Suryaa.co.in

Telangana

భారీ సబ్సిడీపై ఎరువులు అందిస్తున్న ఘనత మోడీ దే

– రైతుల శ్రేయస్సు కోసం కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం ఎనలేని కృషి.
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్

దేశవ్యాప్తంగా రైతుల ప్రయోజనాలు, శ్రేయస్సు కోసం కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని, రైతులకు భారం పడకుండా భారీ సబ్సిడీతో ఎరువులను అందిస్తున్న ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ తెలిపారు.

పీఎం కిసాన్ పథకం కింద 11 విడత నిధులను మంగళవారం దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ విడుదల చేసిన సందర్భంగా మానకొండూరు నియోజకవర్గం అన్నారం గ్రామంలో జిఎన్ఎస్ ఎస్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఎఫ్ బి ఓ అవగాహన సమావేశ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు.

పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా అర్హులైన రైతులకు కేంద్రం ఏటా 3 విడతల్లో రూ. 2000 చొప్పున 6000 అందిస్తుందని చెప్పారు. ఇట్టిమొత్తం నేరుగా రైతు లబ్ధిదారుల ఖాతాలకు జమ అవుతున్నాయని, పార్లమెంటు పరిధిలో లక్షలాది మంది రైతులకు దీంతో ఎంతో ప్రయోజనం
bandi2 చేకూరుతుందని పేర్కొన్నారు. రైతును రాజు చేయాలనే కాంక్షతో కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తూ ఆలోచన చేస్తుందన్నారు. ముఖ్యంగా రైతులపై ఎరువుల భారం పడకుండా ఇటీవల తక్కువ ధరకు అందించడానికి వీలుగా కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు.

డి ఏ పి, నైట్రోజన్, పొటాషియం, ప్రాస్పరస్, ఎరువులకు సబ్సిడీ అందించడానికి 1 లక్ష 60 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని వివరించారు. ఒక బస్తా డీఏపీ ధర 3,851 ఉందని, సబ్సిడీ పొందే రైతులు 1,350 కె ఒక ఒక బస్తా పొందే విధంగా సబ్సిడీతో అందిస్తున్న విషయం రైతులు గ్రహించాలన్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో ఫెర్టిలైజర్ల ధరలు పెరిగినా దేశంలో రైతులపై కేంద్రం భారం మోప లేదన్నారు. రైతులపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం లాంటిదన్నారు. దేశం యొక్క స్థితిని, గతి శక్తిని మార్చడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో అనేక అద్భుతాలను సృష్టించి మెరుగైన పాలను అందిస్తుందన్నారు. ఎనిమిదేళ్ల మోడీ పాలన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయని చెప్పారు.

ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రారంభించిన ఎఫ్ బీవోకు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రూ. 15లక్షలు నేరుగా ఖాతాలో జమ చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సందర్భంగా పేర్కొన్నారు. పార్లమెంట్ పరిధిలో 2 లక్షల 39 వేలకు పైగా రైతుల ఖాతాల్లో నేరుగా రూ. 400 కోట్లకు పైగా జమ అయ్యాయని తెలిపారు.

LEAVE A RESPONSE