– ఇసుక, మద్యందోపిడీచాలక, ధరలు పన్నులుపెంచి ప్రజలను పీక్కుతినడమేనా జగన్ రెడ్డీ …నువ్వు అమలుచేస్తున్న సంక్షేమం?
– మూడేళ్లలో 7లక్షలకోట్లకు పైగా అప్పులుచేసి, సంక్షేమం పేరుతో ప్రజల్ని మోసగిస్తూ, ప్రతిపక్షాలపై బురదజల్లి పబ్బంగడుపుకోవాలనుకుంటున్న జగన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది.
-ముఖ్యమంత్రిస్థానంలో ఉండి, అబద్ధాలు, అసత్యాలు, దగా మోసంతో ఓట్లేసిన ప్రజలను వంచిస్తూ ఆస్థానానికి ఉన్నపరువు, ప్రతిష్టలు మంటగలపొద్దు జగన్ రెడ్డీ !
– టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
ప్రమాణస్వీకారం నాడు ఏమాటలైతే చెప్పి, ప్రజలను ఆశపెట్టాడో, అదే మాటలను మూడేళ్ల పాలన పూర్తయ్యాక కూడా ముఖ్యమంత్రిచెప్పడం ముమ్మాటికీ ఆయన అసమర్థత చేతగానితనం, వైఫల్యాలనుకప్పిపుచ్చుకోవడమే అవుతుందని, ఆయనేదోప్రజలకు మంచి చేస్తానంటుంటే ప్రతిపక్షాలు వద్దన్నాయని చెప్పడం, ఆడలేకమద్దెల ఓడనిచెప్పడమే అవుతుందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కాఆనంద్ బాబు తేల్చిచెప్పారు.శనివారం ఆయన మంగళగిరిలోనిపార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే …
తానేదో నీతిమంతుడైనట్టు, విరామం లేకుండా ప్రజలకుమంచిచేస్తున్నట్లు, ఆయనేదో రాష్ట్రాన్ని, ప్రజల్ని ఉద్ధరిస్తుంటే ప్రతిపక్షాలు, కొన్నిమీడియాసంస్థలు అడ్డుకుంటున్నాయని జగన్ రెడ్డి నిన్నఒంగోలుసభలో చెప్పడం, ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకోవడమే. ప్రతిపక్షాలు సంక్షేమపథకాలు వద్దంటున్నాయని బహిరంగసభలో జగన్ రెడ్డి నిస్సిగ్గుగా, తననీతిమాలినతనంతో అబద్ధాలు చెప్పాడు. జగన్ రెడ్డి మూడేళ్లలో రాష్ట్రంలో అమలుచేసిన సంక్షేమం అంతా ఫార్స్..పచ్చిదగా. అసలు అభివృద్ధి అనేది భూతద్దం వేసివెతికినా కనిపించదు.
2014-19 మధ్యన రాష్ట్రంలో అమలైనన్ని సంక్షేమకార్యక్రమాలు ఎన్నో, ఇప్పుడు ఈముఖ్యమంత్రి గొప్పలుచెప్పుకుంటున్న సంక్షేమం ఎంతో, తనప్రభుత్వంలో నిజంగా ఎంతమందికి ఎలాంటి లబ్ధిజరిగిందనే దానిపై జగన్ రెడ్డి పూర్తివాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేయగలడా? టీడీపీప్రభుత్వ హాయాంలో రాష్ట్రంలోని వివిధశాఖల్లో 119 సంక్షేమపథకాలను అమలుచేశారు జగన్ రెడ్డీ. నీ ప్రభుత్వం ఎన్నిపథకాలను ఎంతసక్రమంగా ఎందరు లబ్దిదారులుంటే ఎంతమందికి ఇస్తున్నారో చెప్పగలవా?
రూ.200ఉన్న పింఛన్ ని చంద్రబాబుగారు పదిరెట్లుపెంచి రూ.2వేలకు తీసుకెళ్తే, 3వేలు ఇస్తానని చెప్పిఅధికారంలోకివచ్చిన జగన్ రెడ్డి అవ్వాతాతలను, వితంతువులను, వికలాంగులను వంచించలేదా? జగన్ రెడ్డి రూ.3వేల పింఛన్ ఇస్తే చంద్రబాబునాయుడు వద్దన్నాడా? అధికారంలోకి వచ్చినెంటనే రూ.3వేల పింఛన్ ఇస్తాననిచెప్పిన జగన్ రెడ్డి రెండురన్నరేళ్లు గడిచాక రూ.2,500లుచేశాడు. ఏటా పెంచుకుంటూపోతానంటే, అప్పటి వరకు అవ్వాతాతలు అడుక్కుతినాలా ముఖ్యమంత్రి?
జగన్ రెడ్డి తనహామీ ప్రకారం రైతుభరోసా 13,500లు ఇస్తే ఎవరువద్దన్నారు? అధికారంలోకిరావడమే ఆలస్యం కేంద్రంతో సంబంధంలేకుండా ఏటా ప్రతిరైతుకి, ఆఖరికి కౌలురైతులకు కూడా రూ.13,500లు ఇస్తాననిచెప్పి, ఇప్పుడు రూ.7,500లతోసరిపెట్టి రైతులనోట్లో మట్టికొట్టింది ఎవరు జగన్ రెడ్డీ? నువ్వుచేస్తోంది రైతుదగా కాదా? ప్రతిఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అందరికీ ఏటా రూ.15వేలను అమ్మఒడికింద ఇస్తాననిచెప్పి, అధికారంలోకి రాగానే దాన్నికొందరికేపరిమితం చేశావు.
రాష్ట్రవ్యాప్తంగా 85లక్షలమంది విద్యార్థులుంటే, కేవలం 44లక్షలమందికే ఇవ్వడం వారికి అన్యాయం చేయడం కాదా జగన్ రెడ్డీ? రూ.15వేలల్లో వెయ్యికోతపెట్టి, రూ.14వేలకు పరిమితంచేశావు. 5.రూ.లకు అన్నంపెట్టే అన్నాక్యాంటీన్లు ఎవరు వద్దంటే తొలగించావు జగన్ రెడ్డీ. నువ్వు పేదలకడుపు నింపుతుంటే మాపార్టీ వాళ్లు వచ్చి అడ్డుకున్నట్లు మాట్లాడుతున్నావు సిగ్గులేకుండా! ఎస్సీ,ఎస్టీ, బీసీ, కాపువర్గాల్లోని విద్యార్థులకు విద్యోన్నతి విదేశీవిద్య పథకాలకింద టీడీపీప్రభుత్వం రూ.10లక్షలవరకు అందిస్తే, ఆపథకాలను ఎందుకు ఎత్తేశావు జగన్ రెడ్డీ? ఎస్సీ,ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ కింద ఆయావర్గాలకు 5ఏళ్లల్లోనే చంద్రబాబుగారు రూ.45వేలకోట్లవరకు ఖర్చుపెట్టారు. నువ్వు ఈ మూడేళ్లలో ఎంతఖర్చుపెట్టావు జగన్ రెడ్డీ?
అసలు సబ్ ప్లాన్ నిధులనే లేకుండా చేశావు. అబద్దాలతో, చేతగానితనాన్ని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం జగన్ రెడ్డికి పుట్టుకతోనే అబ్బింది. ముఖ్యమంత్రిస్థానంలో ఉండి నోటికొచ్చినట్లు అబద్ధాలుచెప్పడం నీకే చెల్లింది జగన్ రెడ్డీ. పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు పెరిగాయంటే కేంద్రంపై నిందలేస్తున్నావు…నువ్వు రాష్ట్రంలోఎంతపెంచావో సమాధానంచెప్పు జగన్ రెడ్డీ. రాష్ట్రంలో నిత్యావసరాలు, పెంచిన విద్యుత్, ఆర్టీసీఛార్జీలు ఎవరు పెంచమంటే ఈ ముఖ్యమంత్రిపెంచాడు? చంద్రబాబు హాయాంలో రెండునిమిషాలుకూడా కరెంటుకోతలు లేవు.. జగన్ రెడ్డి తన అవినీతితో విద్యుత్ రంగనాన్నినాశనంచేయబట్టే… రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరిగి, విద్యుత్ కోతలు మిగిలాయి.
టీడీపీప్రభుత్వంలో ఏపీ దేశంలో మిగులువిద్యుత్ ఉన్న రాష్ట్రాలు మూడుఉంటే, వాటిలో ఒకటిగా నిలిచింది. ఆస్తిపన్నుపెంపుతో ఏటా రూ.8వేలకోట్లను పోగేసుకుంటున్న జగన్ రెడ్డీ, చెత్తపన్ను, స్టాంప్ డ్యూటీని 15శాతంవరకు ఎవరికోసంపెంచారు? తనకు సిమెంట్ కంపెనీ ఉందని, సిమెంట్ రంగాన్ని తనగుప్పెట్లో పెట్టుకొని ధరలు పెంచేశాడు.
మూడేళ్లలో లక్షా38వేలకోట్లు ఖర్చుపెట్టానంటున్న ముఖ్యమంత్రి, అదేదో పెద్దగొప్ప అనుకుంటున్నాడు. 7లక్షలకోట్లకుపైగా అప్పులుతెచ్చి, పరిపాలనగాలికివదిలేస్తే రాష్ట్రం శ్రీలంక కాక ఏమవుతుంది జగన్ రెడ్డీ? తలకుమించిన అప్పులుతెచ్చి, ఆ ఆ సొమ్మంతా శ్రీలంకపాలకులు దిగమింగబట్టేకదా.. ఆదేశానికి ఇప్పుడు అంత దుర్గతిపట్టింది.
2.50 లక్షలకోట్ల రాష్ట్రబడ్జెట్లో కేవలం 17శాతంనిధులు మాత్రమే జగన్ రెడ్డి ప్రజలసంక్షేమానికి ఖర్చుపెట్టాడు. ఇసుక, మద్యం అమ్మకాలతో నిత్యం వేలకోట్లను జగన్ రెడ్డి తన ఇంటికి తీసుకెళుతూ, లక్షలాది కార్మికుల పొట్టకొట్టాడు. మద్యం అమ్మకాలతో ఏటా రూ.8వేలకోట్లు ముఖ్యమంత్రి జేబులోకి వెళుతున్నది నిజమా…కాదా? జగన్ రెడ్డి ఆయనపార్టీ వారే సొంతంగా మద్యంతయారుచేస్తూ, వారే లేబుల్స్ అంటించి మరీ విక్రయాలు సాగిస్తున్నారు.
ఇసుకపాలసీ పేరుతో లక్షా35వేలమంది భవననిర్మాణకార్మికులను జగన్ రెడ్డి రోడ్లపాలుచేశాడు. టీడీపీహయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.1500లుఉంటే, మీప్రభుత్వంలో రూ.6వేలు, రూ.7వేలకు అమ్మారు. లారీఇసుక రూ.60, 70వేలకు అమ్మారు. ఎందుకంత ధరపెరిగిందో జగన్ రెడ్డికి తెలియదా? ఏటాఇసుకఅమ్మకాలతో జగన్ రెడ్డి రూ.10వేలకోట్ల వరకు దోచుకుంటున్నది నిజంకాదా? ఈవిధంగా ఏదిదొరికితే దాన్నిదోచుకోవడమేనా జగన్ రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమం? అధికారంలోఉన్నా.. ప్రతిపక్షంలోఉన్నా… ప్రజలను రెచ్చగొట్టడమే జగన్ రెడ్డి పనిగాపెట్టుకున్నాడు.
వారిలో విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజలను కుల, మత, వర్గాలుగా విడగొట్టి పబ్బంగడుపుకోవాలన్నదే జగన్ రెడ్డి ప్రధానలక్ష్యం. తన చేతగానితనాన్ని ఎదుటివారిపైకి నెట్టేసి, తప్పించుకోవాలనిచూస్తున్న జగన్ రెడ్డిని, ఆయన బాదుడు విధానాలను ప్రజలు గమనిస్తూనేఉన్నారు. జగన్ రెడ్డికి స్థాయి ఏమిటో అందరికీ తెలుసు… దానిగురించి మేం మాట్లాడము. కనీసం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవ్యక్తి, ఆస్థానం పరువుతీయకుండా నడుచుకోవాలని హితవు పలుకుతున్నారు.