– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు
అన్నమయ్య జిల్లా సదుం మండలం బూరగమందలో టీడీపీ కార్యకర్త రాజారెడ్డిపై వైసీపీ గూండాల దాడిని ప్రశ్నించిన టీడీపీ నేత నల్లారి కిషోక్ కుమార్ రెడ్డిని గృహ నిర్బంధం చేయడం దుర్మార్గం. తక్షణమే ఆయనను గృహనిర్బంధం నుంచి విడుదల చేయాలి. వైసీపీ గూండాలు టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డా చర్యలు తీసుకోని పోలీసులు.. నిరసన వ్యక్తం చేసిన వారిపై లాఠీఛార్జీ చేయడం రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలనకు నిదర్శనం. వైసీపీ అవినీతిని ప్రశ్నించిన వారిని లక్ష్యంగా చేసుకుని జగన్ రెడ్డి టీడీపీ నేతలపై గూండాయిజం చేస్తున్నారు. ఎవరెంత బెదిరింపులకు పాల్పడ్డ.. వైసీపీ విధ్వంస విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. తక్షణమే టీడీపీ నేతలపై నమోదు చేసిన అక్రమ కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలి.