ఒంగోలులో మహానాడు కార్యక్రమం ప్రారంభమయింది. తెలుగుదేశం పార్టీ పండుగలా నిర్వహించే మహానాడుకు ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు. మహానాడు ప్రాంగణం పసుపుమయంగా మారిపోయింది. సభావేదికపై పార్టీకి చెందిన కీలక నేతలందరూ ఆసీనులయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడే సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్ కు నివాళి అర్పించి, ప్రసంగాలను, చర్చలను ప్రారంభిస్తారు.
మరోవైపు, పార్టీ శ్రేణులకు స్వాగతం పలుకుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. టీడీపీ 40 వసంతాలు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు యుగపురుషుడు నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలు మహానాడు వేదికపైనే అని తెలిపారు. తాను తెలుగువాడిని, తెలుగుదేశం వాడిని, మహానాడులో పాల్గొనడం తమకు దక్కిన అదృష్టమని అన్నారు. తరలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా.. ఇదే నా ఆహ్వానం అని అన్నారు.
నేను తెలుగువాడిని, తెలుగుదేశం వాడిని, మహానాడులో పాల్గొనడం మనకి దక్కిన అదృష్టం. తరలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా.. ఇదే నా ఆహ్వానం.(2/2)#Mahanadu2022
— Lokesh Nara (@naralokesh) May 27, 2022