Suryaa.co.in

Telangana

హైద‌రాబాద్ లో 2,865 మంది పోలీసుల బదిలీలు

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీగా పోలీసులు బదిలీలు అయ్యారు. నగరంలో 2,865 మంది పోలీసులను బదిలీ చేస్తూ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. 219 మంది ఏఎస్ఐలు, 640మంది హెడ్ కానిస్టేబుళ్లు, 2006 మంది కానిస్టేబుళ్లు బ‌దిలీ అయ్యారు. పోలీసు సిబ్బంది బ‌దిలీ కోసం గ‌త ఐదేండ్ల నుంచి నిరీక్షిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా కూడా రెండేండ్లుగా పోలీసుల బ‌దిలీ ప్ర‌క్రియ చేప‌ట్ట‌లేదు. మొత్తంగా ఈరోజు పోలీసు బ‌దిలీల ప్ర‌క్రియకు సంబంధించి న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

LEAVE A RESPONSE