– వదంతులు నమ్మవద్దు
– డి.ఐ.జి.పాలరాజు
కోనసీమ – అమలాపురం : కోనసీమలో జరిగిన విద్వంసం అల్లర్లు నేపథ్యంలో ఇప్పటికే 62 మందిని అరెస్టు చేసిన పోలీసులు సోమవారం కూడా నిందితుల వేట ను ముమ్మరం చేశారు.ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాతో ఎలాంటి అవాస్తవ ప్రచారాలు జరగకుండా కోనసీమ వ్యాప్తంగా గత 6 రోజులుగా ఇంటర్నెట్ సేవలు నిలుపుదల చేశారు పోలీసులు.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి నుండి అమలాపురం డివిజన్ పరిధిలో లాకప్ డెత్ జరిగినట్లు నిరాధారిత పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.ఈ విషయం పై సోమవారం డి.ఐ.జి.పాలరాజు మీడియాతో మాట్లాడుతూ.. వదంతులు నమ్మవద్దు అన్నారు.. పుకార్లు షికార్లు చేస్తున్నాయి అని.. ఇంటర్నెట్ లేకపోయినా టెక్స్ట్ మెసేజ్ ల ద్వారా రూమర్స్ క్రియేట్ చేస్తూ స్ప్రెడ్ చేస్తున్న ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని డి.ఐ.జి .తెలిపారు.
అమలాపురం మండలం నడిపూడి గ్రామానికి చెందిన కేతా రమేష్ అనే అతను ఇలాంటి పుకార్లు మెసేజ్ లు గా పలువురు కి పంపించినట్లు గుర్తించి అరెస్ట్ చేసినట్లు డి.ఐ.జి.పాలరాజు తెలిపారు. ఇతని ద్వారా ఈ నెల 24న అమలాపురంలో జరిగిన అల్లర్లకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉండే అవకాశం ఉందని విచారన చేస్తున్నామని డి.ఐ.జి. వెల్లడించారు.