శ్రీ కృష్ణాష్టమి నాడు ఆవిర్భవించిన విశ్వహిందూ పరిషత్ అప్రతిహత విజయాలతో ముందుకు…
విశ్వహిందూ పరిషత్…. ఈ పేరు ఇటీవల కాలంలో ప్రపంచ దేశాల్లోని ప్రజల నోళ్లలో నానుతున్న ధార్మిక పదం…. అయోధ్య రామ జన్మభూమి కేసు సుప్రీం కోర్టులో విజయం సాధించిన నవంబర్ 9 2019 నుంచి మొన్నటి రామమందిర నిర్మాణ భూమిపూజ (ఆగస్టు 5, 2020)నాటికి అందరి మదిలో మెదిలి.. చర్చకు మూలమైన విశ్వహిందూ పరిషత్ గురించే….
1964 లో శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభ పర్వదినాన ఆర్.ఎస్.ఎస్ రెండవ చీఫ్ మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ) నేతృత్వంలో విశ్వహిందూ పరిషత్ పురుడుపోసుకుంది..
ముంబై మహానగరంలోని సాందీపని ఆశ్రమం వేదికగా సంస్థ అంకురార్పణ జరిగింది. మొట్టమొదట స్వామి చిన్మయానంద సరస్వతి అధ్యక్షులుగా వి. హెచ్ .పి కార్యక్షేత్రం లోకి అడుగుపెట్టింది. అనేక మైన సంఘర్షణలు, ఆందోళనలు, నిర్మాణాత్మక కార్యక్రమాలతో… దినదినాభివృద్ధి చెందుతూ …శాఖోపశాఖలుగా దేశ వ్యాప్తంగా విస్తరించి… సమాజమంతా ప్రభావిత స్థాయిలో వేళ్ళకు పోయేలా తన కృషి అమోఘం అయిందని చెప్పవచ్చు….
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్.ఎస్.ఎస్ అనుబంధంగా ఉంటూ …ధార్మిక సామాజిక సేవా రంగాల్లో కార్యకలాపాలు విస్తరించింది .
దాదాపు 17 ప్రధాన విభాగాల్లో హిందూ జీవన విధానం పై ప్రపంచానికి అవగాహన కల్పిస్తూ నిస్వార్థ కృషి సల్పుతున్నది. 1983లో వి .హెచ్. పి ప్రతిష్టాత్మకంగా “ఏకాత్మకం యజ్ఞం” నిర్వహించింది .నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 (1983)లో సామాజిక సమరసతా భావం నింపేందుకు… అంటరానివారు, దళితులు అనే భావన విడనాడి “సకల హైందవ జాతి ఒక్కటే “అని చాటి చెప్పింది .
సామాజిక దురాచారాలను రూపుమాపేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో రూపొందించింది.
మీనాక్షి సంఘటన:-
1981 ప్రాంతంలో తమిళనాడు కేంద్రంగా హిందువులను మతం మార్చేందుకు భారీ కుట్ర జరిగింది. “తిరువెళ్లి” అనే గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన దాదాపు 180 మంది పేద కుటుంబాల వారిని మతం మార్చారు… దళితులంతా హిందువులు కాదని హిందుత్వం దళిత వ్యతిరేకి అని అసత్యాల నూరిపోసి దళిత సామాజిక వర్గాన్ని మొత్తం వేరే మతం లోకి మార్చేందుకు భారీ స్థాయిలో పెద్ద కుట్ర సాగింది…. దీంతో వి.హెచ్. పి రంగంలోకి దిగి భారీ ఎత్తున యావత్ భారత దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టి సమస్యను ప్రజల్లోకి తీసుకు వెళ్ళింది.
ఈ విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తి మతమార్పిడి మాఫియా కోరలు పీకింది .అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ స్పందించేలా చేసింది. దళిత సామాజిక వర్గాన్ని గద్దలా ఎగరేసుకు పోవాలి… అనుకునే మతోన్మాదుల ఆటలు చిత్తు చేసింది వి.హెచ్. పి.
ఈ సంఘటన ఆధారంగా యావత్ హిందూ సమాజం జాగృతమై ఎక్కడి కక్కడ ప్రతిఘటించే వాతావరణం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది.
అయోధ్య ఉద్యమం:-
గ్రామ గ్రామంలో కరసేవకులు, రామ భక్తులను తయారుచేసి హైందవ వీరులను తీర్చిదిద్దింది వి.హెచ్. పి. 1985 డిసెంబర్ లో మందిర నిర్మాణం కోసం “రామజన్మభూమి న్యాస్” ఏర్పాటు చేసింది.
” శ్రీ జగద్గురు రామానందాచార్య శ్రీ శివరామాచార్యజి మహారాజ్, అశోక్ సింఘాల్జి, వంటి బలమైన ధార్మికవేత్తలనేతృత్వంలో …లక్షలాది సాధుసంతులు ,స్వయం సేవకులు ఉద్యమించారు.
చిట్టచివరగా న్యాయబద్ధంగా దేశ అత్యున్నత న్యాయస్థానం భారత సుప్రీంకోర్టులో 2019 నవంబర్ 9న అయోధ్య ను సాధించిన ఘనత వి .హెచ్ .పి. దే.
ఏకాత్మక యజ్ఞం, మీనాక్షి సంఘటన, అయోధ్య ఉద్యమం ద్వారా హిందువులను కదిలించింది. ఈ మూడు ఉద్యమాల్లో విజయం సాధించింది. హిందువులకు ఆత్మవిశ్వాసం భరోసాను కల్పించింది. 1975లో సత్య వ్రతం నిర్వహించింది .
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండుసార్లు తిరుపతి కేంద్రంగా 1985 ,1988 సంవత్సరాల్లో “హిందూ మహా సమ్మేళ నాలు” నిర్వహించింది. లక్షలాదిగా పాల్గొన్న హైందవ సోదరులు హిందూ సంఘటన కోసం ప్రతిజ్ఞ తీసుకున్నారు… 1975లో కర్నూలులో జ్ఞానపీఠం ఏర్పాటు చేసింది వి. హెచ్. పి.
బాల బాలికల సంక్షేమం కోసం గిరిజన వికాస కేంద్రం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా అనాధ ఆశ్రమాలు, ఆవాసాలు ఏర్పాటు చేసి.. ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా నిర్వహిస్తోంది. గంగానది పవిత్రతను కాపాడాలని భారతమాత, గంగామాత యాత్ర నిర్వహించింది. దేశం నలుమూలల నుంచి ఆయా ప్రాంతాల్లోని నదుల నుంచి జలాలు తీసుకుని వచ్చి గంగలో కలిపి ప్రతిజ్ఞ చేసింది. గంగానది పవిత్రతను, ప్రాముఖ్యతను వివరిస్తూ దేశంలో మొట్టమొదటిసారిగా ఉద్యమం చేపట్టింది.
“గోమాత హిందువులకు ప్రత్యక్ష దైవం” కాబట్టి గోసంతతిని కాపాడేందుకు.. బజరంగ్దళ్ కార్యకర్తలు, అహర్నిశలు కృషి చేస్తున్నారు. గోవులే కాదు ప్రకృతిలోని ప్రాణికోటి, జీవకోటిని సంరక్షించేందుకు కంకణం కట్టుకొని పనిచేస్తోంది.
సామాజిక అసమానతలు ,ఆర్థిక ఒడిదుడుకులు ,నిరక్షరాస్యత, తెలియని తనం, అవగాహన లోపం కారణంగా …హిందూ సమాజంలోని చాలామంది ధర్మాన్ని వీడుతున్న హిందువులను మళ్లీ స్వధర్మం లోకి తీసుకు వచ్చేందుకు “ఘర్‌వాపసీ” నిర్వహించి స్వధర్మం లోకి మళ్ళీ ఆహ్వానిస్తోంది …..
“లవ్ జిహాద్” వలలో చిక్కుకున్న అమ్మాయిలకు కళాశాలలో, విద్యాలయాల్లో, అవగాహన కల్పిస్తూ ..తమను తాము రక్షించుకునే ఆత్మస్థైర్యాన్నిస్తూ.. వారిలో చైతన్యం నింపుతుంది. దేవాలయాల్లో జరిగే అక్రమాలు, అన్యాయాలను నిలదీస్తూ ఆలయాల పవిత్రతను కాపాడుతోంది .ప్రభుత్వం పోలీసుల నుంచి వేధింపులు సైతం ఎదుర్కొని హిందూ సంఘటనం కోసం విశ్వహిందూ పరిషత్ పని చేస్తోంది. కార్య విస్తరణలో వేలాదిమంది “పూర్తి సమయ కార్యకర్తలు” వారి జీవితాలను దేశం కోసం ,ధర్మం కోసం ,పవిత్రమైన మనసుతో త్యాగం చేస్తున్నారు.
విశ్వహిందూపరిషత్ ప్రచారకులు హిందూరక్షణ యజ్ఞంలో సమిధలు గా మారుతున్నారు .
ధర్మ సంస్థాపననే లక్ష్యంగా పనిచేస్తున్న సంస్థ వచ్చే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలనే మధురా ,కాశీ పుణ్యక్షేత్రాలను సైతం సొంతం చేసుకోవాలనే తపన లో విశ్వహిందూ పరిషత్ వేస్తున్న అడుగులు విజయ తీరాలను చేరాలన్నది సంకల్పం…
– పగుడాకుల బాలస్వామి
( విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్)
9912975753
9182674010
(విశ్వహిందూ పరిషత్ 58 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకం)