Suryaa.co.in

Telangana

సమర్థతకు పట్టం కట్టిన సీఎం రేవంత్ రెడ్డి

-ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గా చిన్నారెడ్డి నియామకం
-క్రమశిక్షణకు మారుపేరు చిన్నారెడ్డి
-4 సార్లు వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన చిన్నారెడ్డి
-వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామీణ అభివృద్ధి శాఖ -మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన చిన్నారెడ్డి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ సమర్థ నాయకులు, నాలుగుసార్లు (4) వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ వాది డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గా పట్టం కట్టారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
చిన్నా రెడ్డికి క్యాబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

రాజకీయాల్లో మిస్టర్ కూల్ గా, రాజకీయ చాణుక్యుడుగా పేరు గాంచిన జీ. చిన్నారెడ్డి క్యాబినెట్ మినిస్టర్ ర్యాంకు కలిగిన రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ పదవికి వన్నెతెస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

రాజకీయాల్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా క్రమశిక్షణకు మారుపేరు అయిన చిన్నారెడ్డి నాలుగు సార్లు వనపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

1989, 1999, 2004, 2014 నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన చిన్నారెడ్డి 2007 – 2009 కాలంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా, రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా, తెలంగాణ రీజినల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ గా, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా చిన్నారెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో మెఘా రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడం కోసం తన వంతు కృషి చేశారు. చిన్నారెడ్డి సమర్థతను గుర్తించి గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ హోదాలో రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు.

ఏమ్మెస్సీ ( agriculture ), ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బీ. పట్టా పొందిన చిన్నారెడ్డి పీ హెచ్ డీ డాక్టరేట్ ను మలేషియా యూనివర్సిటీ నుంచి పూర్తి చేశారు. మహబూబ్ నగర్ జిల్లా గోపాల్ పేట్ మండలం జయన్న తిరుమలపూర్ చిన్నారెడ్డి స్వగ్రామం. హై స్కూల్ విద్యాభ్యాసం వనపర్తి లో సాగింది.

గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ రాజేందర్ రెడ్డి హర్షం
రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గా జి చిన్నారెడ్డి నియామకం పట్ల రాష్ట్ర గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ , గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల తెలుగు రాష్ట్రాల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. .

LEAVE A RESPONSE