ఏపీలో సినిమా టికెట్లపై ఆన్లైన్లో విక్రయం కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
సినిమా టికెట్లను ప్రభుత్వమే విక్రయించేలా, అది కూడా ఆన్లైన్ వేదికగా విక్రయించేలా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఓ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం వల్ల సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతుందంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై తుది వ్యాజ్యాల విచారణను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.