నీ కళ్ళు
నిన్ను మోసం చేయొచ్చు..
మేకప్ ని కూడా
అద్భుత సౌందర్యలాగా
చూపించవచ్చు!
నీ చెవులు
నిన్ను మోసం చేయొచ్చు..
పచ్చి అబద్ధాల్ని కూడా..
పచ్చి నిజాలుగా వినిపించవచ్చు!
నీ మనసు
నిన్ను మోసం చేయొచ్చు..
నమ్మక ద్రోహాలను సైతం..
పవిత్ర ప్రేమలుగా..
భ్రమింప చేయవచ్చు..
మీ ఆత్మ మాత్రం..
ఎప్పటికీ..
నిన్ను మోసం చేయదు!
ఎల్లప్పుడూ..
నీకు మంచి మార్గం..
చూపిస్తూనే ఉంటుంది!
అందుకే..
ఆత్మ మాట
విన్నవాళ్ళు మాత్రమే..
ఆత్మానందాన్ని పొందుతారు!!