– AR కానిస్టేబుల్ ప్రకాష్ డిస్మిస్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్
ఇప్పుడెవరిని సస్పెండ్ చెయ్యాలి….డీజీపీనా? ఇప్పుడెవరిని డిస్మిస్ చెయ్యాలి…వైసీపీ ప్రభుత్వాన్నా? న్యాయం కోసం స్పందనలో ఫిర్యాదు చేసిన ఓ బాధితురాలిని మీ పాపానికి పావుగా చేసుకుంటారా? మీరు అక్రమంగా విధుల నుంచి తొలగించిన ఏఆర్ కానిస్టేబుల్ నిందితుడు కాదని స్వయంగా బాధిత మహిళే చెప్పింది. దీనికి సమాధానం చెప్పగలరా? మీరు ఖాకీలు అన్న విషయం కాస్తయినా గుర్తుపెట్టుకోండి. బకాయిలపై ప్రశ్నించిన సొంత శాఖ వ్యక్తిపైనే అక్రమకేసు పెట్టడం మీ పోలీసు శాఖకే మచ్చ అని గుర్తించండి. ఎండనక… వాననక… రాత్రనక..పగలనక డ్యూటీలు చేస్తున్న కిందిస్థాయి సిబ్బంది మీ చర్యలపై ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. మీరు చేసిన తప్పును ఇప్పటికైనా సరిదిద్దుకోండి.