Suryaa.co.in

Telangana

తెలంగాణలో మాస్క్ తప్పనిసరి..

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డిహెచ్) శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ట్విట్టర్లో డిహెచ్ వెల్లడించారు.

కాగా దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే తక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 18819 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,34,52,164 కు చేరింది.

LEAVE A RESPONSE