ఆ నలుగురినీ సీబీఐ ఎందుకు విచారించదు..?

– హత్యకు గురైంది లోకేష్ బాబాయా లేక జగన్ మోహన్ రెడ్డిగారి బాబాయా..?
– లోక్ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్

ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తయారైన స్క్రిప్టును, ఆ పార్టీకి వంత పాడే ఎల్లో మీడియాలో ముందుగా పూటకో కథనంగా వండివార్చి, ఆ తర్వాత అదే స్క్రిప్టును పట్టుకుని టీడీపీ నాయకులంతా ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా అదే అంశంపైన ప్రెస్ మీట్లు పెట్టి, మీడియా ముందుకు వచ్చి మళ్ళీ అదే స్క్రిప్టును చదువుతున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ పైన నిందలు మోపే విధంగా ఒక పథకం ప్రకారం టీడీపీ, ఎల్లో మీడియా కుట్రలు పన్నుతుంది.

వివేకానందరెడ్డి హత్య కేసులో.. మొదట ఎంపీ అవినాష్ రెడ్డి పేరుని తీసుకొచ్చి.. ఆ తర్వాత ఏకంగా ముఖ్యమంత్రిపైన కూడా నింద మోపే కార్యక్రమాన్ని టీడీపీ, ఎల్లో మీడియా కలసికట్టుగా, పక్కా ప్లాన్డ్ గా చేస్తుంది.

హత్యకు గురైంది లోకేష్ బాబాయా..!?
టీడీపీ, ఎల్లో మీడియా హడావుడి చూస్తుంటే, అసలు హత్యకు గురైంది లోకేష్ బాబాయా.. లేక జగన్ మోహన్ రెడ్డి బాబాయా.. అన్న అనుమానం కలిగేలా వారి కథనాలు, కుట్రలు నడుస్తున్నాయి. ఆరోజు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు, వీళ్ళే ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా కథనాలు రాశారు. ఈరోజు మళ్ళీ, వివేకానందరెడ్డి ఫ్యామిలీపైన లేని ప్రేమను ఒలకబోస్తూ, వారికి అనుకూలంగా ఇప్పుడు కథనాలు రాస్తూ.. ఏదైతే టీడీపీ ఆఫీసులో తయారైందో, ఆ స్క్రిప్టునే పట్టుకుని రెండు రోజులుగా చంద్రబాబు నుంచి లోకేష్ వరకు టీడీపీ నాయకులంతా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై కత్తితో దాడి జరిగితే.. కోడి కత్తి అంటూ హేళనగా మాట్లాడారు. అదే కోడి కత్తి భుజానికి కాకుండా, మెడకు తెగితే.. ప్రాణాలకే ముప్పు ఉండేదని ఆరోజు ఎన్ఐఏ కూడా చెప్పింది. దానిపై నాడు అధికారంలో ఉన్న టీడీపీ ఏ రకంగా చిల్లర రాజకీయాలు చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా మరచిపోలేదు.

ఆ నలుగురినీ సీబీఐ ఎందుకు విచారించదు..?
వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీనే. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ హత్యలో అనుమానితులుగా ఉన్న ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, చంద్రబాబులను ఎందుకు సీబీఐ విచారించదు అని ప్రశ్నిస్తున్నాం.

ఈరోజు టీడీపీ నేతలు పనిగట్టుకుని డీజీపీని మార్చేశారు, సీఎస్ ను మార్చేశారు అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. అసలు వివేకా హత్య జరిగినప్పుడు ఉన్న ప్రభుత్వం టీడీపీది.. అప్పుడు ఉన్న డీజీపీ ఆర్పీ ఠాకూర్ కాదా..? ఆరోజు మీరు చేసిందేమిటి..? అప్పుడు మీ ప్రభుత్వం ఉంటే.. ఆరోజు కూడా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్ పైనే నిందలు వేశారు. ఈరోజూ మళ్ళీ అదే పని చేస్తున్నారు, అంటే మీ కుట్రలేమిటో అర్థం కావడం లేదా..?

Leave a Reply