Suryaa.co.in

Andhra Pradesh

విజయసాయి రెడ్డి సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాలు ఇప్పించాడట!

ట్విట్టర్ లో మాజీ మంత్రి, టిడిపి నేత అయ్యన్నపాత్రుడు …

ఏ1 జగన్ రెడ్డి గారు వాలంటీర్ల ఉద్యోగాలు ఇస్తే నేనేమైనా తక్కువ తిన్నానా అంటూ ఏ2 విజయసాయి రెడ్డి సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాలు ఇప్పించాడట! జాబ్ మేళా అంటే ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, టెలికాం లాంటి రంగాల్లో ఉద్యోగాలు ఇస్తారేమో అనుకున్నా….మీరు ఇచ్చేది సెక్యూరిటీ గార్డ్, హెల్పర్, సేల్స్ పోస్ట్ లని ఇప్పుడు తెలిసింది.

(బ్లూ) మీడియా హడావుడి చూసి జగన్ రెడ్డి హామీ ఇచ్చిన 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎలాగో చెయ్యడం లేదు కనీసం వీసా రెడ్డి సీమ ప్రాంత బిడ్డలకు నాలుగు ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తాడు అని ఆశ పడ్డాం. ఫైనల్ గా తేలింది ఏంటంటే….రెజ్యుమ్ లు ఇచ్చి వెళ్ళమన్నారట. మీ ప్రచార యావ వల్ల రాను పోను ఛార్జీలు వృధా. మీ బ్రతుక్కి రూ.5 వేల జీతానికి మించి ఆశించి రావడం ముమ్మాటికీ తప్పే.

 

LEAVE A RESPONSE