Home » పందికి పాండ్స్ పౌడర్ వాసన తెలియదు..చంద్రబాబు గొప్పతనం జగన్ కు తెలియదు

పందికి పాండ్స్ పౌడర్ వాసన తెలియదు..చంద్రబాబు గొప్పతనం జగన్ కు తెలియదు

-అబద్దానికి ఫ్యాంట్, షర్టు వేస్తే అది జగన్ రెడ్డి
-రాష్ట్రప్రభుత్వ సలహాదారుడు ఓ పవర్ బ్రోకర్
-బంగారుపాళ్యం సభలో టిడిపి యువనేత లోకేష్

జగన్మోహన్ రెడ్డి ఎందుకంత భయం నీకు? జగన్ రెడ్డి నీకు పౌరుషం ఉంటే రా నా దగ్గరకు.ఖాకీలను అడ్డుపెట్టుకుని కాదు…నువ్వు డైరెక్టుగా రా…నేనొస్తా. పోలీసులను అడ్డుపెట్టి నా పాదయాత్రను ఆపాలని చూడడం ఏంటి?వందలమంది పోలీసులు అడ్డగోలుగా వచ్చి పాదయాత్ర ఆపాలని చూస్తున్నారు. జగన్ రెడ్డి పాదయాత్ర చేస్తే జడ్ ప్లస్ క్యాటగిరీ సెక్యూరిటీ, 4రోప్ పార్టీలు, ముగ్గురు డీఎస్పీలతో సాఫీగా సాగేలా చేశాం. పోలీసులతో యువశక్తిని మీరు ఆపలేరు జగన్ రెడ్డి.యువకుల కోసమే నేను యువగళం ప్రారంభించాను.ఏపీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదు.రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు.

జీఓ-1 ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో. ఈ యువగళం…పాదయాత్ర ఆగదు. పందికి పాండ్స్ పౌడర్ వాసన తెలియదు..చంద్రబాబు గొప్పతనం జగన్ కు తెలియదు. చంద్రబాబు పాలనలో లోటు బడ్జెట్ లో ఉన్నా 6లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. 200రూ.ల పెన్షన్ ను రూ.2000 చేసింది చంద్రబాబు.ఆడపడుచులకు రూ.20వేలు ఖర్చుచేసి పసుపుకుంకుమ ఇచ్చారు. రైతు రుణమాఫీ, డ్రిప్, గిట్టుబాటు ధరలు కల్పించింది చంద్రబాబు.ప్రభుత్వ ఉద్యోగులకు 43శాతం ఫిట్ మెంట్ ఇచ్చింది చంద్రబాబు. పోలీసులు కూడా ఆలోచించాలి. మీకు టీఏ, డీఏలు కూడా ఈ సీఎం ఇవ్వడం లేదు.మీకు న్యాయం కోసమే నేను వచ్చాను.ఇలాంటి పవిత్ర యుద్ధాన్ని ఆపడం ఏమాత్రం సరికాదు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించారు. రాయలసీమకు కియా, డిక్సన్, సెల్ కాన్, తదితర ప్రముఖ కంపెనీలను తెచ్చి, యువతకు ఉద్యోగాలిచ్చారు.జగన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అడుక్కుని ఓట్లు వేయించుకుని యువతను నట్టేట ముంచారు. అబద్దానికి ఫ్యాంట్, షర్టు వేస్తే అది జగన్ రెడ్డి… అతని పేరే అబద్దాల రెడ్డి. జగన్ ఎన్నికల సమయంలో ఇస్తానన్న 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ అబద్దం.జాబ్ క్యాలెండర్ అబద్దం….ప్రత్యేక హోదా ఒక అబద్దం.చేతిలో 31మంది ఎంపీలుంటే మీరు హోదా ఎందుకు తేలేకపోయారు.

25మంది ఉంటే కేంద్రం మెడలు వంచుతానన్నావు.ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ మహిళలకు 45ఏళ్లకే పెన్షన్ అబద్దం.ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఒక అబద్దం.అమ్మఒడి అబద్దం, ఆసరా అబద్దం…సంపూర్ణ మద్యపాన నిషేధం పచ్చి అబద్దం. ఏపీలో కల్తీ మద్యం తయారీ మొదలు..ప్యాకింగ్, స్టిక్కరింగ్, ట్రాన్స్ పోర్టు, సేల్స్, బ్లాక్ లో మద్యం అమ్మేది మొత్తం జగన్… ఆయన బినామీలే. రైతులు పండించే పంటలకు గిట్టుబాట ధర అబద్దం. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు వారంలో రద్దు ఒక అబద్దం. జగన్ రెడ్డి రాయలసీమ బిడ్డ కాదు…రాయలసీమ ద్రోహి.

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులట్టింటినీ చంపేశాడు.రాయలసీమలోని అమర్ రాజా బ్యాటరీ కంపెనీని మెడపట్టి బయటకు గెంటేశాడు.దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 20వేల మంది యువత ఉద్యోగాలు కోల్పోయారు.జగన్ రెడ్డికి దమ్ముంటే రాయలసీమకు ఏం చేశాడో బహిరంగా చెప్పాలి.రాష్ట్రప్రభుత్వ సలహాదారుడు ఓ పవర్ బ్రోకర్.బహుశా ఇప్పుడు అతనే పోలీసులకు ఫోన్ చేసి ఉంటాడు. ఈ పాదయాత్ర, బహిరంగ సభ ఆపేయాలని. హూ కిల్డ్ బాబాయ్… బాబాయ్ ని చంపింది ఎవరు…జగన్ కిల్డ్ బాబాయ్.వివేకా చాలా మంచి వ్యక్తి. కానీ ఈ జగన్ రెడ్డి గొడ్డలితో అత్యంత దారుణంగా చంపించాడు.అందుకే అవినాష్ రెడ్డిని సీబీఐ రా…రా…అని పిలుస్తోంది.

అతన్ని కాపాడుకునేందుకే ఢిల్లీకి జగన్ ఆఘమేఘాల మీద పరిగెత్తాడు.తల్లిని, చెల్లిని గెంటేసినవాడిని, బాబాయ్ ని చంపిన వాడ్ని క్రిమినల్ కాక ఏమనాలి?జగన్ రెడ్డి క్రిమినల్ కాబట్టే పరదాలు, బారికేడ్లు చాటున తిరుగుతున్నాడు. జిల్లాకొక క్రిమినల్ ను జగన్ రెడ్డి తయారు చేశాడు.చిత్తూరు జిల్లాకు పెద్దిరెడ్డి అనే క్రిమినల్ ను పెట్టాడు….ఇతను ఎర్ర చందనాన్ని, మైనింగ్ ను దోచుకుంటున్నాడు.పెద్దిరెడ్డికి పూతలపట్టులో ఓ బినామీ ఉన్నాడు.. అతనే స్థానిక ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు.షిప్ట్ ఆపరేటర్ పోస్టులు ఇప్పిస్తానని 50మంది దగ్గర రూ.50లక్షలు దొబ్బేశాడు. పెద్దిరెడ్డి మరో బినామీ శ్రీకాంత్ రెడ్డి.

గంగాధర నెల్లూరులో కల్తీ మద్యం తయారు చేసి అక్కడి ఎమ్మెల్యే నారాయణ స్వామి సరఫరా చేస్తున్నాడు.కాణిపాకం హుండీలను కూడా ఈ దుర్మార్గులు వదలడం లేదు.పూతలపట్టుకు చామంతి రిజర్వాయర్ ను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.6లక్షల పెన్షన్లు, చంద్రన్నబీమా, పండుగ కానుకలు, బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అన్నీ పీకాడు ఈ జగన్ రెడ్డి. ఏపీని గంజాయి, డ్రగ్స్, మహిళలపై దాడి, అప్పుల్లో కూడా మేమే నంబర్ వన్ అనేలా జగన్ రెడ్డి పాలన ఉంది. మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎం.ఎస్.బాబు, పెద్దిరెడ్డి, అబద్దాల రెడ్డి పని అయిపోయింది.2014-19 మధ్య వైసీపీ నాయకులపై కూడా మేం ఏనాడూ అక్రమ కేసులు పెట్టలేదు.

మీ నాయకుడు పాదయాత్ర చేస్తుంటే మేమంతా సహకరించాం. మీరెందుకు మా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు? మీ పేర్లు అన్నీ రాసుకున్నా… అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదలను.ఈ యువగళం ఆగదు….పవన్ కళ్యాణ్ వారాహీ కూడా ఆగదు.ఆపాలని చూస్తే తొక్కుకుంటూ ముందుకు వెళ్లిపోతాం. టిడిపి కార్యకర్తలను వేధించిన ప్రతి ఒక్కరికీ వడ్డీతో సహా చెల్లిస్తాం.మన నియోజకవర్గం అభిలవృద్ధి చెందాలంటే సైకో పోవాలి…సైకిల్ రావాలి.వచ్చే ఎన్నికల్లో పూతలపట్టులో టీడీపీకి పట్టం కట్టండి…అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం.2024లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారే. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా అభ్యర్థి శ్రీకాంత్ ను ఆశీర్వదించండి… గెలిపించండి.

Leave a Reply