Suryaa.co.in

Telangana

గీతక్క లాంటి వారు మంత్రివర్గంలో లేకపోవడం లోటు

– జె.ఈశ్వరీబాయి వర్దంతి కార్యక్రమంలో టీజీ సీఎం రేవంత్ రెడ్డి

ఆ రోజుల్లోనే అంబేద్కర్ స్పూర్తిగా రాజకీయాల్లో ఈశ్వరీబాయి తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లో రాణిస్తూనే గీతారెడ్డి ని డాక్టర్ చదివించారు. ప్రతీ పురుషుడి విజయం వెనకాల ఒక మహిళ ఉన్నట్లు గీతక్క ప్రతీ విజయంలో డాక్టర్ గారి సహకారం ఉంది. ఈ కార్యక్రమానికి హాజరు కావడం నేను బాధ్యతగా భావించా. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గీతారెడ్డి క్రియాశీలకంగా పనిచేశారు. ఆరోగ్య సమస్యలను పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పనిచేశారు అందుకే గీతక్క ఇంచార్జిగా ఉన్న నల్లగొండ జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచాం. గీతక్క లాంటి వారు మంత్రివర్గంలో లేకపోవడం ఒక లోటు. మంచికి, చెడుకు ఎప్పటికీ మాకు అండగా ఉండే అక్క గీతక్క. ఏ అవకాశం ఉన్నా వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది.

LEAVE A RESPONSE