– తెలుగుదేశం పార్టీ జాతీయకార్యాలయంలో డా.బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
సమతావాది, సంఘ సంస్కర్త డా.బాబూ జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్భంగా ఆ మహానీయుని స్మృతికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ …. డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతిఉత్సవాలను నేడు పండగవాతావరణంలో జరుపుకుంటున్నామని, జగ్జీవన్ రామ్ ఒక ఆదర్శవంతమైన పార్లమెంటేరియన్ అని, ఆయన అనేక పదవులకు వన్నెతెచ్చిన మహనీయుడని కొనియాడారు.
. భారతఉపప్రధాని పదవిని సమర్ధవంతంగా నిర్వర్తించడమేగాక, అంటరానితనానికి వ్యతిరేకంగా, తనదైనశైలిలో ప్రత్యేకంగా పోరాడిన మహానీయుడు జగ్జీవన్ రామ్ అన్నారు. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి ఉన్నా అన్నివర్గాలకు న్యాయం చేసేదని, కానీ మూడేళ్లల్లో దేశంలో ఎక్కడాలేని విధంగా దళితులు, బీసీలపై రాష్ట్రంలో దాడులుపెరిగిపోయాయన్నారు. రాష్ట్రపాలకులు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, ప్రజలతో ఆడుకుంటున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహంవ్యక్తంచేశారు.
చంద్రబాబునాయుడు దళితవిద్యార్ధులు విదేశాల్లోఉన్నతచదువులు చదువుకునే అవకాశం కల్పించడమే గాక, భూమిలేని దళితులకు భూమినిపంచడం జరిగిందన్నారు. దళిత,బీసీవర్గాలకు చెందినయువతకు స్వయంఉపాధి కల్పించడమేగాక, లక్షలమందియువతకు రుణాలు కూడా అందించిన ఘనతచంద్రబాబుదే నన్నారు. దళితులు విద్యుత్ బిల్లులు చెల్లించలేని దుస్థితిలోఉన్నారని, టీడీపీప్రభుత్వం ఆయావర్గాలకు 200యూనిట్లవరకు ఉచితంగా విద్యుత్ అందించిందన్నారు. దళితులు, బీసీలకు పూర్వవైవంరావాలంటే ఆయావర్గాలన్నీ ఏకమై, రాష్ట్రాన్నినాశనంచేస్తున్న దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దెదించాలని కోరుతున్నాం.
పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య మాట్లాడుతూ… సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్ గా కొనసాగిన బాబూజగజ్జీవన్ రామ్ గారు, కేంద్రమంత్రిగా తానునిర్వహించిన శాఖలన్నింటికీ వన్నెతెచ్చి, దళితులు ఎందులోనూ తీసిపోరని నిరూపించారన్నారు. జగజ్జీవన్ రామ్ గారి 114వ జయంతి సందర్భంగా టీడీపీకేంద్రకార్యాలయంలో ఘనంగా ఆమహానీయుడి జయంతినిని నిర్వహించడం సంతోషంగా ఉంది. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ గారు అట్టడుగువర్గాలకుఇచ్చిన హక్కులు, రిజర్వేషన్లను పరిరక్షించిన మహానుభావుడు జగజ్జీవన్ రామ్ గారని కొనియాడారు.
పొలిట్ బ్యూరోసభ్యులు నక్కా ఆనంద్ బాబుమాట్లాడుతూ…. స్వాతంత్ర్యానికి ముందు, స్వాతంత్ర్యానంతరం భారతదేశ పునర్నిర్మాణానికి విశేషమైనకృషిచేసినవారిలో అగ్రగణ్యులు బాబూజగజ్జీవన్ రామ్ గారు అన్నారు. ఏశాఖ మంత్రిగా పనిచేసినా ఆశాఖపై తనదైన ముద్రవేయడమేకాకుండా, స్వాతంత్ర్యానంతరం దేశంలోని రుగ్మతలను రూపుమాపడానికి, దళితులు అన్నిఅంశాల్లో ముందుండటానికి కృషిచేసిన మహానుభావులు జగజ్జీవన్ రామ్ గారు. ఆమహానుభావుడి అడుగుజాడల్లోనే తెలుగుదేశంపార్టీ నడుస్తోంది అనిచెప్పడానికి గర్వపడుతున్నాం. జగజ్జీవన్ రామ్, అంబేద్కర్ వంటి మహానీయులు అందించిన ఫలలాలు దళితులకు అందకుండా జగన్మోహన్ రెడ్డి, ఆయావర్గాలను అణగదొక్కుతున్నాడు. దళితులంతా వారిహక్కులు వారు సంరక్షించుకోవాలంటే రాష్ట్రంలోజగన్మోహన్ రెడ్డి పాలనలేకుండాచేయాలి. దళితులంతా ఒక్కతాటిపైనిలిచి ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోరాడినప్పుడే జగజ్జీవన్ రామ్ లాంటి మహానుభావుల ఆత్మకు శాంతికలుగుతుంది.
టీడీపీఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్.ఎస్.రాజు మాట్లాడుతూ…
దళితవర్గాల్లో ఓటమి అనేదిలేకుండా 50ఏళ్లపాటు పార్లమెంటేరియన్ గా కొనసాగిన గొప్పవ్యక్తి బాబూజగజ్జీవన్ రామ్. ఆయన సమసమాజ స్థాపనకోసం చేసినకృషి మాటల్లోచెప్పలేనిది. జగజ్జీవన్ రామ్.. అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయసాధనకోసమే చంద్రబాబునాయుడుగారు పనిచేస్తున్నారు.
టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి బీదరవిచంద్ర మాట్లాడుతూ…
బాబూ జగజ్జీవన్ రామ్ గారిజయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగాజరుపుకుంటున్నారు. మహాను భావుడు అంబేద్కర్ గారు దళితులకు కల్పించిన హక్కులు, రిజర్వేషన్లు వారుపొందడానికి జగజ్జీవన్ రామ్ గారు చేసిన కృషి అనన్యసామాన్యమైనది. భారతదేశఉపప్రధానిగా, సీనియర్ పార్లమెంటేరియన్ గా జగజ్జీవన్ రామ్ గారు చేసినసేవలు మాటల్లోచెప్పలేనివి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశంపార్టీ నిర్వహించిన సమ్మేళనానికి జగజ్జీవన్ రామ్ గారు మద్ధతిచ్చారు. తెలుగుదేశంపార్టీ ఎప్పుడూకూడా జగజ్జీవన్ రామ్.. డాక్టర్ అంబేద్కర్ వంటి మహానుభావుల ఆశయసాధనకోసం పోరాడుతూనే ఉంది.
బాబూ జగజ్జీవన్ రామ్ గారి114వ జయంతిసందర్భంగా మంగళగిరిలోని పార్టీకేంద్రకార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్, టీడీపీఎస్సీసెల్ రాష్ట్రఅధ్యక్షులు ఎమ్.ఎస్.రాజు, టీడీపీరైతువిభాగం రాష్ట్రఅధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టీడీపీఎస్టీ సెల్ రాష్ట్రఅధ్యక్షులు దొన్ను దొర, రాష్ట్ర అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ధారునాయక్, రాష్ట్ర కార్యదర్శులు ఏ.వీ.రమణ, దేవతోటి నాగరాజు, జెన్ని రమణయ్య, కాశినవీన్ కుమార్, ఈ.జగదీష్, కృష్ణా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి, మునియ్య మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, ఆహ్వాన కమిటీ కన్వీనర్ షేక్ హాజీ హసన్ బాషా తదితరులు పాల్గొన్నారు.