– జగన్ రెడ్డి అండ చూసుకుని రెచ్చిపోతున్న వైసీపీ రౌడీ మూకల్లారా నేటి నుంచి రోజులు లెక్కపెట్టుకోండి
– సరిగ్గా రెండే రెండేళ్ల తర్వాత మీ అరాచకాలను అదనంగా బోనస్ కలిపి ఇస్తాం
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్యాక్షన్ భావాల్ని నరనరనా నింపుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు మృగాల కంటే హీనంగా మారి మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం జంగమేశ్వరపాడులో టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్యను వైసీపీ రౌడీమూకలు హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తుంటే మరో వైపు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై దాడులు చేస్తూ, ప్రాణాలు తీస్తున్నారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ర్టంలో శాంతిభద్రతలు లేవు. జగన్ రెడ్డి అండతో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. ప్రతి రోజూ ఏదో ప్రాంతంలో సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.
అధికార మదంతో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్న వైసీపీ రౌడీమూకల్ని హెచ్చిరిస్తున్నాం..ఇవాళ నుంచి రోజులు లెక్కపెట్టుకోండి.. సరిగ్గా రెండే రెండేళ్ల తర్వాత మీరు చేసిన ప్రతి అరాచకానికి అదనంగా బోనస్ కలిపి ఇస్తాం. తీసుకోవడానికి సిద్దంగా ఉండండి. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి జల్లయ్యపై హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. జల్లయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది.