రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ, వరద సహాయక చర్యలను ఈ ప్రభుత్వం సమర్థవంతంగా చేపడుతుంది. గ్రామ సచివాలయాల్లోని వాలంటీర్ల మొదలు, జిల్లాల యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం, మంత్రుల వరకు వరద సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ప్రజలను సైతం భాగస్వాములను చేస్తూ వరద బాధితులను చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. వాస్తవాలు ఇలా ఉంటే.. చంద్రబాబు, ఆయనకు వంతపాడే ఎల్లో మీడియా ప్రభుత్వంపై బురదచల్లుతూ, వరదల సమయంలో కూడా రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి అక్కడకు వెళ్ళి, వారి ముందు నాలుగు ఫోటోలు దిగి, ఆర్భాటాలు చేయకపోవచ్చుగానీ, ప్రతిక్షణం సీఎం వరద పరిస్థితులపై అధికారులతో, మంత్రులతో సమీక్షలు నిర్వహిస్తూ.. ఆదేశాలు ఇస్తూ ఉన్నారు.
గడిచిన 36 ఏళ్లలో గోదావరికి ఇంత ఉద్ధృతంగా వరదలు వచ్చిన సందర్భాలు లేవు, 1986లో ఇంతకన్నా ఎక్కువగా వరదలు వచ్చాయని తెలిపారు. అయితే జూలై నెల మొదట్లో ఇంతస్థాయిలో వరదలు రావడం ఎప్పుడూ జరగలేదన్నారు. 27 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో వస్తే మొదట మేమంతా భయపడ్డాం. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ ను డిజైన్ చేసింది 28 లక్షల క్యూసెక్కులకు మాత్రమే.
ఒకవేళ వరద పెరిగి, 28-29 లక్షల క్యూసెక్కులకు వెళితే.. కాఫర్ డ్యాం కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడుతుందని భావించి, సీఎంఆదేశాల మేరకు, యుద్ధప్రాతిపదికన 30 లక్షల క్యూసెక్కులు వచ్చినా, పోలవరం డ్యామ్ దెబ్బతినకుండా ఉండేందుకు, ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు 2 మీటర్లు పెంచి తక్షణ చర్యలు చేపట్టారు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
వాస్తవాలు ఇలా ఉంటే.. వరదలు వస్తే సంబరాలు చేసుకోవడం, ప్రజలు కష్టాల్లో ఉంటే సానుభూతి పిండుకోవాలని చూసే ఒక దౌర్భాగ్యపు ఎల్లో దండు ఈ రాష్ట్రంలో ఉంది. వరద వచ్చినా, ఎండలు కాసినా, చలి వచ్చినా, ఏదో రకంగా ఈ ప్రభుత్వం మీద విషం చల్లాలి. సందర్భం దొరికినప్పుడల్లా చంద్రబాబును రాజకీయంగా పైకి లేపాలి అన్న దుర్బుద్ధితో ఓ వర్గం మీడియా విషపు రాతలు రాస్తున్నారు. ఈ ఆపద సమయంలో జగన్ మోహన్ రెడ్డి మీద విషపు రాతలు రాసి, చంద్రబాబుకు లబ్ధి చేకూర్చే విధంగా తాపత్రయపడే కొంతమంది వ్యక్తులు, సంస్థలు, పత్రికలు ఉన్నాయి.
విషపు రాతల రామోజీ.. నీ కెందుకు కడుపు మంట..?
ప్రధానంగా ఈనాడులో ఈరోజు ఏం రాశారు.. “పెద్దలకు తిండి లేదు.. పిల్లలకు పాల చుక్క లేదు” అంటూ విషపు రాతలు రాశారు. ఎందుకంటే, చంద్రబాబు 21న వరద ప్రాంతాలకు వెళుతున్నారట. వరద తగ్గిన తర్వాత, తమ్ముళ్ళూ చూశారా.. వరద వచ్చినా పట్టించుకోలేదు, తిండి అందలేదు, పిల్లలకు పాలు ఇవ్వలేదు అని చెప్పటానికి, ప్రజలను రెచ్చగొట్టి, వారిలో విషపు ఆలోచనలు రేకెత్తించి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారి మీద విషం చల్లాలన్నదే ఈ దుష్ట చతుష్టయం బ్యాచ్ ఆరాటం.
ఈ వార్తలను ఈటీవీ, ఏబీఎన్, టీవీ 5లలో హెడ్ లైన్ లలో చూపించి, చర్చలుపెట్టి, జగన్ మోహన్ రెడ్డి మీద ప్రజలు తిరుగుబాటు అన్నట్టుగా ప్రచారం చేయాలన్నదే వీరి కుట్ర. మీరు రాసే పిచ్చి రాతలకు.. జగన్ మీద వ్యతిరేకత వస్తుందా..?, రానే రాదు. మీరేంటో, మీ రాతల వెనుక ఉన్న దురుద్దేశాలు ఏమిటో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు.
తమ వాడికి అధికారం పోయిందన్న కడుపు మంటతోనే ఈనాడు రామోజీ తప్పుడు రాతలు రాస్తున్నాడు. చంద్రబాబు ఇక అధికారంలోకి రాలేడన్న ఏడుపుతో విషం చిమ్ముతున్నారు.
ఆ నలుగురికి రాజకీయంగా తిండి లేదు.. లోకేష్, పవన్ లకు పాలు లేవు
చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడులకు ఈరోజు రాజకీయంగా తిండి లేదు. అందుకే.. ఇటువంటి అడ్డగోలు రాతలు రాస్తూ, విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు పుత్రుడు లోకేష్, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ లకు పాలు లేవు. దాంతో వీళ్ళను ఆదుకోవడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో ఛానళ్ళు బయలుదేరాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాలనే చిత్తశుద్ధితో స్పెషల్ అధికారులను నియమించి, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరుగురు కలెక్టర్లు నిరంతరం పనిచేస్తుంటే.. ఎందుకు బురదచల్లుతున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నాం. వరద బాధితులకు పునరావాస కేంద్రాల్లో రూ. 2 వేలు ఎప్పుడైనా ఇచ్చారా చంద్రబాబూ….?
ఇటువంటి ప్రభుత్వం చేసిన మంచికి సంబంధించి ఒక్క ముక్క రాయరు కానీ, గతంలో చంద్రబాబు హయాంలో అయితే పాలు, బిస్కెట్లు, భోజనం పెట్టేవారని, వారి హయాంలో బహు గొప్పగా ఉందని, ఆహో..ఓహో అని సిగ్గు, ఎగ్గూ లేని రాతలు రాస్తున్నారు. ఇటువంటి విషపు రాతలు రాయటం వల్ల చంద్రబాబుకు అధికారం వస్తుందని కలలు గంటున్నారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నిప్పులు చల్లాలని, బురద చల్లాలని అనుకుంటే.. ఆకాశం మీద ఉమ్మి వేస్తే.. ఏం జరుగుతుందో మీకూ అదే శాస్తి జరుగుతుంది. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలలో తాను స్వయంగా పర్యటించినప్పుడు కూడా.. కొన్ని లంక గ్రామాల్లో, పిల్లాజెల్లల్ని అయితే పునరావాస కేంద్రాలకు తరలించాం, వారికి అన్ని ఏర్పాట్లు చేశాంకానీ, పశువుల కోసం అని కొంతమంది ఇంకా లంకలను విడిచి రావటం లేదు. అటువంటి ప్రదేశాలకు వెళ్ళి మైకులు పెట్టి, వారిని రెచ్చగొట్టి ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తుంది. వరదల్లోనూ రాజకీయం చేసి, మీరు ఆనందం పొందాలనుకుంటే అది మీకు తాత్కాలికమే.
ఎప్పుడూ చెప్పేటట్టే.. అక్క ఆరాటమే తప్ప బావ బతకడు అన్నట్టు… చంద్రబాబు కోసం మీ ఆరాటమే తప్ప రాజకీయంగా ఆయన పైకి లెగవడు. ఇప్పటికే ప్రజలు చంద్రబాబును, ఆయన పార్టీని రాజకీయంగా సమాధి చేశారు. ప్రజల కోసం తాపత్రయపడుతున్న ప్రభుత్వం ఇది. వరద బాధితుల మనోభావాలను తెలుసుకుని ముందుకు వెళ్ళే ప్రభుత్వం ఇది.. అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
పోలవరం ప్రాజెక్టు విషయానికొస్తే..
డయాఫ్రం వాల్ మునిగిపోవడం టీడీపీ చారిత్రక తప్పిదం అని అంటే.. అంబటి రాంబాబు ఆంబోతు అని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు చేస్తున్నాడు. నేను ఆంబోతు అయితే.. నీవు ఏమన్నా ఆవువా.. గేదవా.. లేకపోతే కేసి ఆర్ చెప్పినట్టు అటూ ఇటూ కాని శిఖండివా..?
నాకు మాత్రమే అన్నీ తెలుసనని అహంకారంతో, అహంభావంతో దేవినేని ఉమ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. ఆయనే అపర మేధావి అనుకుంటున్నాడు. మాకు తెలియకపోతే, అధికారులను అడిగి తెలుసుకుని మాట్లాడతాం. అతనిలా అహంభావంతో మాట్లాడం. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు, సోమవారం పోలవారం అని పెట్టుకుని 40 సార్లు పోలవరం వెళ్ళారు.. పోలవరం 70 శాతం పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న దేవినేని ఉమను, చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాను. 1995లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పోలవరానికి శంఖుస్థాపన చేయాలని ఎందుకు అనుకోలేదు?. దివంగత నేత వైఎస్ఆర్ గారు ఆలోచన చేసి, కేంద్రం నుంచి అనుమతులు తీసుకువచ్చి, కాలువలు తవ్వి, ఆ ప్రాజెక్టును ప్రారంభిస్తే, చంద్రబాబు నాయుడు అప్పుడు ఎక్కడున్నాడు..?
1995 నుంచి 2004 వరకు టీడీపీ ప్రభుత్వమే ఉంటే.. ఎందుకు పోలవరం కట్టాలని ఆలోచన కూడా చేయలేదు. దీనికి సమాధానం చెప్పి, ఆ తర్వాతే విమర్శలు చేయండి.
అలానే, 2018కి పోలవరం నుంచి నీళ్ళు ఇచ్చి చూపిస్తాం.. అపర భగీరథుడు చంద్రబాబు, రాసుకో.. రాసుకో అని ప్రగల్భాలు పలికిన మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు…? దీనికి సమాధానం చెప్పండి.
2018లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతగాని వాళ్ళు మీరా.. మేమా.. నిద్రపోయింది మీరా.. మేమా..?
పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి కారణం ముమ్మాటికీ మీ అహంకారం, మీ తెలివి తక్కువతనం, మీ తొందరపాటు చర్యే. అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి మీ అసమర్థత. మీ దద్దమ్మతనం కాదని చెప్పగలరా..?
పోలవరంపై చర్చిద్దాం అసెంబ్లీకి రండి అంటే పారిపోతారేం..
పోలవరం ప్రాజెక్టుపై చర్చించాలంటే నిర్మాణాత్మకంగా జరగాలి. పోలవరం, తాడేపల్లిలో కాదు చర్చించాల్సింది. మీరు బయలుదేరి, మేము బయలుదేరి, పోలీసులు అడ్డుకుని, మీడియాలో రచ్చ చేయడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. పోలవరంపై నిర్మాణాత్మకంగా చర్చ జరగాలి అంటే, శాసన సభ వేదికగా చర్చిద్దాం.. రా.. అని చంద్రబాబును అడిగాం. నీకు చేతనైతే, మీ బాసు చంద్రబాబును నువ్వు అయినా ఒప్పించి తీసుకురా. ఎటూ నీవు అసెంబ్లీకి రాలేవు. మాట్లాడితే, మీరు ఏం పీకారు అంటున్నావు కదా.. గతంలో నీవు గెలిచి, మంత్రిగా ఉన్న మైలవరం నుంచి నిన్ను పీకేశామా.. లేదా..?
కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా, డయాఫ్రం వాల్ ఎక్కడైనా కడతారా.. ? కాఫర్ డ్యామ్ చేయపోయినా ఫర్వాలేదు, సగం చేసి, గోతులు పెట్టడంవల్లే, డయాఫ్రం వాల్ మునిగిపోయింది. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబు, అపర మేధావి ఉమాలే. మీలాంటి అతి తెలివ వాళ్ళ వల్ల జరిగిన వందల కోట్ల నష్టం అది. మీరు అపర మేథావులు కాబట్టే.. ఇన్ని తప్పులు చేశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మాట్లాడు దేవినేని ఉమా.. నీవే ఏదో మోతుబరిలా అహంభావంతో మాట్లాడమాకు, తగ్గించుకో..
పోలవరం పూర్తి చేయడానికి ప్రతిక్షణం మేం తాపత్రయపడతాం. వైఎస్ఆర్ ప్రారంభించిన ప్రాజెక్టును మేమే పూర్తిచేస్తాం. చంద్రబాబు, లోకేష్ పవవన్ కల్యాణ్, బీజేపీ, సీపీఐ, సీపీఎం ఎంత మంది కట్టకట్టుకొని వచ్చినా.. ఒక్కడుగా ఎదుర్కోగల సమర్థుడు జగన్ . ఇప్పటికైనా పిచ్చి మాటలు మాట్లాడటం మానండి.