దొంగలను ఎదుర్కొనేలా నైపుణ్య శిక్షణ

– దొంగలను తరిమికొట్టిన తల్లీకూతుళ్లను అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

రివాల్వర్ తో బెదిరించి, దాడిచేసి చోరికి ప్రయత్నించిన దొంగలపట్ల ఏమాత్రం జంకకుండా ప్రాణాలకు తెగించి ధైర్యవంతంగా ఎదుర్కొని మహిళా సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నపుడు ఆత్మరక్షణ కోసం కరాటే, మార్షల్ ఆర్ట్స్ వంటివాటిల్లో శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ముఖ్యంగా అన్ని విద్యాసంస్థల్లోని అమ్మాయిలకు విధిగా కారాటే లాంటి సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకునే నైపుణ్యం కల్పించేలా ట్రైనింగ్ ఇస్తూ ఆత్మస్థైర్యం కల్పించాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి తో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విద్యాలయాల్లో విద్యార్థినులకు క్లిష్టమైన పరిస్థితుల్లో దొంగలను ఎదుర్కొనేలా నైపుణ్య శిక్షణను కల్పించేలా ట్రైనింగ్ ఇవ్వాలని కోరుతాను.

మానసిక ధైర్యంతో తెగించి దొంగలను ఎదుర్కొని, పోరాటం చేసి తల్లీబిడ్డలు అమిత, భవి, సమాజానికి స్ఫూర్తిగా నిలిచారు. ప్రధానమంత్రి గా కార్యాలయం నుంచి మాకు సందేశం వచ్చింది. అందుకు అనుగుణంగా భారత ప్రభుత్వం తరఫున వారికి అభినందనలు తెలుపుతూ అభినందనపత్రం ఇవ్వడం జరిగింది

 

Leave a Reply