– బుధవారం నెల్లూరులోనే అంత్యక్రియలు
ఏపీలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం తరఫున దుబాయ్‌కు వెళ్లిన యువమంత్రి మేకపాటి గౌతంరెడ్డికి అదే చివరి మజిలీగా మారింది. రెండున్నరేళ్లలో ఏపీ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన విదేశీ అధికార కార్యక్రమం అది. దానికి పరిశ్రమల
శాఖ మంత్రిగా ఉన్న మేకపాటి హాజరయ్యారు. పలు కంపెనీల ప్రతినిధులతో జరిగిన చర్చల్లో ఉత్సాహంగా వ్యవహరించి, అనేక కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు.ఇటీవల దుబాయ్ ఎక్స్ పో పర్యటనతో రాష్ట్రానికి రూ.5,150 కోట్ల పెట్టుబడులకు
సంబంధించి 5 ఎంవోయూలు కుదుర్చుకున్నారు. అక్కడ వివిధ దేశాలకు చెందిన కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న మేకపాటి ఆదివారం హైదరాబాద్ వచ్చారు. అస్వస్థతగా ఉండటంతో అపోలో ఆసుపత్రిలో చేరిన మేకపాటి అక్కడే కన్నుమూశారు. రేపు
సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి, పర్యటన విశేషాలు వెల్లడించాలనుకున్న మంత్రి గౌతమ్ రెడ్డి ఇలా అర్ధంతరంగా మృతి చెందడం విషాదం. మేకపాటి మృతి వార్త తెలిసిన వెంటనే తెలంగాణ మంత్రులు, ప్రముఖులు, రాజకీయ నేతలు ఆయన

భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. అమెరికాలో ఉన్న మంత్రి కుమారుడు రేపటికి ఇండియా రానున్నట్లు సమాచారం.