Suryaa.co.in

Andhra Pradesh

రాజధానిలో మూడు ముక్కలాటకు బలైన మరో మైనారిటీ యువకుడు

రాయపూడి గ్రామంలో మైనారిటీ యువకుడు నిన్న అసెంబ్లీ సమావేశాలలో జరిగిన ఉత్కంఠ ను తట్టుకోలేక మదనతో ఆలోచిస్తూ రాత్రి హృద్రోగ వేదనకు గురై తనువు చాలించారు. పూలింగ్ కు పొలాలిచ్చిన తన కుటుంబీకుల కు ఎటువంటి న్యాయం జరగదనే మనో వేదనకు జీర్ణించుకోలేక హార్ట్ ఎటాక్ తో తనువు చాలించారు.

రాయపూడి గ్రామ నివాసి అయిన షేక్ ఇస్మాయిల్ వ్యవసాయ కూలీ గా జీవనం సాగిస్తున్నారు, గత మూడేళ్లనుంచి పనులు లేక తన కుటుంబాన్ని పోషిస్తూ జీవనోపాదికోసం ఎదురుచూస్తూ ముఖ్యమంత్రి ఆడిన మూడు ముక్కలాటకు మరో మైనారిటీ యువకుడు షేక్ ఇస్మాయిల్ మృతి చెందారు.

గత రాత్రి అసెంబ్లీలో జరిగిన చర్చను దీర్ఘంగా మనో వేదనకు గురై న ఇస్మాయిల్ హృద్రోగ వేదనకు లోనయ్యారు, వెంటనే కుటుంబీకులు మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి తరలించగా తెల్లవారుజామున తనువు చాలించారు.

హృదయ వేదనకు లోనైనందునే ఇస్మాయిల్ గారు మృతిచెందారని ఎన్నారై ఆసుపత్రి వర్గాలు సర్టిఫికెట్ తో ధ్రువీకరించారు. గ్రామంలో మైనారిటీలు ఈ సంఘటనతో ఎంతో ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A RESPONSE