టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో పయ్యావుల కేశవ్
జగన్మోహన్ రెడ్డి జీవితం యావత్తు అవినీతిమయం. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏదైతే అవినీతి జరిగిందో నేడు అలాగే ఇప్పుడు అప్ డేట్ వర్షన్ ను జగన్ రెడ్డి తీసుకువచ్చారు. లాండ్, శాండ్, వైన్, మైన్ లో 2 లక్షల కోట్ల అవినీతిని ఈ మూడేళ్లల్లో దోచుకున్నారు. నాడు వైఎస్ లేపాక్షిలో 9వేల ఎకరాలు రైతుకు ఇచ్చింది రూ. 2లక్షలు. బెంగళూరు ఎయిర్ పోర్టు కు 120 కి.మీ. దూరంలో కియా కంపెనీ ఉంది అక్కడ భూమి విలువ రూ.2 కోట్లు. అలాంటిది ఎయిర్ పోర్టు కు కేవలం 60 కి.మీ. దూరంలో ఉన్న భూమి కేవలం రూ.7 లక్షలు మాత్రమేనా? వైఎస్ లేపాక్షిలో రూ. 2లక్షలు రైతులకు ఇచ్చారు. అదే భూమిని తనఖా పెట్టి రూ.4వేల కోట్లు ఇందూ ప్రాజెక్టు లోన్ తీసుకొని ఆ నిధులను మళ్లీ వారి సంస్థలకే మళ్లించుకున్నారు. ఇందు సంస్థ నేడు దివాళా తీస్తే ఆ భూమి విలువ మాత్రం నేడు కేవలం రూ. 500 కోట్లు మాత్రమే అంటున్నారు. 9వేల ఎకరాలను ఎకరా కోటి రూపాయలు తీసుకున్న రూ.9వేల కోట్లు అవుతుంది. ఆ భూములకు టెండర్లు వేస్తే జగన్మోహన్ రెడ్డికి చెందిన రాంకి, అరబిందో, ఎర్త్విన్ కంపెనీలే వచ్చాయి. ఒక్క లేపాక్షిలోనే రూ.25వేల కోట్లు దోచుకున్నారు. మనం ఏరోజైతే ఈ విషయాన్ని భయటపెట్టామో దానిని మళ్లించేందుకు కుప్పంలో దాడి చేశారు. నేడు ఎఫ్ ఐ ఆర్ అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ రిపోర్టుగా మారింది. 20వేల ఎకరాలకు సంబంధించిన వాన్ పిక్ భూమిని చిన్న టెన్నికల్ అంశాన్ని కోర్టులోకి తీసుకువెళ్లారు. అందులో ఎకరా కోటి రూపాయలు వేసుకున్న రూ.20వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారు. కాకినాడ సెజ్ 6వేల ఎకరాలు. ఈ ప్రభుత్వం రాగానే అన్ని తారుమారు చేశారు. లేపాక్షి, వాన్ పిక్, కాకినాడ సెజ్ లోనే రూ.50వేల కోట్లు అవినీతిని పాల్పడ్డారు.
రాష్ట్రంలో వైన్ మాఫియా విచ్చల విడిగా పెరిగిపోయింది. దేశంలో మొట్ట మొదటి సారిగా ఈ.ఎన్.ఎస్. (ఎక్ట్స్రా న్యూట్రిల్ ఆల్కాహాల్) నుంచి మాత్రమే తయారు చేయాలన్న నిబంధనను టీడీపీ తీసుకువచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తే నేడు మాత్రం విచ్చలవిడితనం అయ్యింది. నేడు ఇక్కడ దొరికే మద్యం బ్రాండ్ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. చంద్రబాబు హయాంలో ఏపీ బివరేజెస్ నుంచి సీఎంఆర్ ఎఫ్ కు నిధులు మళ్లించే వారు. కాని నేడు చీఫ్ మినిస్టర్ రెవిన్యూ ఫండ్ లా మారింది.
చంద్రబాబు నాయుడు ఇసుకను ఉచితం చేస్తే నేడు జగన్ రెడ్డిని శాండ్ మాఫియా పేరుతో దోచుకుంటున్నారు. నెల్లూరు లో సిలికా మైన్, ప్రకాశం లోని బ్లాక్ గ్యాలెక్సీలన్ని, పాడేరులో బాక్సైట్ ను సైతం ఆంక్షలు ఉన్నా పట్టించుకోకుండా తవ్వుకుంటున్నారు. ఓబులాపురం మైన్ చేసుకుంటానని గాలిజనార్ధన్ రెడ్డి సుప్రీంకోర్టును కోరుకుంటే ఆ తరువాత రోజే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డిల మైత్రి ఏంటో మనం గతంలో చూశాం.