Suryaa.co.in

Entertainment

జయప్రదంగా మీ లలితారాణి!

ఆమె..
అల నీలిగగనాల నుంచి
మేఘసందేశం అందుకుని
సినీ భూమి కోసం
దిగి వచ్చి సాగరసంగమం చేసి వెండితెరను
అలరించిన సిరిసిరిమువ్వ..
తెలుగింటి గువ్వ…!

అప్సరసల అందమా..
దేవకన్యల సోయగమా..
బాపూ బొమ్మా..
ఆయనే నచ్చి
సృష్టించిన సీతమ్మా..
నవరస సుమమాలికా..
ఇలా రాసుకుంటూ పోతే
ఆమె వర్ణనలో
మాటలే కరవై
ఏ కవైనా
ఇక మౌనమే’ల’నోయి..!

ఏమో..ఏ దేవకన్యో
మేఘాల డోలికల్లో
జలకమాడి
చీర ఆరేసుకోబోయి
పారేసుకుని ఇటు వచ్చి
అడవిరాముడు కంటపడి
అతగాడికే తిక్కరేగి తిమ్మిరెక్కి మళ్లీ ఈమె
పైట జారి గంతులేసి యమగోల పుట్టించిందో..!

ఆమె అందానికి మురిసి
దర్శకేంద్రుడు దేవత అంటే
అభినయాన్ని మెచ్చి
దర్శకరత్న స్వయంగా
స్వయంవరం ప్రకటించి
కట్టేసాడు ప్రేమమందిరం..!
నిజానికి ఆ అందాలరాసి
లావణ్య వర్ణనే
ఓ అంతులేని కథ..!!

భూమిపై పుట్టిన అత్యద్భుత
అందాల్లో జయప్రద ఒకరని
కొనియాడిన సత్యజిత్ రే..
బాపు రే..
అంత అందమే..
ఔను..
హరివిల్లు దివి నుంచి
దిగువచ్చెనేమో..
ప్రణయాల విరిజల్లు
కురిపించెనేమో..
మైమరపించెనేమో..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE