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేయకుండానే ఇంతకాలం బయట తిరుగుతున్నాడా?
ఇంత తక్కువ కాలంలో రూ.43వేల కోట్లు ఎలా వచ్చాయని సుప్రీంకోర్టు జడ్జి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యానించడం అబద్దమా జగన్మోహన్ రెడ్డి?

జగన్ కేసులపై వివిధ కోర్టులు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు:

”ఇంత తక్కువ వ్యవధిలో అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?” 14-09-2012 న సుప్రీంకోర్టు వ్యాఖ్య
”ఒక వ్యక్తి కేవలం పదేళ్లలో వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు. దర్యాప్తు పూర్తయ్యేదాకా బెయిల్‌ సాధ్యం కాదు” (05-10-2012 న జగన్‌ బెయిల్‌ పిషన్‌ను క్టొివేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య.)
”దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన ఆర్థిక నేరగాళ్ళను శిక్షించకపోతే మొత్తం సమాజం నష్టపోతుంది. హత్యలు ఆవేశకావేశాలతో జరగవచ్చు. కానీ ఆర్థిక నేరాలు మాత్రం నిర్దిష్ట లెక్కలు, ఉద్దేశ్యపూర్వక ప్రణాళిక, సామాజిక ప్రయోజనాలకు భంగకరంగా వ్యక్తిగత లాభాలను దృష్టిలో ఉంచుకునే చేస్తారు” ( సుప్రీంకోర్టు జస్టిస్‌ సదాశివం, జస్టిస్‌ ఎంవై ఇక్బాల్‌.)

సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ అఫ్తాబ్‌ ఆలమ్‌ (14.09.2012) : ”ఇంత తక్కువ వ్యవధిలో రూ.43వేల కోట్ల ఆస్తులు ఏలా వచ్చాయి.”

సుప్రీంకోర్టు వ్యాఖ్య (09.05.2013) : ఆర్థిక నేరాలను తీవ్రంగా పరిగణించాలి. ఆర్థిక నేరాల వెనక లోతైన కుట్రల మూలాలు ఉంటాయి. ఈ కుట్రలతో ప్రజా ధనానికి భారీ నష్టం వాిల్లే అవకాశం ఉంటుంది. అందుకే ఆ నేరాలను తీవ్రంగా పరిగణించాలి. దేశ ఆర్థిక ఆరోగ్యానికి ఆర్థిక నేరాలు పెనుముప్పుగా పరిణమించాయి. ఆర్థిక నేరగాళ్లను శిక్షించకుంటే సమాజం నష్టపోతుంది.
జగన్‌ కేసులపై సిబిఐ కోర్డుల విచారణను సాగదీసి పక్కదారి ప్టించే ఎత్తుగడలకు విసిగిపోయిన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
(”మీ తీరుతో విసిగిపోయాం. రెండేళ్లుగా అనవసర వాదనలతో సమయం వృధా చేస్తున్నారు. 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి పరిస్థితి చూడలేదు. ఇప్పి వరకు జరిగిన ఆలస్యం చాలు” – నవంబర్‌ 18, 2017.)

సుప్రీంకోర్టు జగన్ పై కేసులు ఇప్పటికైనా విచారణ పూర్తి చేయాలి:

జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కోర్టుకు వెళ్లాలి…రానున్న శుక్రవారం జగన్ సీబీఐ కోర్టుకు వెళ్లాలి.
జగన్ కోర్టుకు వెళ్లడానికి ఏ ప్రమాదమూ లేదు…మాజీ పోలీసు అధికారిగా చెబుతున్నాను.
జగన్ కోర్టుకు వెళతానంటే తనను ఎవరు అడ్డుకుంటారో నేను చూసుకుంటాను…మీరు రండి జగన్..
జగన్ కేసుల విచారణ జాప్యం సుప్రీకోర్టులో ఉన్న పిటిషన్ విచారణ త్వరగా పూర్తికావాలి….జగన్ కేసులన్నీ విచారణ పూర్తి చేసి అతని కేసులు త్వరగా పూర్తిచేయాలని కోరుతున్నాం

LEAVE A RESPONSE