– ఉభయ గోదావరి జిల్లాల నుండి కమ్మవారే కాక రాజులు, రెడ్లు, కాపులు
తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కమ్మ సామాజికవర్గ సంఖ్య ఎక్కువ. అక్కడ రాజకీయ, వ్యాపార, వ్యవసాయరంగాల్లో వారి ప్రభావం కీలకం. ఆ సామాజికవర్గం వారు, వివిధ రాజకీయపార్టీల నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఎందుకు? ఏమిటి? ఎలాగో చూద్దాం.
కృష్ణా జిల్లా, పామర్రు (మం) లోని పసుమర్రు గ్రామం నుండి వెళ్లిన వెంకయ్య గారు ధర్మారంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న నాటికే ఆ ఊళ్లో నల్లగొండ జిల్లా నుండి వలస వచ్చిన ముసలయ్య వారి సోదరులు, ఇజ్రాయేలు, జూలయ్య, ఆగష్టయ్య వారి బంధువులు, మండవ జోజయ్య వారి బంధువులు ఇంకా కొందరు రైతులు, 1935 లోనే ఆ ఊరు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
అలాగే గుంటూరు జిల్లా నుండి సింగు రంగయ్య, నిమ్మగడ్డ దాసయ్య, బాచిన వెంకట సుబ్బయ్య వారి సోదరులు, బంధువులు 1940 లో ధర్మారం వచ్చి భూములు కొన్నారు. ఆ రోజుల్లో అడవుల విస్తారం ఎక్కువ ఉన్న కారణంగా వర్షాలు ఎక్కువుగా పడేవి. ముసురు పడితే వారం వదిలేది కాదు. నిజామాబాద్ కు రోడ్ సౌకర్యం సరిగా లేదు. సైకిల్, ఎడ్లబండి, గుర్రం బండి, సైకిల్ రిక్షాలే ఆధారం. పసుమర్రు నుండీ ధర్మారం కు 13, 14 రోజులు ఎడ్ల బండిపై ప్రయాణం చేసేవారు.
భూమి మీద ఉన్న మక్కువ చూడండి. కష్ఠించే ఆ మనస్తత్వం చూడండి. ఇక్కడ ఉన్న కొంత భూమిని అమ్మి అక్కడ కొని అక్కడ వ్యవసాయం చేశారు కొందరు. ఆ రోజుల్లో భూ క్రయ విక్రయాలు తెల్లకాగితం మీదే జరిగేవి. ఆ తర్వాత స్టాంపులు, రిజిస్ట్రేషన్లు వచ్చాయి. పసుమర్రు నుండి ధర్మారం వెళ్లిన రైతులు, వారు వెళ్లిందే కాక వారి ద్వారా విన్న కొంత మంది రామినేని బ్రహ్మయ్య, వారి సోదరులు, బంధువులు, మిత్రులు 1940″ లో భోధన్ తాలూకా లోని ఎత్తొండ అనే గ్రామం లో భూములు కొని, సాగు చేసి వరి రెండు పంటలు పండించడం, చెరకు పండించడం మొదలు పెట్టారు.
నిజాంసాగర్ కింద ఇంకా పంటలకు అనువైన భూములను చూసి కృష్ణా జిల్లా లోని పెరిసేపల్లి, కురుమద్దాలి, బట్ల పెనమర్రు గ్రామాల నుండి, గుంటూరు జిల్లా రేపల్లి, తెనాలి, నరసరావు పేట, చిలకలూరి పేట, బాపట్ల, పొన్నూరు, సత్తెనపల్లి, ఒంగోలు, దర్శి, పొదిలి నుండి వెళ్లారు. చూడండి పసుమర్రు వాసులు ఎంత మందిని తెలంగాణాకు వలస వెళ్ల డానికి మార్గదర్శకులైనారో !
ఉభయ గోదావరి జిల్లాల నుండి కమ్మవారే కాక రాజులు, రెడ్లు, కాపులు నిజామాబాద్ జిల్లా లోని భోధన్, బాన్సువాడ, నిజామాబాద్, ఆర్మూర్ తాలూకాల్లో ఉన్న అనేక గ్రామాల్లో స్థిరపడ్డారు. 1945″ లో మదనపల్లి గ్రామంలో వేములపల్లి వెంకట సుబ్బయ్య, మండవ వెంకటరామయ్య,మాధవనగరంలో చాపరాల అచ్చయ్య, వేములపల్లి శ్రీరాములు, నిమ్మగడ్డ నర్సయ్య, మండవ రాఘవయ్య, త్రిపురనేని రంగదాసు, చెరుకూరి రంగయ్య,కొసరాజు తాతయ్య,ముకులూరు గ్రామంలో దేవభక్తుని వెంకటసుబ్బయ్య, సుంకర దశరధ రామయ్య, ఇంకా కొంత మంది రైతులు 1940-50 మద్య కాలం లో ఆంధ్రనగర్, లక్నాపూర్, కొత్తపల్లి, ముకులూరు,ధర్మారం, మాధవనగరం, పంటకుదురు, సాలూరు, రాకూరు, రుద్రూరు, మదనపల్లి, వర్ని, శ్రీనగర్, ఆచనపల్లి, తిమ్మాపూర్, అక్బర్ నగర్, కోటగిరి, ఎత్తొండ, ఎగడల్లి, జాకోరా, బీర్కూర్, నర్సుల్లాపూర్, ఎడపల్లి మొదలైన 150 గ్రామాల్లో భూములు కొని స్థిర నివాసం ఏర్పరచుకొని నిజామాబాద్ జిల్లా అగ్ర స్థానం లో ఉండడానికి తోడ్పడ్డారు.
1948లో రజాకార్ల ఆగడాలను తట్టుకుని నిలబడ్డారు. అప్పటి నిజాం భారత్ లో విలీనానికి అంగీకరించక పోవడంతో పోలీస్ చర్య ఫలితంగా సంస్థానాన్ని భారత్ లో విలీనం చేసాక ఇంకా కోస్తా జిల్లాల నుండీ కమ్మవారు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 1960 లో నిజాంసాగర్ లో నీళ్లు లేక పంటలు ఎండిపోయినప్పుడు కొంత మంది రైతులు భూమిని అమ్ముకుని స్వగ్రామాలకు వచ్చేసారు.
కమ్మ వారు వ్యవసాయరంగం లోనే కాక రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి చెందారు. ముప్పలనేని శ్రీనివాసరావు బోధన్, బాన్సువాడ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ తరపున 5 సార్లు ఎమ్.ఎల్.ఏ గా గెలిచాడు. టీ.డీ.పీ ఆవిర్భావంతో ఎన్.టీ.ఆర్ ప్రొద్భలంతో మండవ థామస్ డిచ్ పల్లి నుండీ, తొట్టెంపూడి సాంబశివరావు బోధన్ నుండి, ఎస్.వీ.ఎల్ నరశింహారావు బాన్సువాడ నుండి, చంద్రబాబు రాకతో మండవ వెంకటేశ్వర రావు డిచ్ పల్లి, నిజామాబాద్ రూరల్ నుండి 4 సార్లు ఎన్నికైనారు. మండవ మంత్రిగా పని చేశారు. ఎమ్.పీ.పీ, జెడ్.పీ.టీ.సీ, సొసైటీ అద్యక్షులుగా, సర్పంచ్ లుగా ఎంతో మంది ఎన్నికైనారు. పాఠశాలలు, కాలేజీలు నెలకొల్పి వేల మందికి విద్యావకాశాలు కల్పిస్తున్నారు. ఆసుపత్రులు నిర్మించి వైద్య సేవలు అందిస్తున్నారు. సినిమా హాళ్లు, పెట్రోలు బంకులు వ్యాపార సముదాయాలు, హోటళ్లు, కిరాణా షాపులు నిర్మించి వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఉద్యో గాల్లో ముందున్నారు. వృద్ధాశ్ర మాలు స్థాపించి సేవ చేస్తున్నారు. కమ్మ సేవా సంస్థల ద్వారా వేల మందికి సేవలు అందిస్తున్నారు.
ఏది ఏమైనా కోస్తాంధ్రా నుంచి చాలా కులాలు వచ్చినా ముందుగా కమ్మ వారు వెళ్లి మిగతా వారికి దారి చూపారు. తాము అభివృద్ధి చెందిందే కాకుండా జిల్లా అభివృద్ధికి ఎంతో తోడ్పడి తెలంగాణాకు ఆహార కొరతను తీర్చారు. ఇప్పుడు చెప్పండి ! తెలంగాణా కు మనంతట మనం వెళ్లామా? వారు పిలిస్తే వెళ్లామా ?
అన్యాక్రాంతంగా భూములను ఆక్రమించు కోలేదు. డబ్బు పెట్టి కొన్నాం. కష్టించి చదును చేసాం. సిరులు పండించాం. జిల్లాను అభివృద్ధి బాటలో నిలిపాం. మనమూ పెరిగాం. దానితో పాటు జిల్లా అభివృద్ధి చెందింది. అంతా చేతికొచ్చాక అభివృద్ధి ఫలాలు పొందే సమయంలో విమర్శలకు గురి కావల్సి వస్తోంది. ఎక్కడ ఉందీ లోపం ? ఎందుకు ఈ జాతి ద్వేషానికి గురి కావల్సివస్తోంది ? ఈ రాజకీయ నాయకుల వల్లే అని నా వ్యక్తి గత అభిప్రాయం. ప్రాంతాల మద్య, కులాల మద్య, మతాల మద్య రాజకీయ నాయకులు కొందరు చిచ్చు పెట్టి, కులాల కుంపట్లు రగిలిస్తున్నారు. మనలో కొందరు తమ స్వార్ధం కోసం జాతినే తాకట్టు పెడుతూ, కొందరి మోచేతి కింద నీళ్లు త్రాగుతూ, తమ ఆస్తులను కాపాడుకుంటూ తమ పబ్బం గడుపుకుంటూ జాతిని నిర్వీర్యులను చేస్తున్నారు.
ఎంతో చరిత్ర కలిగిన జాతి, అసలు తెలంగాణాలోనే కాకతీయులుగా అభివృద్ధి చెంది, మిగతా ప్రాంతాలకు, రాష్ట్రాలకూ విస్తరించిన జాతి నేడు తెలంగాణా, ఆంధ్రా లో ఎందుకు విమర్శకు గురవుతోంది ? ఆలోచించండి. గారడీ చేసే రాజకీయ నాయకుల కల్లబొల్లి కబుర్లకు లొంగమాకండి. సంఘటితంగా ఉండి, కొంచెం పోరాట స్పూర్తితో ఉండండి. ఎవరూ మీ వెంట్రుక కూడా పీక లేరు. మీ ఆస్థులు ఎక్కడికీ పోవు. చట్టం అందరికీ సమానమే. చట్టం ఎవరికీ చుట్టం కాదు.
మీ కన్నా తక్కువ కులాలను గతం లో మాదిరిగా కలుపుకు వెళ్లండి. పరుల యందు సేవాతత్పరత తో ఉండండి. నీతీ, నిజాయితీతో గతంలో లాగా మెలగండి. ఏ కులం ఇంకో కులం కన్నా గొప్పది కాదు. మేమే గొప్ప అనుకుంటే అంత కన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు.
ఎంతో విద్యావంతుల మైన మనం విజ్ఞానాన్ని, అవకాశాలను అంది పుచ్చుకున్న మనం పది మందికి మార్గ దర్శకంగా ఉండి, ఈ భారత జాతిని, తెలుగు జాతిని ముందుకు నడిపించాలి. కమ్మ వారు అంటే కమ్మగా ఉండాలి. భాష వినసొంపుగా, కమ్మగా, తియ్యగా ఉండాలి. స్నేహం లో కర్ణుడిలా విశ్వాసంగా, కమ్మనైన స్నేహంగా ఉండాలి. తెలుగు జాతి ఉన్నంత వరకూ ఈ కమ్మోరు కమ్మగా ఉండాలని ఆశిద్దాం.
తెలంగాణా వెళ్లినా, తమిళ నాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా ఎక్కడకు వెళ్లినా కమ్మోడు కమ్మోడే రా ! అని పించుకోవాలి. ఇతర కులస్తుల్లో కమ్మవారు తొందరగా కల్సిపోతారు. కమ్మోడికి తోటి వాడిని పైకి తేవాలి, కష్టించి సంపాదించు కోవాలి అనే ధ్యాసే గాని పరుల సొమ్ము దోచుకుందాం. ఇతర కులాలను చెప్పు కింద తేలులా అణచి ఉంచుదాం అని ఆలోచన ఏ రోజూ చెయ్యడు. తనకు తెల్సిన విద్యను, విజ్ఞానాన్ని పది మందికీ పంచేవాడు కమ్మోడురా ! ఊరు పట్ల, దేశం పట్లా విశ్వాసంతో మెలిగేవాడు కమ్మ వాడురా! మహిళలకు సమాన గౌరవం ఇచ్చిన జాతిరా కమ్మ జాతి. పది మందిలో నిలబడినా వీడు తెలుగోడా, కమ్మోడులాగుండే అనిపించు.దటీజ్ కమ్మ!
– కొసరాజు వెంకటేశ్వరరావు , MA
(ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త)