-ద్విశతాబ్ది పాత కలెక్టరేట్ చెక్కుచెదరలేదు వినియోగించాలి
– దశాబ్ది కొత్త కలెక్టరేట్లో ఊడోస్తున్న ఫ్లోర్
– వైస్సార్ కడపజిల్లా గా కొనసాగించాలి
– ముఖ్యమంత్రికి సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య బహిరంగ లేఖ
మూడు ప్రభుత్వాలు అట్టహాసంగా కడప ఉక్కును శంకుస్థాపన చేసాయే కానీ ఇంతవరకు అతిగతి లేదని పేరుకే రాయలసీమ ముఖ్యమంత్రులని సీమకు ఒరగబెట్టిందేమి లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్రాసిన బహిరంగ లేఖ లో పేర్కొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైస్సార్ కడపజిల్లా జమ్మలమడుగు సమీపంలో , చిటిమిటి చింతల వద్ద 2007 జూన్ 10 న బ్రహ్మణీ స్టీల్ ప్లాంట్, 2018 సెప్టెంబర్ 27 చంద్రబాబు హయాంలో మైలవరం కంబాలదీన్నే సమీపంలో రాయలసీమ ఉక్కు, 2019 డిసెంబర్ 23న ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి హోదాలో మీ నేతృత్వంలో జమ్మలమడుగు ప్రాంతంలోని కన్యతీర్థం వద్ద ఉక్కు శంకుస్థాపన చేశారు కానీ ఇంతవరకు అతిగతి లేదని అన్నారు.
జగన్ అధికారంలోకి రాగానే జిల్లా వాసులు,రాయలసీమ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఉక్కు శంకుస్థాపన కావడంతో ఆశలకు రెక్కలొచ్చాయే కానీ మూడేళ్లు గడుస్తున్నా ఉక్కు ఏర్పాటు శంఖుస్థాపనకే పరిమితం కావడం పట్ల ప్రజల్లో నైరాశ్యం నిండుకుందన్నారు కడప ఉక్కుకు మోక్షం కలిగించాలని కోరుకుంటున్నారన్నారు.
1800 సంవత్సరం లో కడపజిల్లా ఏర్పడిందని,తిరుమల తొలిగడప దేవునికడప చారిత్రక నేపథ్యం లో కడపజిల్లా అవిర్భవించిందన్నారు.వైఎస్సార్ మరణానంతరం జగన్ ఓదార్పు యాత్రను ఆపేందుకు వైస్సార్ కుటింబికులు అడగకపోయినా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వైస్సార్ జిల్లాగా ప్రకటించందని అన్నారు.చారిత్రక నేపేద్యమున్న కడపజిల్లాలో కడప పేరును తొలగించడం సముచితం కాదని అన్నారు వైస్సార్ కడప జిల్లాగా కొనసాగించాలని సర్వప్రజానిక ఆకాంక్ష అన్నారు.
కడప కలెక్టరేట్ ఏర్పడి 200 ఏళ్ళు కావడంతో ఆదిశగా నాటి ముఖ్యమంత్రి వైస్సార్ ఆధ్వర్యంలో ద్విశతాబ్ది ఉత్సవాలు జరుపుకున్నామని గుర్తుచేశారు.అంతటి మహోన్నతమైన కలెక్టరేట్ నేడు కుక్కలు పందులు,కోళ్లకు ఆలవాలమై గబ్బు పడుతోందని నేటికి పాత కలెక్టరేట్ చెక్కు చెదరలేదని వినియోగంలోకి తేవాలని కోరారు.దశాబ్ద కాలం కలెక్టరేట్లో అడుగు పెడుతుంటే ప్లోర్ లేచివస్తుందని,పూర్తిగా పరిశుభ్రత లోపించిందని మెయింటెన్స్ లేదన్నారు చారిత్రక కలెక్టరేట్ వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని కోరారు జగన్మోహన్ రెడ్డి దృష్టి పెడితే సమస్యే కానీ ఈ మూడు సమస్యలు తీరుతాయని ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని లేఖలో కోరారు.