Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్ యువగళం పాదయాత్రపై ఆంక్షలు ఎత్తేయండి

డీజీపీ, చిత్తూరు జిల్లా ఎస్సీ కి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ

టీడీపీ యువనేత లోకేష్ పాదయాత్రకు పోలీసు ఆంక్షలు ఎత్తివేయాలని ఆ పార్టీ పొలిట్‌బ్యూరోసభ్యుడు వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. లేఖ సారాంశం ఇదీ..

లోకేష్ యవగళం పాదయాత్రపై మీరు పెడుతున్న కండీషన్లు చూసి ప్రజాస్వామ్యవాదులు నివ్వెరపోతున్నారు. పలమనేరు డీఎస్పీ ఇచ్చిన ప్రొసీడింగ్ చూస్తుంటే పోలీసు వ్యవస్థ నడుస్తున్న తీరుపై అసహనం కలుగుతోంది. 2017 లో నేటి ముఖ్యమంత్రి పాదయాత్రకు నాటి ప్రభుత్వం ఇలాంటి కండీషన్లు పెట్టలేదు.

ప్రస్తుత ప్రభుత్వంలో పోలీసుశాఖ వారు లోకేష్ పాదయాత్రపై పెడుతున్న అప్రజాస్వామిక నిబంధనలు చూస్తుంటే జుగుప్స కలిగుతోంది. పాదయాత్రకు వచ్చే ప్రజలకు సమాచారాన్ని నియంత్రించేలా మైక్ సిస్టం, సౌండ్ సిస్టంపై నిబంధనలు విధించారు. ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా చూసుకోవడం, అత్యవసర సేవలు కల్పించే బాధ్యత కేవలం నిర్వహకులదని చెప్పారు.

నిర్వహకుల నుంచి కేవలం ఒక అండర్ టేకింగ్ తీసుకుని పోలీసులు తమ బాధ్యతల నుంచి ఎలా తప్పుకుంటారు?గతంలో ఎన్నడూ ఇలాంటి అసంబద్ధ నిబంధనలు విధించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, మహిళలు, యువత మొ.లగు వర్గాలు లోకేష్ గారితో సమావేశమయ్యే క్రమంలో సౌండ్, మైక్ సిస్టంలను ఏర్పాటు చేస్తారు.

గతంలో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వై.ఎస్ షర్మిల, జగన్ రెడ్డిల పాదయాత్రలలో సైతం సౌండ్, మైక్ సిస్టంలపై ఎటువంటి నిబంధనలు విధించలేదు.కానీ, లోకేష్ పాదయాత్రకు ఏకపక్షంగా పోలీస్ డిపార్ట్ మెంట్ మూడు రోజులకు మాత్రమే అనుమతి ఇవ్వడం దుర్మార్గం. 2017 లో నేటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన పాదయాత్రకు తగు భద్రతా ఏర్పాటు కల్పించాలని నాటి ప్రభుత్వం అన్ని జిల్లాల ఎస్సీలకు ఆదేశాలు జారీ చేసింది.

శాంతియుతంగా పాదయాత్ర చేసుకునేందుకు లోకేష్ కు పోలీసు శాఖ అటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం.లోకేష్ యువగళం పాదయాత్రపై ప్రభుత్వం, పోలీసులు పెడుతున్న కండీషన్లు రాజ్యాంగ వ్యతిరేకం, పౌరుల ప్రాధమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉన్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు రూల్ ఆఫ్ లా పాటించడం లేదు.యాత్రలు శాంతియుతంగా, సాఫీగా జరిగేలా చూసుకునే బాధ్యత కేవలం నిర్వాహకులదే అని ఏ ప్రజాస్వామిక ప్రభుత్వం చెప్పదు.

పాదయాత్రలపై ఇటువంటి అసంబధ్ధ నిబంధనలు స్వతంత్ర్య భారతదేశ చరిత్రలో ఎన్నడూ విధించలేదు. ప్రజలకు భధ్రత కల్పించడం, ప్రజాస్వామికంగా రాజకీయ కార్యకలాపాలు సాఫీగా సాగేలా చూడాల్సిన భాధ్యత పోలీసులది. శాంతిభద్రతలకు విఘాతం అనే పేరుతో పోలీసుల తమ బాధ్యతల నుంచి తప్పకుని ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల మూలస్థంభాలైన రాజకీయ కార్యకలాపాలను స్థంబింపచేయలేరు.

ఇటువంటి పరిస్థితులలో సౌండ్, మైక్ సిస్టంలకు అనుమతులు మంజూరు చేసి పాదయాత్ర సాఫీగా జరుగుటకు ప్రజలకు తగు భధ్రతా ఏర్పాటు చేయండి. ప్రతీ మూడు రోజులకు పర్మిషన్ ఇచ్చే అసంబద్ధ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని పాదయాత్రకు తగు భధ్రత ఏర్పాట్లు చేసేలా రాష్ట్రంలోని అన్నీ జిల్లా ఎస్పీ, డీఎస్పీలకు ఆదేశాలు జారీ చేయండి.

LEAVE A RESPONSE