-జైళ్లుకు వెళ్లి వచ్చిన వారికే అధికారం వచ్చిన తరువాత ప్రాధాన్యం!
-చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పేద అరుపులు అరిస్తే కుదరదు.ఉద్యమాలు చేసేప్పుడు కానిస్టేబుల్ ఇంటికి వస్తే మీ పని అయిపోయిందని బయటకు రావడంలేదని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులు,కార్యకర్తలను మందలించారు.
తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పోలీసుల వేధింపులపై జరిగిన చర్చలో చంద్రబాబు ఘాటుగా స్పందించారు.ఇప్పటివరకూ 3వేల కేసులు పోలీసులు నమోదు చేశారని అన్నారు.పోలీసులు ఇంటికి రాగానే భయపడి పేద అరుపులు ఆరవద్దని అన్నారు.పోలీసులు వచ్చినప్పుడు 5వేల మంది టిడిపి కార్యకర్తలు మొబలైజ్ అయితే ఏం చేయగలరని అన్నారు.పోలీసులు పెట్టిన కేసులు ఎదుర్కొనేందుకు 20 మంది న్యాయవాదులను పెట్టడంతో పాటు అవసరమైతే 2 కోట్లు ఖర్చు పెట్టేందుకు పార్టీ వెనుకాదడని బాబు భరోసా ఇచ్చారు. ఈ మూడేళ్ళలో ఎవ్వరు అయితే పార్టీ కోసం పోరాడారో, జైళ్లు కెళ్లి వచ్చారో పార్టీ ఆఫీకారంలోకి వచ్చిన తరువాత అన్నింటిలో వారికే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు.