• ముఖ్యమంత్రి జగన్ చేసేవన్నీ చీకటి, 420 పనులు, తెరచాటు వ్యవహారాలే
• మూడు ఏళ్లలో జె ట్యాక్స్ కోసం పరిశ్రమల్ని తరిమేసిన మీరు పెట్టుబుడులు తేవడానికి వెళ్లారంటే ప్రజలు నమ్మాలా ?
• 2019 ఎన్నికలకు ముందు డబ్బుల కోసం జగన్ లండన్ వెళ్లారు, ఇప్పుడు కూడా అందుకే వెళ్లారు
• దానితో పాటు వ్యాన్ పిక్ కేసులో అరెస్టైన నిమ్మగడ్డ ప్రసాద్ కేసు పంచాయితీ కోసమే రస్ అల్ ఖైమా ప్రతినిధుల్ని కలిసేందుకు జగన్ రెడ్డి లండన్ వెళ్లారు
• జగన్ రెడ్డి తన విలాసాల కోసం దావోస్ పర్యటనకు విమానానికే రూ. 9 కోట్ల రూపాయలు ప్రజాధనం దుబారా చేశారు
• జగన్ పర్యటనపై సాక్షిలో పచ్చి అబద్దాలు రాశారు, ప్రజలెవరూ సాక్షి రాతల్ని నమ్మెద్దు
• ముఖ్యమంత్రి తప్పుడు పనుల్ని కప్పి పుచ్చేందుకే మంత్రుల అబద్దాలు
• దావోస్ పర్యటనలో ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారో దావోస్ నుంచి రాగానే ముఖ్యమంత్రి ప్రజలకు చెప్పాలి
ముఖ్యమంత్రి జగన్ చేసేవన్నీ చీకటి, 420 పనులు, తెరచాటు వ్యవహారాలేనని తన ఆర్దిక వ్యవహారాలు చక్కదిద్దుకునేందుకు దావోస్ ముసుగులో లండన్ వెళ్లారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ జాతీయ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….
ముఖ్యమంత్రి జగన్ దావోస్ కి వెళ్తానని కోర్టు పర్మిషన్ తీసుకుని లండన్ ఎందుకెళ్లారు ? 3 ఏళ్లలో జే ట్యాక్స్ కోసం పరిశ్రమల్ని తరిమేసిన మీరు పెట్టుబుడులు తేవడానికి దావోస్ వెళ్లారంటే ప్రజలు నమ్మాలా? జగన్ తన ఆర్దిక వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకే దావోస్ ముసుగులో లండన్ వెళ్లారు. 2019 సాధారణ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 20వ తేదీన లండన్ వెళ్లారు. ఎన్నికలకు డబ్బులు సర్దుబాటు చేసుకోవడానికే లండన్ వెళ్తున్నాడని నాడు టీడీపీతో సహా అనేక రాజకీయపార్టీలు ప్రస్తావించాయి. మరలా నేడు ముందస్తు ఎన్నికల ప్రచారం తీవ్రంగా జరుగుతున్న సందర్భంలో మళ్లీ డబ్బులు సర్దుబాటు చేసుకోవటం కోసమే జగన్ లండన్ వెళ్లారు.
అంతే కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన రస్ అల్ ఖైమా ప్రతినిధులు కూడా శుక్రవారం లండన్ లో ఉన్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టులో అన్ రాక్ అల్యూమినియం పరిశ్రమకు సంబందించి కేసుకు సంబందించి వారు లండన్ రావటం జరిగింది. జగన్ దొంగల ముఠా సభ్యుడు, జగన్ కి అత్యంత ఆప్తుడైన నిమ్మగడ్డ ప్రసాద్ వాన్ పిక్ వ్యవహారంలో రస్ అల్ ఖైమా సంస్ధకు టోకరా వేసినందుకు గానూ గతంలో సెర్బియా దేశంలో అతన్ని అరెస్టు చేశారు. నిమ్మగడ్డ ప్రసాద్ ను అడ్డం పెట్టుకుని వాన్ ఫిక్ ఫిక్ వ్యవహారంలో రసల్ ఖైమా సంస్ధను బురిటి కొట్టించి వేల కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి గ్యాంగ్ వేల కోట్లు దోచుకున్న విషయం విదితమే. నేడు ఆ వ్యవహారాన్ని రస్ అల్ ఖైమా ప్రతినిధులతో సెటిల్ చేసుకోవటం కోసం జగన్ రెడ్డి ప్రత్యేకించి లండన్ చేరుకున్నారు. దావోస్ ముసుగులో జగన్ రెడ్డి లండన్ వెళ్లింది తన డబ్బుల వ్యవహారాలు సెటిల్ మెంట్ చేసుకోవడం కోసమే.
జగన్ 3 ఏళ్లలోనే దేశంలోనే అత్యంత పనికిరాని ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ప్యాలెస్ లల్లో ఉండి సుఖానికి అలవాటు పడ్డ జగన్ దావోస్ వెళ్లటానికి గంటకు 15 వేల నుంచి 16 వేల డాలర్లు (ఇండియన్ ఎకానమీలో రూ. 12- 13 లక్షలు) ఖర్చు కాగల అత్యంత ఖరీదైన ప్రైవేటు విమానం ఎంబ్రాయిర్ లీనియజ్ 1000 అనే జగన్ బుక్ చేసుకున్నాడు. ఈ ప్రకారం దావోస్ పర్యటనకు కేవలం విమానానికే దాదాపు రూ. 8 నుంచి రూ. 9 కోట్ల రూపాయల ఖర్చవుతుంది. జగన్ రెడ్డి విలసాల కోసం కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుబారా చేస్తున్నాడు. దావోస్ వెళ్తున్నానని కోర్టు అనుమతి తీసుకుని నేరుగా దావోస్ వెళ్లకుండా.. లండన్ లో దిగారు.
జగన్ దేశం దాటి వెళ్లాలంటే కోర్టు ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్ధితి. ఆ రకంగా చేతులు కట్టుకుని సీబీఐ కోర్టును అడుక్కోగా దావోస్ వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇలాంటి దిక్కుమాలిన స్థితి ఏ ముఖ్యమంత్రికి రాలేదు. చంద్రబాబునాయుడు రాయల్ గా ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్లేవారు. పని పూర్తి చేసుకొని వచ్చేవారు. జగన్ కు దావోస్ వెళ్తానని చెబితే పర్మిషన్ ఇచ్చారు. వెళ్లే ముందే కోర్టుకు తన పూర్తి పర్యటన వివరాలు, ఫోన్ నెంబర్లతో సహా కోర్టుకు సమర్పించాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. కానీ నేడు దానికి విరుద్దంగా కోర్టు అనుమతిని దిక్కరించే విధంగా జగన్ రెడ్డి లండన్ చేరుకున్నారు. కేవలం తన వ్యక్తిగత ఆర్దిక వ్యవహారాలు చక్కబెట్టుకొనేందుకు కోర్టును తప్పుదోవ పట్టించి దేశం దాటి బయటకొచ్చారు.
చేసినటువంటి ఈ తప్పుడు పని కప్పిపుచ్చుకోవటం కోసం తన సొంత మీడియాను కూడా ఉపయోగించుకుని ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. తన చేతిలో ఉన్న అవినీతి బురద పత్రిక సాక్షి పత్రికలో నిన్న ప్రచురితమైన ప్రధాన వార్త పరిశీలిస్తే జగన్ రెడ్డి శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి బయలుదేరి సాయంత్రానికి కళ్లా దావోస్ చేరుకున్నట్టు హెడ్ లైన్స్ లో రాయటం జరిగింది. వాస్తవానికి జగన్ రెడ్డి శుక్రవారం రాత్రికే లండన్ చేరుకోగా తన సొంత పత్రికలో దావోస్ చేరుకున్నానని రాయించటం అతని యెక్క దిగజారుడుతనానికి నిదర్శనం. ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి, తన అర్దాంగి మరియు రాష్ట్ర ఏవియేషన్ అడ్వైజర్ భరత్ రెడ్డి మాత్రమే ప్రయాణించగా అధికార బృందంతో కలిసి ముఖ్యమంత్రి ప్రయాణించారని సాక్షిలో తప్పుడు రాతలు రాశారు.
అంతే కాకుండా చేసినటువంటి తప్పుడు పని ప్రపంచానికి తెలిసిపోయిన సంధర్బంలో దానిని కప్పిపుచ్చుకోడానికి ఇద్దరు క్యాబినెట్ మంత్రులను కూడా రంగంలోకి దింపటం జరిగింది. రాష్ట్ర ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాద్ రెడ్డి, మరియు గుడివాడ అమర్నాద్ మీడియా ముందుకు వచ్చి నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు మాట్లాడటం జరిగింది. వారు చెప్పిన ప్రతి అబద్దాన్ని నేడు మేము ఆధారాలతో పటాపంచలు చేస్తున్నాం.
అబద్దం నెం.1 –
విజయవాడ నుంచి బయలుదేరి ఇస్తాంబుల్ చేరుకున్న తర్వాత అక్కడ ఇంధనం నింపుకోవటానికి తీవ్ర జాప్యం జరగటం వల్ల స్విటర్జాండ్ లోని జ్యూరిక్ కి ముఖ్యమంత్రి సకాలనికి చేరుకోలేయారు.
వాస్తవంతో కూడిన మా జవాబు
ముఖ్యమంత్రి ప్రత్యేక విమానం ఉదయం 9. 00కి 9.15 కి విజయవాడలో బయలుదేరి మధ్యాహ్నం ఇస్తాంబుల్ లోకల్ టైం 2 గంటలకు ఇస్తాంబుల్ విమానాశ్రయం చేరుకుంది. తిరిగి ఇస్తాంబుల్ లో 4.30 కి బయలు దేరింది. ఇస్తాంబుల్ విమానాశ్రయంలో కేవలం 2.30 గంటలు మాత్రమే ఆగటం జరిగింది. ఏ విమానానికైనా రీపిల్లింగ్ చేయటానికి కనీసం 2 గంటలు పట్టడం సహజం. కాబట్టి ఇస్తాంబుల్ విమానాశ్రంయలో జాప్యం జరిగిందన్నది పూర్తి అవాస్తవం.
అబద్దం -2
జ్యూరిక్ విమానాశ్రయంలో రాత్రి 10 గం. తర్వాత ల్యాండింగ్ కి అనుమతి లేదు కాబట్టి ముఖ్యమంత్రి లండన్ చేరుకోవటం జరిగింది.
వాస్తవాలతో కూడిన మా జవాబు
4.30 గం ఇస్తాంబుల్ లో బయలుదేరిన ముఖ్యమంత్రి విమానం సాయంత్రం 6.30 గంటలకల్లా జ్యూరిక్ విమానాశ్రయం చేరుకునే అవకాశం ఉండగా రాత్రి పది గంటల అంశం ఎందుకు ప్రస్తావనకు వస్తుంది? అంతే కాకుండా జ్యూరిక్ విమానాశ్రయం ఎరైవల్ డేటా పరిశీలించగా శుక్రవారం రాత్రి 11.27 ని. ల కూడా ఎల్ పింకీ నుంచి వచ్చిన హెల్వెటిక్ ఎయిర్ లైన్స్ వారి విమానం ల్యాండ్ అవటం జరిగింది. అంతే కాకుండా ఆ రోజున 10 గంటల తర్వాత దాదాపు 20 విమానాలు జ్యూరిక్ విమానాశ్రయంలో ల్యాండ్ అవటం జరిగింది.
అబద్దం నెం. 3
జ్యూరిక్ విమానాశ్రయంలో ఉన్న రద్దీ వల్ల అప్పటికప్పుడు రూట్ మార్చుకుని ముఖ్యమంత్రి లండన్ చేరారు.
వాస్తవాలతో కూడిన మా జవాబు
ఏ విమానానికైనా తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందే పూర్తి రూట్ మ్యాప్ వివరాలు తాము చేరుకోబోయే విమానాశ్రయానికి అందజేసి ల్యాండింగ్ కి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగానీ ఆర్టీసీ ఎర్రబస్సు లాగా అప్పటికప్పుడు తమ గమ్యస్ధానం బోర్డు మార్చుకునే అవకాశం విమానాలకు ఉండదు. ముఖ్యమంత్రి బయల్దేరిన BT-BRM కోడ్ గల E -190 విమానం జ్యూరిక్ విమానాశ్రయ అధికారులకు తమ రూట్ వివరాలు అందజేసిన సంధర్బంలో తాము లండన్ లోని లటక్ ఎయిర్ పోర్ట్ కి జ్యూరిక్ చేరుకోబుతున్నట్టు చాలా స్పష్టంగా తెలియపర్చడమైనది. దీన్ని బట్టి ఒక ప్రణాళిక ప్రకారమే ముఖ్యమంత్రి విజయవాడ నుంచి నేరుగా లండన్ వెళ్లి…తన ఆర్దిక వ్యవహారాలు చక్క బెట్టుకుని జ్యూరిక్ ఎయిర్ పోర్ట్ చేరుకోవటం జరిగింది.
అంతే కాకుండా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా విమనాశ్రయంలో రద్దీ వల్ల ల్యాండింగ్ కు వీలు కాకపోతే సాధారణంగా విమానాశ్రయానికి సమీపంలో ఉన్న వేరొక విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్ కి అనుమతి ఇస్తారు. ఉదాహరణకి తిరుపతి విమానాశ్రయంలో ల్యాండింగ్ కుదరకపోతే పక్కనున్న చైన్నై విమానాశ్రయానికి విమానాన్ని డైవర్ట్ చేస్తారు గానీ సింగపూరో , బ్యాంకాకో ఆ విమానాన్ని పంపించరు కదా. నేడు జ్యూరిక్ విమానాశ్రయంలో రద్దే ఏర్పడిన సంధర్బంలో దాని పక్కనున్న బేసిల్, స్ర్టట్ గార్డ్ వంటి అందుబాటులో ఉన్న అనేక అంతర్జాతీయ విమానాశ్రయాలకు ముఖ్యమంత్రి విమానం డైవర్ట్ అవ్వాలీ గానీ ఎక్కడో వేల కిలోమీటర్లున్న లండన్ లో ఉన్న విమానాశ్రయంలో ల్యాండింగ్ అవ్సాల్సిన అవసరం ఎందుకు ఉటుంది? ఇది కేవలం తన వ్యక్తిగత ఆర్దిక వ్యవహారాల కోసం కాదా?
ఆ విధంగా ఇద్దరు క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి రహస్య లండన్ యాత్రకు సంబందించి ప్రజల్ని నమ్మించడానికి చెప్పిన విషయాలు ఎంత పచ్చి అబద్దాలో ప్రజలు అర్దం చేసుకోవాలి.
ప్రజలకు భవిష్యత్తులో ఆరోగ్య వ్యవస్థని ఏ విధంగా పటిష్టపరచాలనే అంశంపై జగన్ దావోస్ లో ఉపన్యాసం ఇస్తారంట. కోవిడ్ సమయంలో ఏం సాధించారని ఆరోగ్య వ్యవస్థపై ఉపన్యాసం ఇస్తారు? మా రాష్ట్రంలో ఆక్సిజన్ అందక కొన్ని వందల మంది చనిపోయారని ఉపన్యాసం ఇస్తారా? మా రాష్ట్రంలో రెమ్ డెసివర్ ఇంజెక్షన్స్ ని అధిక ధరలకు బ్లాక్ లో అమ్ముకున్నామని ఉపన్యాసం ఇస్తారా? హాస్సిటలక బెడ్లు అమ్ముకున్నామని చెబుతారా? కోవిడ్ కిట్లలో కుంభకోణం చేశామని చెబుతారా? ప్రజల ప్రాణాలు పోతుంటే ఇంట్లో విలాసంవంతంగా గడిపానని చెబుతారా? కరోనాతో కలిసి జీవించాలని సలహాలు ఇచ్చిన మీరు దావోస్ లో ఆరోగ్యంపై ఏం ఉపన్యాసమిస్తారు?
ఏపీలో పెట్టుబడులు పెట్టాలని జగన్ రెడ్ది పారిశ్రామివేత్తల్ని ఎలా ఆకర్సిస్తారు? మా రాష్ట్రంలో వారంలో రెండు రోజులు పవర్ హాలిడే ఉంది పెట్టుబడులు పెట్టండని అడుగుతారా? పరిశ్రమలకు సరిగా కరెంట్ ఇవ్వలేని వ్యక్తి మన రాష్ట్రంలో ఏం సౌకర్యాలు ఉన్నాయని గొప్పగా చెబుతారు ?
రాష్ట్రంలో ఏ పరిశ్రమ పెట్టాలన్నా మంచి కనెక్టివిటీ, రోడ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్, లా అండ్ ఆర్డర్, ప్రశాంతమైన వాతావరణముండాలి. కానీ మా పనికిరాని ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కిలో మీటరు దూరంలో ఇన్ని గుంటలున్నాయి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హత్యలు చేసి వాళ్ల కార్లలో శవాలను వేసుకొని తిరుగుతున్నారని చెబుతారా? మా రాష్ట్రంలో ప్రతి రోజూ ఏదో ఒక చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని చెబుతారా? ఇవన్నీ చెప్పి మా రాష్ట్రంలో పెట్టుబడుటు పెట్టాలని జగన్ అడుగుతారా?
జే ట్యాక్స్ కోసం పీపీఏలు రద్దు సమయంలో జగన్ గురించి దావోస్ లో పెద్ద చర్చ జరిగింది. దావోస్ లో జగన్ పై ఫిర్యాదు చేయడానికి కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ముందు క్యూ కట్టారు. ఈ సంఘటనల నేఫధ్యంలో ఇండియాలో జే ట్యాక్స్ కింగ్ ఇతనే అని దావోస్ లో జగన్ ను వింత జంతువును చూసినట్లు చూస్తారు. సీబీఐ కోర్టుకు వెళ్లి నేను లండన్ వెళ్తా, నా డబ్బు వ్యవహారాలు తేల్చుకుంటా నంటే పర్మిషన్ ఇవ్వరు. కాబట్టే దావోస్ ముసుగులో లండన్ వెళ్లి తన ఆర్దిక వ్యవహారాలన్నీ చక్కబెట్టుకున్న తర్వాతే లండన్ వెళ్లారు. ఈ విషయాలు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. సాక్షిలో రాసే తప్పుడు రాతల్ని ప్రజలెవరూ నమ్మొద్దు. ప్రజాధనంతో ప్రత్యేక విమానంలో దావోస్ ఎందుకు వెళ్లారో ఆ పర్యటనతో రాష్ట్రానికి ప్రయోజనమేంటో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారో ముఖ్యమంత్రి దావోస్ నుంచి రాగానే ప్రజలకు సమాధానం చెప్పాలని కొమ్మారెడ్డి పట్టాభిరాం డిమాండ్ చేశారు.