సంగ్రామయోధుడి సభకు రావాలని మరో సంగ్రామం!

జగన్…రఘురామ..
మధ్యన మోడీ..
అదెంత ఢీ..
ఇది జరిగేనా…
భీమవరం వేదికగా..ప్రధాని సాక్షిగా జూలై 4న జరగనున్న అల్లూరి సీతారామరాజు
విగ్రహావిష్కరణ సభకు నర్సాపురం ఎంపి కనుమూరి
రఘురామరాజు హాజరవుతారా..ఆయన్ను హాజరు కానివ్వకుండా
ఇప్పటికే పెద్ద తలకాయ మహాజరు జారీ చేసే విమానం ఎక్కిందా..!?

సొంత నియోజకవర్గం..
మహనీయుడే గాక
స్వకులానికే చెందిన
స్వతంత్ర సమరయోధుడు
అల్లూరి విగ్రహావిష్కరణ..
చేస్తున్నది సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..
రాకుండా ఎలా ఉండడం..
ఇది రఘురాముని సంకల్పం..
అసలు రానిస్తారా..
అలా చేసి రాణిస్తారా…
ఇది మీమాంస..
వస్తే..ఊరికే వదులుతారా..
అరెస్ట్ చేస్తారేమో..
ఇది డౌటు..
మొత్తానికే లేపేస్తారేమో..
ఇది అతి పెద్ద అనుమానం..
మొత్తంగా ఇదంతా సందేహాల సందోహం..!

మొన్నామధ్య అరెస్టు చేసి
అతి ప్రమాదకరమైన నేరస్థుడో..అత్యంత భయంకరమైన తీవ్రవాదో
అన్నట్టు చిత్రహింసల పాలుచేసిన ఉదంతం అనంతరం సొంత రాష్ట్రానికి..
నియోజకవర్గానికి..
ఇంటికి దూరంగా
ఢిల్లీలో కాలం వెళ్ళబుచ్చుతున్న
రఘురామా..అయ్యో రామా
ఇప్పుడు ఇంతటి కార్యక్రమానికి రావడానికే
సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న దుస్థితి…!

ప్రధాని హంగామాలో
భాగంగా ఉండే విహంగాల్లో
ఒక దానిలో
రావాలని ప్రయత్నం..
అనుమతి కోసం నిరీక్షణ..
వచ్చినా కొంచెం ముందుగా వేదిక చేరుకుని ప్రధానికి స్వయంగా స్వాగతం చెప్పాలని తాపత్రయం..
అప్పుడే మూసేస్తే..
సభ రసాభాస అయిపోయిందని
ఆయన ఉవాచ..
జనాలు ఊరుకోరని నమ్మకం!

ఒకవేళ అంతవరకు
ఆగి ప్రధాని నిష్క్రమించాక
చుట్టు ముట్టేస్తే ..
కిం కర్తవ్యం..
మొత్తానికి ముందో..ఎనకో ఖచ్చితంగా మూసేస్తారని రఘురామాకి సందేహాన్ని మించి నమ్మకం..
అనుమానం కంటే విశ్వాసం..
దౌటును మించిన నో డౌటు..!
ప్రత్యర్థుల కాటు..
తప్పదనుకుంటే వేటు..
మరేంటో ఆయన రూటు
సమీపిస్తున్న డేటు..!!

తనతో కలిసి..
ప్రధానితో మెలిసి..
వేదికను పంచుకోవలసి వస్తే
అప్పుడది పెద్ద తలకాయకు
వేడుక కాదని..
అసలు ఆయనకు అలా
రాజీ పడడం వాడుకే కాదని
రఘురామ అభిప్రాయం..
అభియోగం..!

రావాలని ఆయన కల..
భీమవరంలో
సిద్ధంగా ఉందా వల..
నిజానికి అలాంటి వేడుకలో
ప్రజాప్రతినిధులందరూ..
ముఖ్యంగా స్థానిక ఎంపి
ఉంటేనే కళ..
ఉండకుండా చెయ్యడమే
కొందరు పెద్దల మర్మకళ..!

వెళ్లాలని ఒకరి ఉత్సాహం..
ఆపాలని ఇంకొకరి ప్రోత్సాహం..
జరిగితే ఉత్పాతం..
జనాల భయోత్పాతం..
ఏం జరుగుతుందో చూడాలని కొందరి ఉత్సుకత..
మొత్తానికి సర్వత్రా ఉత్కంఠ!

మొదలైన కౌంట్ డౌన్..
ప్రధాని సభలో..
ముందు గాని..
వెనక గాని..
లోక్ సభ సభ్యుడిని
అరెస్టు చేస్తే..
ప్రజాస్వామ్యమే డౌన్ డౌన్!!

– ఇ సురేష్ కుమార్
9948546286

Leave a Reply