Suryaa.co.in

National

మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫ‌ఢ్న‌వీస్‌…

మ‌హారాష్ట్రలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం ముగింపు దిశ‌గా అడుగులు ప‌డుతున్న త‌రుణంలో గురువారం రాత్రి మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. మ‌హారాష్ట్ర సీఎంగా శివ‌సేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ప్ర‌మాణ స్వీకారం చేయడానికి కాస్తంత ముందుగా బీజేపీ అధిష్ఠానం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. షిండే స‌ర్కారులో బీజేపీ పాలుపంచుకోవాల‌ని నిర్ణ‌యించింది. అంతేకాకుండా దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ను షిండే కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా చేరాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా నుంచి వ‌చ్చిన‌ ఈ ప్ర‌తిపాద‌న‌కు ఫడ్న‌వీస్ తొలుత అంగీక‌రించ‌లేదు. షిండేనే సీఎంగా ఉంటార‌ని తానే ప్ర‌క‌టించాన‌ని, అంతేకాకుండా షిండే స‌ర్కారుకు బీజేపీ బ‌య‌టి నుంచి మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ప్ర‌క‌టించానని న‌డ్డాకు ఫ‌డ్న‌వీస్ వివ‌రించారు. అయితే పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు డిప్యూటీ సీఎంగా చేరాల్సిందే అంటూ ఫ‌డ్న‌వీస్‌కు న‌డ్డా సూచించారు. అప్ప‌టికీ ఫ‌డ్న‌వీస్ అంగీక‌రించక‌పోవ‌డంతో రంగంలోకి దిగిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా… ఆయ‌నతో ఫోన్‌లో మాట్లాడారు. అమిత్ షా స‌ర్దిచెప్ప‌డంతో డిప్యూటీ సీఎంగా ఉండేందుకు ఫ‌డ్న‌వీస్ అంగీకరించారు.

LEAVE A RESPONSE