Suryaa.co.in

Andhra Pradesh

తగవుల పరిష్కారానికి ఫోర్‌మెన్ కమిటీ

పార్టీ నేతల మధ్య నెలకొన్న విబేధాల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ గురువారం నాడు జాతీయ పార్టీ కార్యాలయంలో తొలి సమావేశం నిర్వహించడం జరిగింది. నేతల మధ్య విబేధాలు, సమన్వయలోపం వంటి సమస్యల పరిష్కరించేలా ఈ కమిటీ సమన్వయం చేయనుంది. పార్టీ క్రమ శిక్షణ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.
కమిటీ సభ్యులు :
1. బచ్చుల అర్జునుడు
2. యనమల రామకృష్ణుడు
3. టి.డి.జనార్ధన్
4. దామచర్ల సత్య

LEAVE A RESPONSE