-దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ, అన్నవరం, పెనుగ్రంచిబ్రోలు, సింహాచలం, వాడపల్లి,అయినవిల్లి దేవాలయాలలో ఆన్ లైన్ సేవలు, సౌకర్యాలు ప్రారంభిస్తాం. ఈ నెల 20 నుంచి ఆన్ లైన్ సౌకర్యాలు ప్రారంభమవుతాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండే మరో పది దేవాలయాలలో ఆన్ లైన్ సౌకర్యాలు కల్పించాలని భావిస్తున్నాం. పదోన్నతులపై కసరత్తులు కొనసాగుతున్నాయి..ఇప్పటికే ముగ్గురికి డిసిలగా పదోన్నతులు ఇచ్చాం.
అక్టోబర్ పదిన ధార్మిక పరిషత్ తొలి సమావేశం నిర్వహిస్తాం. ట్రిబ్యునల్ లో పెండింగ్ లో కేసులు పరిష్కారంపై దృష్టి సారించాం…ఇప్పటికే చైర్మన్ ఉన్నారు..రిటైర్డ్ ఐఎఎస్ పద్మ ని మెంబర్ గా నియమించాం. తొమ్మిది స్టాండింగ్ కౌన్సిల్ త్వరలోనే నియమించనున్నాం. ప్రతీ మంగళవారం దేవాదాయ శాఖపై సమీక్షిస్తున్నాం.
దసరా ఉత్సవాలపై కూడా అదికారులతో మరోసారి సమీక్షించాం. విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో దసరా ఉత్సవాలకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఉచిత దర్సనాలు, 300 రూపాయిల దర్సనాలకి వచ్చేవారికి ఘాట్ రోడ్ ద్వారా అనుమతి. సామాన్య భక్తులకి ఇబ్బంధి కలగకుండా విఐపిల కోసం ప్రత్యేక టైం స్లాట్ ని కేటాయిస్తున్నాం. విఐపిలకి బ్రేక్ దర్సనానికి ప్రత్యేక టైం స్లాట్ లు కేటాయిస్తున్నాం.
ఉదయం 3 గంటల నుంచి 5…6 నుంచి 8, పది నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు వీరికి దర్సనాల టైం కేటాయించాం …రెండు గంటల స్లాట్ లో రెండు వేల చొప్పున విఐపి టిక్కెట్లు ఇవ్వనున్నాం…500 రూపాయిల నిర్ణీత రుసుము ఉంటుంది.
ఇందులో 600 టిక్కెట్లు విఐపిలకి…మిగిలిన 1400 టిక్కెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతాం. సామాన్య భక్తులు తెల్లవారుఝామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్సనాలకి అవకాశం కల్పిస్తాం. భక్తులెవవరికీ అంతరాలయ దర్సనం ఉండదు. ఎమ్మెల్యేకి ఒక సిఫార్సు లేఖ ద్వారా ఆరుగురికి మాత్రమే 500 రూపాయిల టిక్కెట్ దర్సన అవకాశం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిఫార్సు లేఖలు ఇస్తాం. రోజుకి 70 వేల మంది భక్తులు వస్తారని భావిస్తున్నాం…మూలా నక్షత్రం రోజున రెండు లక్షల మంది భక్తులు రావచ్చని అంచనా.
విఐపిల కంటే సామాన్య భక్తులకే ప్రాదాన్యతనివ్వాలని ఆదేశించాం. ఇఓ అనుమతితో నిర్ణీత సమయంలో వాలంటీర్ల సేవలు…వారికి కూడా సేవలు అందించడానికి క్యూ ఆర్ కోడ్ తో ఒక సమయాన్ని కేటాయిస్తాం. సిసి కెమారాలు గతంలో ఉన్న 220 నుంచి 300 లకి పెంచుతున్నాం. సామాన్య భక్తులకి 15 నుంచి 45 నిమిషాల లోపు దర్సనం పూర్తి అవుతుందని ట్రైల్ రన్ లో గుర్తించాం. కేశ ఖండనశాల దగ్గర 700 షవర్స్ ఏర్పాటు చేస్తున్నాం. దసరా మహోత్సవాల నిర్వహణకి ఉత్సవ కమిటీని నియమిస్తాం.