Suryaa.co.in

Features

ప్రాచీన హోదా పోయినా.. అమ్మభాష తొలి ఆనవాళ్లు దొరికాయ్..

అమ్మ భాష మొదట ఆనవాళ్ళు దొరికిన సందర్భంగా అభినందనలు. ప్రాచీన భాష హోదా తమిళ వాళ్లకు దక్కినప్పుడు, ద్రవిడ ప్రాంత వాసులుగా దక్షిణాది రాష్ట్రంలో ఒకటిగా ఉన్నందుకు నేను కూడా గర్వించాను.

అయితే అంతే ప్రాచీన హోదా కలిగిన, తెలుగు భాషకి దక్కలేదని నాడు బాధ ఉండేది.అయితే మన పూర్వీకులు కూడా, తెలుగు భాష ఉన్నతి కోసం దాని వైభోగం గురించి ఎంతగానో పరితపించారనేది సత్యం.

అయితే గత రెండు దశాబ్దాలుగా, తెలుగు భాష ఉన్నతికోసం ప్రయత్నాలు చేయడం అని డిమాండ్ చేయాల్సిందిపోయి.. కనీసం మన అమ్మ బాషని బ్రతికించండని ప్రజలు, బాషాకోవిదులు ప్రభుత్వాన్ని అడుక్కోవడం అత్యంత విచారకరం సిగ్గుచేటు కూడా..బాష కోసం పక్కన ఉన్న తమిళులు,కన్నడిగులు,మలయాళీలు ఎంత ప్రాణం పెడతారో మనం చూస్తుంటాం. వివిధ సందర్భాల్లో వారు అంతా విడిపోయి విభేదిస్తారేమో కానీ, భాష సంస్కృతి విషయంలో వారు ఎప్పుడూ ఒక్కటే.కానీ మనకి మాత్రం, మన భాష అంటే అదొక లోకువ. మన భాషపై మనమే సినిమాల్లో జోకులు వేస్తాం.

ఇకపోతే మన భాష ఎంత ప్రాచీనమైనదో తెలియడానికి ఉన్న ఒకే ఒక ఆనవాలు శాసశాలు. ఆనాటి శతాబ్దాల కాలం నాటి ఆనవాళ్ళు, రాళ్ళపై శాసనాల రూపంలో నాటి రాజులు చెక్కించారు. అవి ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన చరిత్ర సాక్ష్యాలని.. మనం నిర్లక్ష్యంతో ఎన్నిటినో పోగొట్టుకున్నాం.

చరిత్రలో తెలుగునేలపై తొలి తెలుగు శాశనం , మన కడప జిల్లాలో కనుగొన్నట్టు మనకు దొరికిన ఆధారాలు ఉన్నాయి కడప జిల్లా
Renati-Cholas-Raju కలమల్లలో తొలి తెలుగు శాసనం దొరికిందనేది, తెలుగు సాహిత్యంతో పరిచయమున్న వారందరికీ తెలుసు.

ముత్తు రాజు ధనంజయుడు అనే ఒక రేనాటి చోడరాజు కాలంలో వేసిన శాసనం. అది క్రీ.శ శకం 575 నాటిదిగా చెబుతున్నారు. కలమల్ల చెన్నకేశవస్వామి ఆలయంలో ఆ శాసనాన్ని, 1904 లో మొదటిసారి నకలు తీశారు.

ఆపై కలమల్లలో తొలి తెలుగు శాసనం లేదనీ, దాన్ని మద్రాసు మూజియంకి తరలించారనీ.. అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో, ఆ శాశనం ఏమైపోయిందో ఎవరికీ తెలియదనీ తెలుగు సాహిత్య చరిత్రకారులు చెప్తూ వచ్చారు.

.అయితే అనూహ్యంగా కొందరు తెలుగు ప్రేమికుల నిరంతర శ్రమతో.. వారి పోరాటపటిమతో తప్పిపోయిందని, మద్రాస్ తరలిపోయిందని భావిస్తూ వచ్చిన తొలి తెలుగు శాశనం నేడు వెలుగు చూసింది. తొలి తెలుగు శాసనం దొరికితే.. దానిపై ఒక చిన్న పేపర్ కటింగ్ తో వార్త రాసి, వదిలేసిన నాలుగో స్తంభం..దానిపై మీడియా చర్చలు అసలే లేవు.

మన ఉనికి మన తల్లి భాష ఆనవాళ్ళు దొరికిన ఈ సందర్భాన.. దానికోసం ప్రయత్నించిన ప్రతి బాషాభిమానికి మనస్ఫూర్తిగా హార్ధిక కృతజ్ఞతలు ధన్యవాదాలు. ఈ సందర్భంగా తెలుగునేలపై ఉన్న ప్రతి తెలుగువారు గర్వించే సందర్బం. మనం అయినా అందరికీ తెలియజేద్దాం.

– గూడూరు ఆంజనేయరాజు

LEAVE A RESPONSE