తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణ రావు జ్ఞాపకార్ధం సీఎం కేసీఆర్ అదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక అవార్డ్ – 2022 కు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ ని ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ .
రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అదేశాల మేరకు తెలంగాణ కు చెందిన వైతాళికులు, కవులు, సాహితీ వేత్తలు, మేధావుల సేవలను భవిష్యత్ తరాలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం – భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక అవార్డు ఎంపిక కోసం రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ సిపార్సుల మేరకు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ సూచనల మేరకు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ గారిని ఎంపిక చేస్తూ సాంస్కృతిక శాఖ అధికారులు G o. No. 198 ను (ఉత్తర్వులు) జారీ చేశారు. ఈ అవార్డు క్రింద రూ. లు. 1 లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయల (1,01,116/-) నగదు ను, కాళోజీ గారి అవార్డు ను షీల్డ్ ను అందిస్తారు.