నెల్లూరు జిల్లా (ఉదయగిరి) : నగదు కోసం ఎమ్మెల్యే అనుచరులమంటూ శ్రీసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ యాజమాన్యాన్ని ఇబ్బందిపెడుతున్నారని స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు నమోదయ్యింది.
ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులమంటూ.. నగదు కోసం తమను ఇబ్బందిపెడుతున్నారని నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ యాజమాన్యం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది.కళాశాల సక్రమంగా నడవాలంటే తాము అడిగినంత మొత్తం ఇవ్వాలని వేధిస్తున్నారంటూ కరస్పాండెంట్ స్రవంతి తెలిపారు. ఏడాది కాలంగా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు.
పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేసినా, ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఎవ్వరూ పట్టించుకోలేదని వాపోయారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కో విద్యార్థి నుంచి 30 వేల రూపాయలు వసూలు చేశారని విద్యార్థులు తెలిపారు.ఇచ్చిన నగదు అడుగుతుంటే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, ఉన్నతాధికారులైన విచారించి తమకు న్యాయం చేయాలని కోరారు.