Suryaa.co.in

Entertainment

బొబ్బిలిపులి.. ఎన్నిమార్లు చూడాలి..!

విడుదలై నలభై ఏళ్ళు..

మేజర్ చక్రధర్..
ఎన్టీఆర్ నటవిశ్వరూపం..
కోర్టు సీనులో నటరత్న గర్జన
మిత్రుడి తల్లి మరణంతో
అద్భుత గీతం..
జననీ జన్మభూమిశ్చ
స్వర్గాదపీ గరీయసి..
ప్రేక్షకుల కళ్ళు మెరిసి..
అన్న అభినయానికి
తెలుగు తల్లి మురిసి..
అదిరింది బొబ్బిలిపులి..
జనాలు వెర్రెక్కి చూసారు
థియేటర్లకు తరలి..తరలి!

మీ పేరు..బొబ్బిలి పులి..
అసలు పేరు..బొబ్బిలి పులి..
తల్లిదండ్రులు పెట్టిన పేరు బొబ్బిలిపులి..బొబ్బిలి పులి
ఎన్నిసార్లు చెప్పాలి…
ఎదురుగా శ్రీదేవి..
సినిమా హాళ్ళలో జనం..
ఒక్కసారిగా నిశ్శబ్దం..
తర్వాత ఏంటి..
ఉత్కంఠ..
న్యాయస్థానాల తీరుపై
చక్రధర్ తూటాలు..
ఎన్టీఆర్ ఎగరేస్తూ ముక్కుపుటాలు…
అదిరిపోయే డైలాగులు
పుటలు పుటలు..
మూడు ఆటలు..
మూడు పూటలు..
జనమే జనం..
నందమూరికి అచ్చొచ్చే
ప్రభంజనం..!

ఈ సినిమా దాసరి తపస్సు..
రాజకీయ అరంగేట్రం ముందు పెంచాలని
ఎన్టీఆర్ యసస్సు..
ఉర్రూతలూగించే
నందమూరి నటన..
సెన్సార్ ప్రతిఘటన..
అంతటి దర్శకరత్న
దాసరికీ సవాలు..
సెన్సార్ బోర్డుపై శివాలు..
చివరకు రాష్ట్రపతి నీలం మెచ్చి..నచ్చి ఓకే..
నలభై ఏళ్ల క్రితం
ఇదే రోజున విడుదల..
థియేటర్లు కళకళ..
బొబ్బిలి పులి
విసిరింది పంజా..
ఆ రూపం..ఆ వాడి..
ఆ వేడి..నీరాజనాలు..
ఎన్టీఆర్ నభూతో..నభవిష్యత్
అనడానికి లేదు..
ఏ సినిమా అయినా
అన్న పులే..హౌస్ ఫుల్లే..!

ఇది ఒకటో నంబరు బస్సు..
అదే శ్రీదేవితో
కోర్టులో కస్సుబస్సు..
జయచిత్ర..
రావు గోపాలరావు..
జగ్గయ్య…కైకాల..
అల్లు..ప్రభాకరరెడ్డి..
మురళీమోహన్..
సహనటవర్గం..
అందరూ అన్న మార్గం..
ఇది ఎన్టీఆర్ సినిమా..
పులి పులిగా జీవించింది..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE