Suryaa.co.in

Andhra Pradesh

వ్యక్తిగత రాజకీయ కక్ష సాధింపులకు నల్ల చట్టం దుర్వినియోగం

– సుప్రీంకోర్టు నిర్ణయం సంచలనాత్మక నల్ల చట్టం అమలుపై స్టే ఉత్తర్వులు
– బాధితుల పక్షాన న్యాయమూర్తులకు పాదాభివందనాలు
– ఎంపీ రఘురామ కృష్ణంరాజు

దేశం లో ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ రాజకీయ, వ్యక్తిగత స్వార్థం వల్ల బ్రిటిష్ హయం లో అమలు లో ఉన్న 124 ఏ నల్ల చట్టం అమలు చేస్తూ వచ్చారని, ఎట్టకేలకు ఈ చట్టం అమలు పై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం పట్ల నరసాపురం ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు. ఇదొక సంచలనాత్మక నిర్ణయమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ తో పాటు ఇతర న్యాయమూర్తులకు ఈ చట్టం ద్వారా బాధింపబడిన బాధితుల పక్షాన తాను పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు.

స్వాతంత్ర అనంతరం సొంతంగా రాజ్యాంగం రాసుకున్నామని, రాజ్యాంగం ద్వారా పౌరులకు ఎన్నో ప్రాథమిక హక్కులను కల్పించడం జరిగిందన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ వంటి హక్కులను కల్పించినప్పటికీ, ఇంకా బ్రిటిష్ కాలము నాటి 124 ఎ నల్ల చట్టాన్ని కొనసాగించడం వల్ల ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై రాజ ద్రోహం కింద కేసులు పెట్టి వేధించడం పరిపాటిగా మారిందన్నారు.

బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ… బ్రిటిష్ కాలం లో మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్ వంటి వారిపై చట్టంలోని 124 ఏ ఆధారంగా మోపిన రాజద్రోహం కేసు ను కక్ష్య సాధించేందుకు సింహం గా పిలవబడే జగన్మోహన్ రెడ్డి, ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ను అడ్డంగా పెట్టుకుని గత ఏడాది మే 14న తనపై కూడా మోపిన విషయం తెలిసిందే నని గుర్తు చేశారు. రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసి చంపి వేయాలని చూశారన్నారు.

అయినా తాను ప్రాణాలతో బతికి బయటపడ్డానని చెప్పు కొచ్చారు. 124 ఏ చట్టం అమలు పై సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వడం చూసి ఈ కేసు లో దెబ్బలు తిన్నప్పటికీ , ఈ రోజు ఆనంద పడుతున్నానని చెప్పారు.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తనపై రాజ ద్రోహం కేసు మోపిన తరువాత ఈ విషయాన్ని తాను అన్ని రాష్ట్రాల గవర్నర్ల, లోక్ సభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి సభ్యుల దృష్టికి తీసుకువచ్చేందుకు లేఖలు రాశానని పేర్కొన్నారు.

తనపై 124 ఏ చట్టం కింద రాజకీయంగా తనపై కక్ష సాధించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసు నమోదు చేయగానే, ఈ చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్, తన సహచర లోక్ సభ సభ్యులు మోగు వా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రఘురామ వెల్లడించారు.. 124 ఏ చట్టం రద్దులో తాను కూడా కీలకపాత్ర పోషించినందుకు ఆనందంగా ఉందన్నారు.. లేకపోతే ఈనెల నల్ల చట్టంపై మరో నాలుగేళ్ళకో, లేదంటే పదేళ్లకో చర్చ జరిగి ఉండేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేయడం ఖాయమన్న ఆయన, పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు తాను కూడా మాట్లాడతానని చెప్పుకొచ్చారు.

నారాయణ పై 409 కింద కేసు పెట్టడం ఏమిటీ?… బుద్ధుందా??
మాజీ మంత్రి నారాయణ పై 409 కింద కేసు పెట్టడమేమిటని?, ఈ కేసు పెట్టిన వెధవ కు ఏమైనా బుద్ధి ఉందా అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. చట్టంలోని ఐపిసి 409 సెక్షన్ కింద కేసు పెడితే పదేళ్ల జైలు శిక్ష ఆన్న ఆయన ఈ విషయాన్ని ఇంకా చెప్పు కోవడమా అంటూ ఎద్దేవా చేశారు. పనికిరాని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, న్యాయమూర్తిపై ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ ఆమె బెయిల్ మంజూరు చేయడమే కాక, పూచికత్తు దాఖలుకు వారం రోజులు వ్యవధిని కేటాయించటం పట్ల రఘు రామ తన కంటే వయస్సు లో చిన్న వారైనా జడ్జికి శుభాభినందనలు తెలియజేశారు.

తెల్లవారు వరకు పని చేసి న్యాయ పరిరక్షణ కృషి చేసిన న్యాయమూర్తి కి ధన్యవాదాలు తెలిపారు . ఈ మధ్య ఒ కే రోజు రెండు కేసులు నమోదు చేసే విధానానికి తమ పార్టీ వారు తెర లేపారన్నరు. మంగళగిరి లో కాగితం కలం తో ఎల్లప్పుడు సిద్ధంగా ఉండే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు చేయగానే, కేసులు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉండే సునీల్ కుమార్, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిలు తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు.. నారాయణ కేసులో ఎఫ్ఐఆర్ ను కూడా రహస్యంగా ఉంచాలని చూశారన్నారు. ఎఫ్ ఐ ఆర్ ను కూడా న్యాయస్థానం కొట్టివేయడం ఖాయం అన్నారు. ఎఫ్ఐఆర్ కొట్టివేసిన తర్వాత అయినా పరిపాలన పై దృష్టి పెట్టాలని సూచించారు..

రెడ్డి తొలగింపు ఎందుకు?
పదవతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఐదు మందికి తొలుత మెసేజ్ వెళ్తే, ఆరోవ వ్యక్తి గిరిధర్ రెడ్డి కి వెళ్లిందని అన్నారు. దానికి ఆయన పేరు చివరన ఉన్న రెడ్డిని తొలగించి గిరిధర్ అంటూ సంబోధించారని పేర్కొన్నారు. సురేష్ విషయం లో అలాగే జరిగిందని, ఒంగోలులో వాహనాన్ని నిలిపి తీసుకు వెళ్ళిన అధికారి తిరుపాల్ విషయంలోనూ అలాగే వ్యవహరించార ని రఘురామ అన్నారు. దేశం కోసం రెడ్లు ఎన్నో త్యాగాలు చేశారని, రెడ్డి పేరు పెట్టుకోవడం తప్పేమీ కాదన్నారు. అన్ని కులాల్లోని కొంతమంది ప్రబుద్ధులు ఉంటారని విమర్శించారు.. ఇటీవల రాజేంద్రనాథ్ రెడ్డి రాజేంద్రనాథ్ అయ్యారని, అలాగే జగన్ మోహన్ రెడ్డి కూడా జగన్ మోహన్ అవుతారేమోనని ఎద్దేవా చేశారు.

గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించా
రిషికొండ ను ద్వంసం చేసి పర్యాటక బ్లాక్ ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తాను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్ జీ టి)నీ ఆశ్రయించినట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. 2006లో రిషికొండ ను ధ్వంసం చేయకుండా 20 వేల చదరపు గజాలలో కాటేజీలను నిర్మించారని గుర్తు చేశారు.. అయితే ఇప్పుడు రిషికొండ ను ధ్వంసం చేస్తూ రెండు లక్షల చదరపు గజాలలో బ్లాకుల వారీగా కాటేజీలను నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ప్రకృతి అందాలను ధ్వంసం చేయకుండా ఉండడానికి రి సభ్య కమిటీ ఏర్పాటు చేశారన్న ఆయన, ఈ కమిటీ ఇచ్చే నివేదికను కూడా కొన్ని దుష్ట శక్తులు తారుమారు చేసే అవకాశం లేకపోలేదని అన్నారు.విశాఖ ను ప్రేమించే ప్రతి ఒక్కరు కేంద్ర పొల్యూషన్ బోర్డ్ కు ఇచ్చి, రిషికొండ డ్వంసం అడ్డుకోవాలని కోరారు.

ప్రజల ప్రశ్నకు సమాధానం చెప్పాలి
గడపగడపకు వైయస్సార్ కార్యక్రమాన్ని గడపగడపకు మన ప్రభుత్వం గా మార్చిన ప్రభుత్వ పెద్దలు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. చెత్త పన్ను, , పెరిగిన విద్యుత్ చార్జీలు, నిలిచిపోయిన పెన్షన్ లపై తన ఇంటి ముందుకు వచ్చే అధికారులను ప్రజలు నిలదీసే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉందని దానికి రికార్డులు ఖచ్చితంగా సమాధానం చెప్పాలన్నారు.

స్కిల్ డెవలప్మెంట్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు గత ఆరు నెలలుగా జీతాలు లేవని, ఇదే పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదన్నారు. కొవ్వూరు లంక గ్రామంలో చెట్లను నరికి 10 కోట్లకు అమ్మకానికి స్థానిక ఎం పి పి నారాయణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిసిందని, ఈ విషయమై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు రఘురామ కృష్ణంరాజు తెలిపారు..

LEAVE A RESPONSE